వీడియో: RCB ప్లేయర్ కళ్లుచెదిరే క్యాచ్​.. ఈ సీజన్​లో ఇదే బెస్ట్!

GT vs RCB- VijayKumar Vyashk: గుజరాత్ జట్టుపై ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ విజృంభించింది. ఒక్క బౌలింగ్ లోనే కాకుండా.. ఫీల్డింగ్ లో కూడా బెంగళూరు జట్టు శభాష్ అనిపించింది. వ్యాష్క్ పట్టిన క్యాచ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

GT vs RCB- VijayKumar Vyashk: గుజరాత్ జట్టుపై ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ విజృంభించింది. ఒక్క బౌలింగ్ లోనే కాకుండా.. ఫీల్డింగ్ లో కూడా బెంగళూరు జట్టు శభాష్ అనిపించింది. వ్యాష్క్ పట్టిన క్యాచ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో వింటేజ్ ఆర్సీబీ వచ్చేసింది. గుజరాత్ మీద ఆర్సీబీ చేసిన ప్రదర్శన చూసి ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇది కదా మాకు కావాల్సింది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ జట్టుకు ఎక్కడా ఆస్కారం లేకుండా ఆర్సీబీ బౌలర్లు విజృంభించారు. మొదటి ఓవర్ నుంచి మెరుపు బౌలింగ్ తో జీటీని కట్టడి చేశారు. ఏ ఒక్కరు కూడా చెలరేగకుండా అవుట్ చేసి.. పెవిలియన్ చేరుస్తూ వచ్చారు. ఆఖరి ఓవర్లో మొదటి మూడు బంతులకు ముగ్గురు బ్యాటర్లు అవుట్ అయ్యారు. మూడు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ జట్టు 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో ఒక అద్భుతమైన క్యాచ్ కూడా ఉంది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ జట్టు మహా అద్భుతమే చేసేసింది. తమ అత్యుత్తమ ప్రదర్శనతో విజృంభించారు. రెండో ఓవర్లో పడటం మొదలైన వికెట్లు ఆఖరి ఓవర్ వరకు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, తెవాటియా కాస్త గుజరాత్ ను గట్టెక్కించే ప్రయత్నం చేసినా కూడా అది మాత్రం వారి వల్ల కాలేదు. ఈ సీజన్లో గుజరాత్ జట్టు మూడోసారి ఆలౌట్ అయ్యింది. ఈ సీజన్లో ఏ జట్టు కూడా ఇన్నిసార్లు ఆలౌట్ అవ్వలేదు. అలాగే పవర్ ప్లేలో కూడా అత్యల్ప స్కోర్(27/3)ని నమోదు చేసింది. పవర్ ప్లేలో అతి తక్కువ రన్ రేట్ ని నమోదు చేసింది. ఏ జట్టు కూడా అంత తక్కువ రన్ రేట్ నమోదు చేయలేదు.

ఈ మ్యాచ్ లో ఇంకో అద్భుతం కూడా జరిగింది. తెవాటియా కాస్త నిలదొక్కుకుని జట్టు స్కోర్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమయంలో యష్ దయాల్ ఇన్నింగ్స్ లో 18వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఓవర్లో ఆఖరి బంతిని కాస్త బౌన్సర్ గా వేశాడు. దానిని తెవాటియా భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. అది టాప్ ఎడ్జ్ తీసుకుని వెనుక వైపు బౌండరీ దగ్గరకు వెళ్లింది. కాస్త దగ్గర్లో ఉన్న వ్యాష్క్ పరుగున వచ్చి డైవ్ చేసి మరీ ఆ బంతిని అందుకున్నాడు. ఆ తర్వాత చాలా దూరం జారుకుంటూ వెళ్లిపోయాడు.

నిజానికి ఈ సీజన్ మొత్తంలోనే ఇది బెస్ట్ క్యాచ్ అని చెప్పచ్చు. ఒక ఇంపార్టెంట్ వికెట్ ని వ్యాష్క్ చాకచక్యంగా తీశాడు. ఇంక గుజరాత్ బ్యాటింగ్ లో కేవలం షారుక్ ఖాన్(37), తెవాటియా(35), మిల్లర్(30) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. ఇంక ఆర్సీబీ బౌలింగ్ చూస్తే.. సిరాజ్, యష్ దయాల్, విజయ్ కుమార్ వ్యాష్క్ లకు తలో 2 వికెట్లు దక్కాయి. గ్రీన్, కర్న్ శర్మలకు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేశారు. ఎక్కడా కూడా మిస్టేక్స్ చేయకుండా ఒక టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ చేశారు.

Show comments