iDreamPost

CSKతో మ్యాచ్​కు ముందు SRHకు గుడ్‌న్యూస్‌! ఇక క్లాసెన్‌ను ఆపేదెవరు?

  • Published Apr 03, 2024 | 2:22 PMUpdated Apr 03, 2024 | 2:22 PM

చెన్నై సూపర్ కింగ్స్​తో మ్యాచ్​కు ముందు సన్​రైజర్స్​ హైదరాబాద్​కు గుడ్ న్యూస్. ఇక క్లాసెన్ కాకాను ఆపడం ఎవరి వల్లా కాదు.

చెన్నై సూపర్ కింగ్స్​తో మ్యాచ్​కు ముందు సన్​రైజర్స్​ హైదరాబాద్​కు గుడ్ న్యూస్. ఇక క్లాసెన్ కాకాను ఆపడం ఎవరి వల్లా కాదు.

  • Published Apr 03, 2024 | 2:22 PMUpdated Apr 03, 2024 | 2:22 PM
CSKతో మ్యాచ్​కు ముందు SRHకు గుడ్‌న్యూస్‌! ఇక క్లాసెన్‌ను ఆపేదెవరు?

ఈసారి ఐపీఎల్ ట్రోఫీపై కన్నేసిన సన్​రైజర్స్ హైదరాబాద్ అందుకు తగ్గట్లే టోర్నీని పాజిటివ్​గా స్టార్ట్ చేసింది. తొలి మ్యాచ్​లో కోల్​కతా నైట్ రైడర్స్​ చేతుల్లో 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్​లో ఓడినా ఆఖరి వరకు ఎస్​ఆర్​హెచ్ పోరాడిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్​తో మ్యాచ్​లో 31 పరుగుల తేడాతో నెగ్గి బోణీ కొట్టింది కమిన్స్ సేన. హైస్కోరింగ్ ఫైట్​లో సన్​రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. అయితే విజయంతో గాడిన పడ్డారని అనుకుంటే తర్వాతి మ్యాచ్​లో గుజరాత్ టైటాన్స్​ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడారు. ఈ మ్యాచ్​లో మన జట్టు బ్యాటింగ్, బౌలింగ్​లో సరిగ్గా రాణించలేదు. ఇంకో విజయంతో సక్సెస్ ట్రాక్ పట్టాలని చూస్తున్న ఎస్​ఆర్​హెచ్​కు గుడ్ న్యూస్.

గెలుపు కోసం చూస్తున్న సన్​రైజర్స్ నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్​తో పోటీపడనుంది. ఈ రెండు టీమ్స్ మధ్య ఏప్రిల్ 5వ తేదీన ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలో సన్​రైజర్స్​కు అదిరిపోయే న్యూస్. సీఎస్​కే ప్రధాన బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఎస్​ఆర్​హెచ్​తో మ్యాచ్​కు దూరమయ్యాడు. ఈ ఏడాది జూన్​లో టీ20 ప్రపంచ కప్ జరగనున్న సంగతి విదితమే. యూఎస్​ఏ-వెస్టిండీస్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. మెగా టోర్నీకి సమయం దగ్గర పడుతుండటంతో అన్ని దేశాల బోర్డులు క్రికెటర్లకు వీసాలు ఇప్పించడంతో పాటు ఇతర పనులను వేగవంతం చేశాయి. బంగ్లాదేశ్ బోర్డు కూడా ఇదే పనిలో భాగంగా ముస్తాఫిజుర్​ను స్వదేశానికి రావాల్సిందిగా ఆదేశించింది. యూఎస్​ఏ వీసా ప్రాసెస్ కోసం బంగ్లాదేశ్​కు వెళ్తుండటంతో ఎస్​ఆర్​హెచ్​తో మ్యాచ్​కు ఈ పేసర్ అందుబాటులో లేకుండా పోయాడు.

ఈసారి చెన్నై బౌలింగ్ యూనిట్​ను ముందుండి లీడ్ చేస్తున్నాడు ముస్తాఫిజుర్. స్లో బౌన్సర్స్, స్వింగింగ్ డెలివరీస్, యార్కర్స్​తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తున్నాడు. అలాంటోడు దూరమవడంతో ఈ మ్యాచ్​లో క్లాసెన్, హెడ్, అభిషేక్ లాంటి విధ్వంసక బ్యాటర్లతో కూడిన ఎస్​ఆర్​హెచ్​ను ఆపడం సీఎస్​కేకు కష్టమే. ముఖ్యంగా భీకర ఫామ్​లో ఉన్న క్లాసెన్ కాకాను నిలువరించడం చెన్నై బౌలర్లకు తలకు మించిన భారమే. ఇక, చెన్నై సీజన్​ను గ్రాండ్​గా స్టార్ట్ చేసింది. ఫస్ట్ మ్యాచ్​లో ఆర్సీబీ మీద 6 వికెట్ల తేడాతో నెగ్గింది రుతురాజ్ సేన. ఆ తర్వాతి మ్యాచ్​లో పటిష్టమైన గుజరాత్​ను 63 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అయితే ఇదే జోరును కంటిన్యూ చేయలేకపోయింది. మూడో మ్యాచ్​లో ఢిల్లీ చేతుల్లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ పట్టాలని చూస్తున్న సీఎస్​కే.. సన్​రైజర్స్​తో పోరుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో ముస్తాఫిజుర్ దూరమవడం ఆ టీమ్​కు భారీ ఎదురుదెబ్బే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి