iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీ ఔట్ వివాదం.. రూల్ మార్చాల్సిందే అంటున్న భారత మాజీ క్రికెటర్!

  • Published Apr 22, 2024 | 9:54 AM Updated Updated Apr 22, 2024 | 9:54 AM

కేకేఆర్​తో మ్యాచ్​లో విరాట్ కోహ్లీ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. అతడు ఔట్ అంటూ కొందరు, నాటౌట్ అంటూ మరికొందరు అంటున్నారు. ఈ విషయంపై ఓ టీమిండియా మాజీ క్రికెటర్ రియాక్ట్ అయ్యాడు.

కేకేఆర్​తో మ్యాచ్​లో విరాట్ కోహ్లీ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. అతడు ఔట్ అంటూ కొందరు, నాటౌట్ అంటూ మరికొందరు అంటున్నారు. ఈ విషయంపై ఓ టీమిండియా మాజీ క్రికెటర్ రియాక్ట్ అయ్యాడు.

  • Published Apr 22, 2024 | 9:54 AMUpdated Apr 22, 2024 | 9:54 AM
Virat Kohli: కోహ్లీ ఔట్ వివాదం.. రూల్ మార్చాల్సిందే అంటున్న భారత మాజీ క్రికెటర్!

ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆఖరి బంతి వరకు విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. హైస్కోరింగ్ గేమ్​లో ఎట్టకేలకు గెలుపు అయ్యర్ సేననే వరించింది. ఓడిపోయినా గానీ అందరి మనసులు గెలుచుకుంది బెంగళూరు. అయితే ఈ మ్యాచ్​లో విరాట్ కోహ్లీ ఔట్ అయిన తీరు కాంట్రవర్సీగా మారింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో కోహ్లీ నిన్న చాలా పట్టుదలతో ఆడాడు. 7 బంతుల్లోనే 1 బౌండరీ, 2 సిక్సుల సాయంతో 18 పరుగులు చేశాడు. అతడి ఊపు చూస్తుంటే మ్యాచ్ ఫినిష్ చేసేదాకా క్రీజులో నుంచి కదలను అన్నట్లుగా కనిపించాడు. అయితే హర్షిత్ రాణా వేసిన బీమర్​కు అతడు ఔట్ అయ్యాడు. రాణా వేసిన బాల్​ను డిఫెన్స్ చేయబోయాడు విరాట్. కానీ బాల్ లీడింగ్ ఎడ్జ్ తీసుకోవడంతో దాన్ని క్యాచ్ అందుకున్నాడు బౌలర్.

బాల్ నడుము కంటే ఎత్తులో రావడంతో అంతా దాన్ని నో బాల్ అనుకున్నారు. కానీ అది లీగల్ డెలివరీ అని థర్డ్ అంపైర్ నిర్ణయించడంతో అంతా షాకయ్యారు. కోహ్లీ ఆవేశం పట్టలేక అంపైర్లతో గొడవకు దిగాడు. వాళ్లు సర్దిచెప్పడంతో గ్రౌండ్​ను వీడాడు. కోహ్లీ బాల్​ను కనెక్ట్ చేసిన టైమ్​లో నడుము కంటే ఎక్కువ ఎత్తులోనే ఉంది. కానీ క్రీజులోకి వచ్చేసరికి డిప్ అయి వెస్ట్ హైట్ కంటే తక్కువ ఎత్తులో వెళ్తుండటంతో అతడ్ని ఔట్​గా ప్రకటించారు. కోహ్లీ ఔట్ వివాదంపై మాజీ క్రికెటర్ నవ్​జోత్ సింగ్ సిద్ధూ రియాక్ట్ అయ్యాడు. విరాట్ అనే కాదు.. ఏ ప్లేయర్​కైనా ఒకే న్యాయం ఉంటుందన్నాడు. ఈ రూల్ విషయంపై బీసీసీఐ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.

‘బాల్​ను కనెక్ట్ చేసిన టైమ్​లో కోహ్లీ తన అరికాళ్ల మీద 6 ఇంచుల ఎత్తులో ఉన్నాడు. దాన్ని ఎవరూ గుర్తించడం లేదు. అతడు క్లియర్​గా నాటౌట్. బీమర్ వేసి ఔట్ అనడం ఎంతవరకు కరెక్ట్? బీమర్​ను లీగలైజ్ చేస్తున్నారా? అలాంటి డెలివరీస్ వేశాక బౌలర్లు సారీ కూడా చెప్పడం లేదు. ఇది సరికాదు. రాణా వేసిన బాల్ కోహ్లీ బ్యాట్​ను తగిలినప్పుడు అది అతడి నడుము కంటే ఒకటిన్నర ఇంచుల ఎత్తులో ఉంది. అయినా బాల్ డిప్ అయింది కాబట్టి ఔట్ అంటున్నారు. ఈ విషయంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్​ కింద బ్యాటర్​ను నాటౌట్​గా ఇవ్వాలి. గేమ్​లో మరింత బెటర్​మెంట్ కోసం ఇలాంటి రూల్స్​ను మార్చాల్సిన అవసరం ఉంది. ఈ రూల్​ను తప్పక మార్చాలి. ఈ మ్యాచ్​లో బెనిఫిట్ ఆఫ్​ డౌట్ కింద కోహ్లీని నాటౌట్​గా ఇవ్వాల్సింది’ అని సిద్ధు చెప్పుకొచ్చాడు. మరి.. కోహ్లీ ఔట్ వివాదంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.