iDreamPost
android-app
ios-app

వీడియో: ఒకే ఓవర్​లో 30 రన్స్.. సామ్ కర్రన్​ను చితకబాదిన ట్రావిస్ హెడ్!

  • Published Sep 12, 2024 | 8:50 AM Updated Updated Sep 12, 2024 | 8:50 AM

Travis Head Scores 30 Runs From One Over: ఆస్ట్రేలియా విధ్వంసకారుడు ట్రావిస్ హెడ్ మరోమారు శివాలెత్తాడు. ఇంగ్లండ్​కు చుక్కలు చూపించాడీ కంగారూ ఓపెనర్. సిక్సుల వర్షం కురిపించి ప్రత్యర్థి జట్టును ముంచేశాడు.

Travis Head Scores 30 Runs From One Over: ఆస్ట్రేలియా విధ్వంసకారుడు ట్రావిస్ హెడ్ మరోమారు శివాలెత్తాడు. ఇంగ్లండ్​కు చుక్కలు చూపించాడీ కంగారూ ఓపెనర్. సిక్సుల వర్షం కురిపించి ప్రత్యర్థి జట్టును ముంచేశాడు.

  • Published Sep 12, 2024 | 8:50 AMUpdated Sep 12, 2024 | 8:50 AM
వీడియో: ఒకే ఓవర్​లో 30 రన్స్.. సామ్ కర్రన్​ను చితకబాదిన ట్రావిస్ హెడ్!

ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరోమారు శివాలెత్తాడు. ఇంగ్లండ్​కు చుక్కలు చూపించాడీ కంగారూ బ్యాటర్. సిక్సుల వర్షం కురిపించి ప్రత్యర్థి జట్టును ముంచేశాడు. ఆ టీమ్​తో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్​లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకే ఓవర్​లో ఏకంగా 30 పరుగులు బాదేశాడు. హెడ్​తో పాటు జోష్ ఇంగ్లిష్ రాణించడంతో భారీ స్కోరు చేసింది ఆసీస్. ఆ తర్వాత ఆ జట్టు బౌలర్లు అదరగొట్టడంతో ఇంగ్లండ్​ను 28 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అయితే మ్యాచ్​లో హెడ్ ఇన్నింగ్స్ హైలైట్​గా నిలిచింది. ఫస్ట్ బాల్ నుంచే ఉతుకుడు మొదలుపెట్టాడతను. బౌలర్ ఎవరనేది చూడకుండా దంచుడే దంచుడు అన్నట్లు అతడి ఇన్నింగ్స్ సాగింది. ముఖ్యంగా సామ్ కర్రన్​ను లక్ష్యంగా చేసుకొని భారీ షాట్లు బాదాడు హెడ్. అతడి ఓవర్​లో సిక్సుల వర్షం కురిపించాడు.

కర్రన్​ వేసిన ఒక ఓవర్​లో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు హెడ్. వరుసగా 3 సిక్సులు బాదాడు. అన్ని డెలివరీస్​ను భారీ షాట్లుగా మలిచాడు కంగారూ ఓపెనర్. మొత్తంగా ఆ ఓవర్​లో మూడు ఫోర్లు, మూడు సిక్సులతో కర్రన్​కు చుక్కలు చూపించాడు. 23 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 59 పరుగులు చేశాడు. ఇందులో 8 బౌండరీలతో పాటు 4 భారీ సిక్సులు ఉన్నాయి. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్​ను చేరుకున్నాడు హెడ్. తద్వారా ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ సరసన అతడు స్థానం సంపాదించాడు. ఒకే ఓవర్​లో హయ్యెస్ట్ రన్స్ చేసిన ఆరో కంగారూ బ్యాటర్​గా నిలిచాడు. పాంటింగ్ 2005లో న్యూజిలాండ్ మీద ఈ ఫీట్ నమోదు చేశాడు. అతడి తర్వాత ఆరోన్ ఫించ్, గ్లెన్ మాక్స్​వెల్, డాన్ క్రిస్టియాన్, మిచ్ మార్ష్​ కూడా ఒకే ఓవర్​లో 30 పరుగులు బాదారు. తాజాగా హెడ్ కూడా ఆ ఫీట్​ను అందుకున్నాడు.

ఇక, ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయింది. హెడ్, ఇంగ్లిస్​తో పాటు ఓపెనర్ మ్యాట్ షార్ట్ (26 బంతుల్లో 41) రాణించడంతో మంచి స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లండ్ విజయానికి 28 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఆ టీమ్ 151 పరుగులకు కుప్పకూలింది. లియామ్ లివింగ్​స్టన్ (37) తప్ప ఎవరూ రాణించలేదు. ఫిల్ సాల్ట్ (20), జోర్డాన్ కాక్స్ (17), జేమీ ఓవర్టన్ (15) మంచి స్టార్ట్ దొరికినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. హెడ్ మాదిరిగా ఒక్క బ్యాటర్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడినా ఇంగ్లీష్ టీమ్​ ఒడ్డున పడేది. సీన్ అబాట్ (3/28)తో పాటు జోష్ హేజల్​వుడ్ (2/32), ఆడమ్ జంపా (2/20) ప్రత్యర్థి బ్యాటర్లను క్రీజులో సెటిల్ కాకుండా చూసుకున్నారు. మార్కస్ స్టొయినిస్, కామెరాన్ గ్రీన్, జేవియర్ బార్ట్లెట్ చెరో వికెట్ తీసి వీళ్లకు మంచి సహకారం అందించారు. మరి.. హెడ్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.