iDreamPost
android-app
ios-app

హ్యాట్రిక్ విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి RCB.. ఆ ఒక్క పని చేస్తే క్వాలిఫై!

  • Published May 05, 2024 | 2:18 PM Updated Updated May 05, 2024 | 2:18 PM

ఆర్సీబీ జట్టు ఒక్కసారిగా ఫామ్ అందుకుంది. వరుస విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఆ టీమ్ క్వాలిఫై అవ్వాలంటే ఇంకా ఒక్క పని చేయాల్సి ఉంది.

ఆర్సీబీ జట్టు ఒక్కసారిగా ఫామ్ అందుకుంది. వరుస విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఆ టీమ్ క్వాలిఫై అవ్వాలంటే ఇంకా ఒక్క పని చేయాల్సి ఉంది.

  • Published May 05, 2024 | 2:18 PMUpdated May 05, 2024 | 2:18 PM
హ్యాట్రిక్ విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి RCB.. ఆ ఒక్క పని చేస్తే క్వాలిఫై!

ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. వరల్డ్ బెస్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహా ఎందరో స్టార్ ప్లేయర్లు ఆ టీమ్​లో ఉండటంతో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే జట్టు నిండా స్టార్లు ఉన్నా రాత మాత్రం మారడం లేదు. ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్​లతో దుమ్మురేపినా టీమ్​కు టైటిల్​ను అందించలేకపోయాడు కోహ్లీ. ఛాంపియన్​గా నిలవకపోయినా ఆర్సీబీని ఇష్టపడే వారి సంఖ్య తగ్గడం లేదు. ఈసారి కూడా జట్టు మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వరుసగా ఆరు పరాజయాలతో ఆ టీమ్ తుస్సుమంది. దీంతో డుప్లెసిస్ సేన పనైపోయిందని అంతా భావించారు. కానీ సడన్​గా ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది ఆర్సీబీ.

వరుస పరాజయాలకు బ్రేక్​ వేస్తూ తొలుత సన్​రైజర్స్ హైదరాబాద్​ను ఓడించింది ఆర్సీబీ. ఆ తర్వాత వారం గ్యాప్​లో మరో రెండు విజయాలు అందుకుంది. గుజరాత్ టైటాన్స్​తో నిన్న జరిగిన మ్యాచ్​లో ఇంకో 38 బంతులు ఉండగానే గెలుపొందింది. హ్యాట్రిక్స్ సక్సెస్​లు అందుకున్న డుప్లెసిస్ సేన తమ ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్​లో ఇప్పటిదాకా 11 మ్యాచుల్లో ఏడు ఓటములు, నాలుగు విజయాలతో 8 పాయింట్లతో పాయింట్స్ టేబుల్​లో 7వ స్థానంలో నిలిచింది బెంగళూరు. ప్లేఆఫ్స్​కు వెళ్లాలంటే ముందు ఆ జట్టు ఒక పని చేయాలి. తాము ఆడే మిగతా మూడు మ్యాచుల్లోనూ ఆర్సీబీ నెగ్గాలి. అప్పుడు ఆ టీమ్ పాయింట్ల సంఖ్య 14కు చేరుతుంది. అదే సమయంలో మరో మ్యాజిక్ కూడా జరగాలి.

ఆర్సీబీ నెక్స్ట్ ఆడే అన్ని మ్యాచుల్లోనూ నెగ్గాలి. అదే టైమ్​లో సన్​రైజర్స్, లక్నో సూపర్ జియాంట్స్ ఇక మీదట ఆడే మ్యాచుల్లో ఒకటి కంటే ఎక్కువ విజయాలు సాధించొద్దని కోరుకోవాలి. ఎస్​ఆర్​హెచ్​, ఎల్​ఎస్​జీ ఆడిన 10 మ్యాచుల్లో 6 విజయాలతో చెరో 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్​కు దగ్గర్లో ఉన్నాయి. ఆ టీమ్స్ తర్వాతి ఆడే మ్యాచుల్లో ఒక్కదాంట్లో నెగ్గి, మిగతా వాటిల్లో ఓడితే 14 పాయింట్లతో ఉంటాయి. ఆర్సీబీ నెక్స్ట్ ఆడే మూడు మ్యాచుల్లోనూ గెలిస్తే కూడా 14 పాయింట్లతో ఉంటుంది. అప్పుడు డుప్లెసిస్ సేనకు ప్లేఆఫ్స్ ఛాన్సులు ఉంటాయి. నెట్ రన్​రేట్​ను బట్టి క్వాలిఫై అవకాశాలు ఉంటాయి. ఇక, 10 మ్యాచుల్లో 5 గెలుపులతో సీఎస్​కే 10 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉంది. ఆ జట్టు తదుపరి నాలుగు మ్యాచుల్లో రెండింట్లోనే నెగ్గి మిగతావి ఓడిపోవాలని ఆర్సీబీ కోరుకోవాలి. అప్పుడు కూడా ఆర్సీబీకి ఛాన్సులు ఉంటాయి. మొత్తానికి ప్లేఆఫ్స్ వెళ్లాలంటే తాము ఆడే అన్ని మ్యాచుల్లో నెగ్గడంతో పాటు ఎస్​ఆర్​హెచ్​, సీఎస్​కే, లక్నో ఓడిపోవాలని ఆ జట్టు కోరుకోవాలి. మరి.. బెంగళూరు ప్లేఆఫ్స్ చేరుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.