వీడియో: కమిన్స్ కళ్లుచెదిరే క్యాచ్.. కపిల్​దేవ్​ను గుర్తుచేసిన SRH కెప్టెన్!

సన్​రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కళ్లుచెదిరే క్యాచ్​తో అలరించాడు. లెజెండ్ కపిల్​దేవ్​ను గుర్తుచేశాడు ఎస్​ఆర్​హెచ్ సారథి.

సన్​రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కళ్లుచెదిరే క్యాచ్​తో అలరించాడు. లెజెండ్ కపిల్​దేవ్​ను గుర్తుచేశాడు ఎస్​ఆర్​హెచ్ సారథి.

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో 2 పరుగుల తేడాతో నెగ్గింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్​ ఈజీగా నెగ్గాల్సింది. కానీ ఫీల్డింగ్ తప్పిదాల వల్ల గెలుపును క్లిష్టతరం చేసుకుంది. అయితే ఎట్టకేలకు విక్టరీ కొట్టి ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన కమిన్స్ సేన 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన పంజాబ్ అన్ని ఓవర్లు ఆడి 180 పరుగులే చేయగలిగింది. బ్యాట్​తో పాటు బంతితోనూ రాణించిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు. ఇక, ఈ మ్యాచ్​లో కమిన్స్ పట్టిన ఓ క్యాచ్​ హైలైట్ అనే చెప్పాలి. ఆ క్యాచ్​తో భారత లెజెండ్ కపిల్​ దేవ్​ను గుర్తుచేశాడతను.

ఛేజింగ్​కు దిగిన పంజాబ్​ను ఎస్ఆర్​హెచ్ బౌలర్లు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. భువనేశ్వర్ కుమార్, కమిన్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాక, వికెట్లు కూడా పడుతుండంతో పంజాబ్​కు చుక్కలు కనిపించాయి. ఆ టీమ్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన సామ్ కర్రన్ (29) కాసేపు అలరించాడు. భారీ షాట్లతో ఎస్​ఆర్​హెచ్ బౌలర్లను భయపెట్టాడు. దీంతో అతడ్ని ఔట్ చేసే బాధ్యతను నటరాజన్​కు అప్పగించాడు కమిన్స్. అతడు వేసిన స్లో బౌన్సర్​కు టెంప్ట్ అయిన కర్రన్ బిగ్ షాట్​కు ప్రయత్నించాడు. బాల్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. అయినా కర్రన్ బలానికి బౌండరీ దిశగా దూసుకెళ్లింది. ఆ తరుణంలో దాన్ని వెంబడించిన కమిన్స్.. వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి అద్భుతమైన రీతిలో డైవ్ కొట్టి క్యాచ్​ను ఒడిసి పట్టుకున్నాడు.

క్రికెట్​లో బ్యాక్ రన్నింగ్ క్యాచెస్ చాలా కష్టం. ఎంత ఫిట్​నెస్​ ఉన్నా వీటిని ఈజీగా పట్టలేం. ఇలాంటి క్యాచులు అందుకోవాలంటే ఫిట్​నెస్​తో పాటు బాల్​ వేగాన్ని, దిశను, ఎత్తును సరిగ్గా జడ్జ్ చేయడం ముఖ్యం. ఈ విషయంలో కమిన్స్ సక్సెస్ అయ్యాడు. వెనక్కి పరిగెత్తుకుంటూ బంతిని పట్టి, బ్యాలెన్స్ తప్పకుండా కిందకు స్లైడ్ చేశాడు. ఈ క్యాచ్ చూసి బ్యాటర్ కర్రన్ బిత్తరపోయాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కమిన్స్ క్యాచ్ చూసిన నెటిజన్స్.. అతడు లెజెండ్ కపిల్​దేవ్​ను గుర్తుచేశాడని అంటున్నారు. 1983 వరల్డ్ కప్​లో కపిల్ ఇలాగే వెనక్కి పరిగెత్తుకుంటూ ఓ క్యాచ్ పట్టిన సంగతి తెలిసిందే. ఇక, ఈ మ్యాచ్​లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన కమిన్స్.. 22 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన బెయిర్​స్టో వికెట్ తీశాడు. మరి.. ఎస్ఆర్​హెచ్ కెప్టెన్ కళ్లుచెదిరే క్యాచ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments