iDreamPost

సన్​రైజర్స్ ఓటములతో కమిన్స్ మాస్టర్​ప్లాన్! ఇక SRH కోసం ఆసీస్ తరహా వ్యూహం!

  • Published Apr 29, 2024 | 8:18 PMUpdated Apr 29, 2024 | 8:18 PM

ఐపీఎల్-2024 ఫస్టాఫ్​లో చెలరేగిన సన్​రైజర్స్.. సెకండాఫ్​లో వరుస ఓటములతో కాస్త డీలా పడింది. అయితే టీమ్​ను సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని పట్టుదలతో ఉన్న కెప్టెన్ కమిన్స్ మాస్టర్​ప్లాన్ రెడీ చేస్తున్నాడు.

ఐపీఎల్-2024 ఫస్టాఫ్​లో చెలరేగిన సన్​రైజర్స్.. సెకండాఫ్​లో వరుస ఓటములతో కాస్త డీలా పడింది. అయితే టీమ్​ను సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని పట్టుదలతో ఉన్న కెప్టెన్ కమిన్స్ మాస్టర్​ప్లాన్ రెడీ చేస్తున్నాడు.

  • Published Apr 29, 2024 | 8:18 PMUpdated Apr 29, 2024 | 8:18 PM
సన్​రైజర్స్ ఓటములతో కమిన్స్ మాస్టర్​ప్లాన్! ఇక SRH కోసం ఆసీస్ తరహా వ్యూహం!

సన్​రైజర్స్ హైదరాబాద్.. ఈ టీమ్ పేరు వింటేనే ఈసారి ఐపీఎల్​లో అందరికీ దడ పుడుతోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్రమ్, నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ లాంటి బ్యాటింగ్ రాక్షసులతో నిండిన ఈ జట్టుతో మ్యాచ్ అంటేనే అందరూ భయపడుతున్నారు. 250 ప్లస్ స్కోర్లను కూడా నీళ్లు తాగినంత అలవోకగా బాదేసే ఆరెంజ్ ఆర్మీ ఎక్కడ తమ మీదకు వచ్చి పడుతుందోనని అపోజిషన్ టీమ్స్ వణుకుతున్నాయి. అయితే ఇదంతా ఈ సీజన్ ఫస్టాఫ్ వరకు జరిగిన స్టోరీ. సెకండాఫ్ మొదలైందో లేదో కమిన్స్ సేనను వరుస పరాజయాలు పలకరించాయి. ఆర్సీబీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓటములతో టీమ్ కాస్త డీలా పడింది. అయితే భయపడాల్సిందేమీ లేదు. ఎందుకంటే మన టీమ్​లో ఓ పవర్ హౌజ్ ఉన్నాడు.

క్రికెట్ అనే కాదు.. ఏ టీమ్ గేమ్​లోనైనా కెప్టెన్ చాలా కీలకం అవుతారు. టీమ్​ ఎంత బలంగా ఉందనేది ఎంత ముఖ్యమో, సారథిగా ఎవరు ఉన్నారనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఓటమి కోరల్లో నుంచి జట్టును బయటపడేయాలన్నా, ప్రత్యర్థి వ్యూహాలను చిత్తు చేయాలన్నా నిఖార్సయిన కెప్టెన్ ఉండాలి. సన్​రైజర్స్​లో అలాంటి సారథి ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ రూపంలో తెలివైన, బలమైన నాయకుడు ఆరెంజ్ ఆర్మీలో ఉన్నాడు. ఎస్​ఆర్​హెచ్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోతే జట్టు పనైపోయిందని, ఇంక అస్సాంకే అంటూ సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. కొందరు సొంత అభిమానులు కూడా ఇక హైదరాబాద్ కోలుకోవడం కష్టమేనని అంటున్నారు. కానీ కమిన్స్ టీమ్​లో ఉన్నాడని, ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో నుంచి టీమ్​ను గట్టెక్కించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య అని మాత్రం మర్చిపోతున్నారు.

వన్డే వరల్డ్ కప్-2023​ ఆరంభంలో ఆస్ట్రేలియా వరుస మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు పనైపోయిందని అంతా భావించారు. కానీ కమిన్స్ సారథ్యంలోని టీమ్ తిరిగి పుంజుకొని ఏకంగా కప్పును ఎగరేసుకుపోయింది. అదే కమిన్స్ ఇప్పుడు ఎస్​ఆర్​హెచ్​కు కెప్టెన్​గా ఉన్నాడు. టీమ్ జస్ట్ రెండు మ్యాచుల్లోనే ఓడింది. టార్గెట్​ ఛేజ్ చేయడంలో ఉన్న లోటుపాట్లతో పాటు బ్యాటింగ్, బౌలింగ్​లోని బలహీనతలు ఇప్పుడే బయటపడ్డాయి. కాబట్టి వాటిని సరిదిద్దుకొని బౌన్స్ బ్యాక్ ఇవ్వొచ్చు. అదే ప్లేఆఫ్స్​లో గనుక ఇలాంటి ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి బయటకొచ్చేసే పరిస్థితి. ఓటమికి అందరూ భయపడతారు. కానీ కమిన్స్ ఓటమిని మెట్లుగా మార్చుకొని టీమ్​కు టైటిల్ అందించాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్లేఆఫ్స్​కు ముందు టీమ్ కాంబినేషన్​ను పకడ్బందీగా సెట్ చేయడానికి ఆస్ట్రేలియా తరహా వ్యూహం పన్నుతున్నాడు. అటాకింగ్ గేమ్​తో ప్రత్యర్థులను చిత్తు చేయాలని చూస్తున్నాడు. ఇది గానీ వర్కౌట్ అయిందా ఇక తెలుగు జట్టును కప్పు కొట్టకుండా ఎవరూ ఆపలేరు.

ఇదీ చదవండి: Chandini Chowdary: చాందినీ చౌదరిపై మండిపడుతున్న SRH ఫ్యాన్స్.. ఓ రేంజ్​లో ట్రోల్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి