iDreamPost
android-app
ios-app

ITI, డిప్లొమా పాసైతే చాలు.. 1,949 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ Jobs రెడీ..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారతీయ రైల్వేలో జాబ్ సాధించాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1949 అసిస్టెంట్ లోకోపైలట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారతీయ రైల్వేలో జాబ్ సాధించాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1949 అసిస్టెంట్ లోకోపైలట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

ITI, డిప్లొమా పాసైతే చాలు.. 1,949 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ Jobs రెడీ..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదలైంది. ఏకంగా 18,799 ఉద్యోగాలన భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టుల్లో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ లో మొత్తం 1,949 అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగాలకు ఐటీఐ, డిప్లొమా పాసైన వారు అర్హులు. ఈ ఉద్యోగాలను సాధిస్తే మంచి వేతనంతో పాటు లైఫ్ లో సెట్ అయిపోవచ్చు.

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్ భర్తీ కోసం గత జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 5,696 ఖాళీలు భర్తీ చేసేందుకు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే ఈ పోస్టులకు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే తాజాగా ఆ పోస్టుల సంఖ్యను 18,799గా పెంచుతున్నట్లు ఆర్‌ఆర్‌బీ భోపాల్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 18,799 ఏఎల్‌పీ పోస్టులు భర్తీ కానున్నాయి.

ఇందులో అత్యధికంగా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (సికింద్రాబాద్‌)లో 1,364 పోస్టులు పెరిగాయి. మొదటి నోటిఫికేషన్‌లో 585 పోస్టులు సికింద్రాబాద్‌ పరిధిలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజా ప్రకటనతో పోస్టుల సంఖ్య 1949కి పెరిగింది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతం ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్ కోసం పోటీపడే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఏఐసీటీఈ గుర్తింపు విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్‌ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జనవరిలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకున్న అభ్యర్థులకు త్వరలో ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ భోపాల్‌ స్పష్టం చేసింది. 18,799 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపింది.