iDreamPost
android-app
ios-app

RCBని వీడబోతున్న విరాట్ కోహ్లీ? నిన్న రాత్రితో అంతా క్లోజ్!

  • Published Apr 03, 2024 | 5:13 PM Updated Updated Apr 03, 2024 | 5:13 PM

ఐపీఎల్​లో ఫస్ట్ సీజన్ నుంచి ఆర్సీబీకి ఆడుతూ వస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఎవరెన్ని టీమ్స్ మారినా తను మాత్రం అదే జట్టుకు స్టిక్ అయి ఉన్నాడు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎమోషనల్​గా ఆ టీమ్​కు కనెక్ట్ అయ్యాడు కింగ్.

ఐపీఎల్​లో ఫస్ట్ సీజన్ నుంచి ఆర్సీబీకి ఆడుతూ వస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఎవరెన్ని టీమ్స్ మారినా తను మాత్రం అదే జట్టుకు స్టిక్ అయి ఉన్నాడు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎమోషనల్​గా ఆ టీమ్​కు కనెక్ట్ అయ్యాడు కింగ్.

  • Published Apr 03, 2024 | 5:13 PMUpdated Apr 03, 2024 | 5:13 PM
RCBని వీడబోతున్న విరాట్ కోహ్లీ? నిన్న రాత్రితో అంతా క్లోజ్!

ఫ్రాంచైజీ క్రికెట్​లో లాయల్టీకి స్థానం ఉండదు. ఎవరి అవసరాలను బట్టి వాళ్లు వ్యవహరిస్తారు. అది టీమ్ కావొచ్చు.. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది ఇలా ఎవరైనా సరే ఇక్కడ లాయల్​గా ఉండాలనే రూల్ లేదు. అలాంటి సందర్భాలు కూడా ఎన్నో చూశాం. కానీ అతడు అలా కాదు. ఫస్ట్ సీజన్ నుంచి ఒకే జట్టుకు ఆడుతూ వస్తున్నాడు. ఎవరెన్ని టీమ్స్ మారినా తను మాత్రం 16 ఏళ్లుగా అదే జట్టుకు స్టిక్ అయి ఉన్నాడు. అతడే విరాట్ కోహ్లీ. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎమోషనల్​గా ఆర్సీబీకి కనెక్ట్ అయ్యాడు కింగ్. బెంగళూరు ఫ్రాంచైజీ నుంచి ఎవరు బయటకు వెళ్లినా తను మాత్రం ఆ జట్టును వీడలేదు. అలాంటోడు కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీని వీడేందుకు విరాట్ సిద్ధమైనట్లు వినిపిస్తోంది.

ఈ సీజన్​ ఐపీఎల్​లో ఎన్నో ఎక్స్​పెక్టేషన్స్​తో బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట ఓడి తీవ్రంగా నిరాశపర్చింది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్​ చేతిలో గెలవాల్సిన మ్యాచ్​లో ఓడిపోయింది. బ్యాటింగ్ ఫెయిల్యూర్​తో పాటు దారుణమైన బౌలింగ్​ ప్రదర్శన కారణంగా మరో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో కోహ్లీ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడట. నిన్న రాత్రితో అంతా క్లోజ్ అయిందట. ఆర్సీబీకి గుడ్​బై చెప్పేందుకు కింగ్ రెడీ అయినట్లు వినికిడి. సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతూ వస్తున్న విరాట్ కెరీర్ ఇప్పుడు చివరి దశలో ఉంది. ఇన్ని రోజులు యంగ్ కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు తన కెరీర్ తనకు ముఖ్యం. ఒక్కడే ఎంత బాగా ఆడినా గెలవని టీమ్ కోసం ఇంకా ఎన్నాళ్లు కష్టపడాలనే అభిప్రాయంతో కోహ్లీ ఉన్నాడని క్రికెట్ వర్గాల సమాచారం.

Kohli gudbye to RCB

లక్నోపై ఓటమి తర్వాత కోహ్లీ చాలా భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ ఎమోషన్​లోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆర్సీబీ పరిస్థితి రోజురోజుకీ మరీ తీసికట్టుగా మారిపోతుండటంతో విరాట్​లో అసహనం పెరుగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే టీమ్​ను వీడాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్​లో కోహ్లీ బ్యాట్​తో రఫ్ఫాడిస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో 203 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్​గా ఉన్నాడు. లక్నోతో నిన్న జరిగిన మ్యాచ్​లోనూ 16 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 22 పరుగులు చేశాడు. వేగంగా ఆడే క్రమంలో తన వికెట్​ను పోగొట్టుకున్నాడు కింగ్. అయితే టీమ్​లోని మెయిన్ ప్లేయర్స్ అయిన డుప్లెసిస్, మాక్స్​వెల్, గ్రీన్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. దీంతో ఓటమి తర్వాత నిరాశలో కూరుకుపోయాడు విరాట్. డ్రెస్సింగ్ రూమ్​లో చైర్​ను అతడు బాదేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. టీమ్ మీటింగ్​లోనూ స్టార్ బ్యాటర్ చాలా డల్​గా కనిపించాడు. మరి.. ఈ మొత్తం వ్యవహారం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: CSKతో మ్యాచ్​కు ముందు SRHకు గుడ్‌న్యూస్‌! ఇక క్లాసెన్‌ను ఆపేదెవరు?