iDreamPost

స్టార్క్​ను ఏడిపించిన RCB స్పిన్నర్.. గల్లీ బౌలర్​ను చేసుకొని ఆడుకున్నాడు!

  • Published Apr 22, 2024 | 8:42 AMUpdated Apr 22, 2024 | 8:42 AM

25 కోట్ల ఆటగాడైన మిచెల్ స్టార్క్​ను ఓ ఆర్సీబీ స్పిన్నర్ ఆటాడుకున్నాడు. గల్లీ బౌలర్​ను చేసుకొని అతడి బౌలింగ్​లో వీరబాదుడు బాదాడు.

25 కోట్ల ఆటగాడైన మిచెల్ స్టార్క్​ను ఓ ఆర్సీబీ స్పిన్నర్ ఆటాడుకున్నాడు. గల్లీ బౌలర్​ను చేసుకొని అతడి బౌలింగ్​లో వీరబాదుడు బాదాడు.

  • Published Apr 22, 2024 | 8:42 AMUpdated Apr 22, 2024 | 8:42 AM
స్టార్క్​ను ఏడిపించిన RCB స్పిన్నర్.. గల్లీ బౌలర్​ను చేసుకొని ఆడుకున్నాడు!

ప్లేఆఫ్స్​ చేరాలంటే పక్కా గెలవాల్సిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయం పాలైంది. కోల్​కతా నైట్ రైడర్స్​తో నిన్న జరిగిన మ్యాచ్​లో ఒక్క పరుగు తేడాతో డుప్లెసిస్ సేన ఓటమి పాలైంది. ఆఖరి వరకు విజయం ఇరు టీమ్స్​తో దోబూచులాడింది. గెలుపు కోసం ఆర్సీబీ ఆటగాళ్లు ఎంతగానో ప్రయత్నించారు. అయినా దరిద్రం ఆ జట్టును వదల్లేదు. దీంతో ఓటమి తప్పలేదు. అయితే నిన్న మ్యాచ్​లో 25 కోట్ల ఆటగాడు మిచెల్ స్టార్క్​ను ఓ ఆర్సీబీ స్పిన్నర్ ఆటాడుకున్నాడు. గల్లీ బౌలర్​ను చేసుకొని అతడి బౌలింగ్​లో వీరబాదుడు బాదాడు. మ్యాచ్​ మొత్తంలో ఇదే మెయిన్ హైలైట్​గా నిలిచింది. అసలు ఎవరా బ్యాటర్? స్టార్క్ బౌలింగ్​లో అతడి విధ్వంసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఏస్ పేసర్ మిచెల్ స్టార్క్​ను ఆర్సీబీ స్పిన్నర్ కర్ణ్ శర్మ ఏడిపించాడు. మూడు షాట్లతో అతడికి కాళరాత్రి అంటే ఎలా ఉంటుందో చూపించాడు. బెంగళూరు ఇన్నింగ్స్​లో లాస్ట్ ఓవర్ అది. విజయానికి ఇంకా 21 పరుగులు కావాలి. అంతకంటే ముందు ఓవర్ ఆఖరి బంతికి స్టార్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఔట్ అయ్యాడు. కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నారు. వీళ్లు పెద్దగా బ్యాట్​తో మెరిసిన సందర్భాలు లేవు. దీంతో ఆర్సీబీ అభిమానులు మ్యాచ్​పై ఆశలు వదులుకున్నారు. కానీ బిగ్ షాట్స్ కొట్టే సత్తా ఉన్న కర్ణ్ శర్మ మాత్రం పోరాడాలని డిసైడ్ అయ్యాడు. చివరి ఓవర్ వేసేందుకు వచ్చిన స్టార్క్​కు చుక్కలు చూపించాడు. అతడి బౌలింగ్​లో వరుసగా 3 భారీ సిక్సులు బాదాడు. అయితే ఐదో బంతికి అతడు ఔట్ అవడం, లాస్ట్ బాల్​కు ఫెర్గూసన్ రెండు పరుగులు తీసే క్రమంలో రనౌట్ అవడంతో గెలుపునకు ఒక్క పరుగు దూరంలో బెంగళూరు ఆగిపోయింది.

RCB spinner who made Starc cry!

ఆర్సీబీ ఓడిపోయినా గానీ లాస్ట్ ఓవర్​లో కర్ణ్ శర్మ విధ్వంసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. స్టార్క్​కు ఏమాత్రం భయపడకుండా అతడు భారీ సిక్సులు బాదడాన్ని ప్రశంసిస్తున్నారు. గల్లీ బౌలర్​ను చేసుకొని 25 కోట్ల ప్లేయర్​ను ఆటాడుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్ణ్ ఔట్ కాకపోయి ఉంటే మ్యాచ్ ఆర్సీబీదేనని.. ఓడిపోయినా గానీ కేకేఆర్​కు చుక్కలు చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, బ్యాట్​తో చెలరేగిన కర్ణ్.. బౌలింగ్​లోనూ అదరగొట్టాడు. 4 ఓవర్లు వేసి 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. వికెట్ తీయకపోయినా రన్స్ ఇవ్వకుండా కంట్రోల్ చేశాడు. దీంతో ఇతర బౌలర్లకు వికెట్లు పడ్డాయి. కర్ణ్ శర్మను ఇన్నాళ్లూ ఆడించకుండా ఆర్సీబీ తప్పు చేసిందని.. ఇంత మంచి ప్లేయర్​ను బెంచ్ మీద కూర్చోబెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరి.. కర్ణ్ శర్మ ఇన్నింగ్స్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి