Nidhan
పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాలా బౌలింగ్ చేయాలని చాలా మంది అనుకుంటారు. అయితే అచ్చం బుమ్రాను పోలిన యాక్షన్‌తో ఓ ఆర్సీబీ ఆటగాడు ఆకట్టుకుంటున్నాడు.
పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాలా బౌలింగ్ చేయాలని చాలా మంది అనుకుంటారు. అయితే అచ్చం బుమ్రాను పోలిన యాక్షన్‌తో ఓ ఆర్సీబీ ఆటగాడు ఆకట్టుకుంటున్నాడు.
Nidhan
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఇష్టపడని వారుండరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భీకరమైన పేస్‌తో బౌలింగ్ చేసే బుమ్రా అంటే బ్యాటర్ల వెన్నులో వణుకు పడుతుంది. నిప్పులు చెరిగే పేస్‌తో అతడు వేసే ఇన్ స్వింగర్లు, ఔట్ స్వింగర్లు, యార్కర్లు, బౌన్సర్లను ఎదుర్కోవడం ఎంతటి తోపు బ్యాటర్‌కైనా కష్టమే. దీనికి తోడు స్లో డెలివరీస్‌ను బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతుంటాడు బుమ్రా. వరల్డ్ నంబర్ వన్ బౌలర్ అయినప్పటికీ ఎక్కడా గర్వం చూపించకుండా వినమ్రతతో ఉంటాడు బుమ్రా. అందుకే అతడ్ని కోట్లాది మంది ఇష్టపడతారు. అతడిలా బౌలింగ్ చేయాలని అనుకుంటారు. అయితే ఆర్సీబీ టీమ్‌లో మరో బుమ్రా ఉన్నాడని చాలా మందికి తెలియదు.
అచ్చం బుమ్రాను పోలిన యాక్షన్‌తో ఓ ఆర్సీబీ ఆటగాడు ఆకట్టుకుంటున్నాడు. టీమిండియా పేసుగుర్రం మాదిరిగానే చిన్న చిన్న స్టెప్స్‌తో వేగం పుంజుకొని క్రీజు దగ్గర బిగ్ జంప్‌తో బౌలింగ్ చేస్తున్నాడా బౌలర్. బుమ్రాలాగే బంతిని వినూత్నంగా విసురుతున్నాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఎవరీ జూనియర్ బుమ్రా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ బౌలర్ పేరు మహేష్ కుమార్. ఈ సీజన్లో బెంగళూరు జట్టుకు అతడు నెట్ బౌలర్‌గా సేవలు అందిస్తున్నాడు.
క్వాలిటీ పేస్‌తో డిఫరెంట్ డెలివరీస్ వేసే మహేష్ బౌలింగ్ తమ బ్యాటర్లకు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుందని ఆర్సీబీ భావించిందట. అందుకే అతడ్ని నెట్ బౌలర్‌గా తీసుకొచ్చిందని తెలుస్తోంది. అయితే అతడి బౌలింగ్ వీడియో చూసిన వాళ్లు మాత్రం అచ్చం బుమ్రాను దింపేశాడని అంటున్నారు. జస్ప్రీత్ స్ఫూర్తిగా బౌలింగ్ నేర్చుకున్నాడేమోనని.. కష్టపడితే ఎదిగే అవకాశాలు ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌ను మరో రెండ్రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. దీంతో బుమ్రాను వైస్ కెప్టెన్‌గా చేస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అతడితో పాటు హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ పేర్లు కూడా వైస్ కెప్టెన్సీ రేసులో ఉన్నాయని వినిపిస్తోంది. ఈ విషయంలో సెలెక్టర్లు ఏం చేస్తారనేది అతి త్వరలో క్లారిటీ రానుంది.
🎥 Mahesh Kumar – Net Bowler for Royal Challengers Bengaluru in IPL 2024.#IPL2024 #CricketTwitter pic.twitter.com/X5kXtd11hk
— Indian Domestic Cricket Forum – IDCF (@IDCForum) April 29, 2024