iDreamPost
android-app
ios-app

వీడియో: రుతురాజ్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. ఏం పట్టాడు భయ్యా!

  • Published Sep 21, 2024 | 6:42 PM Updated Updated Sep 21, 2024 | 6:42 PM

Ruturaj Gaikwad Takes Spectacular Catch: టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్​తో పాటు​ ఫీల్డింగ్​లోనూ తోపే. ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఫీల్డింగ్​లో తన టాలెంట్ చూపించే ఈ క్రికెటర్.. తాజాగా ఓ సూపర్ క్యాచ్ అందుకున్నాడు.

Ruturaj Gaikwad Takes Spectacular Catch: టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్​తో పాటు​ ఫీల్డింగ్​లోనూ తోపే. ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఫీల్డింగ్​లో తన టాలెంట్ చూపించే ఈ క్రికెటర్.. తాజాగా ఓ సూపర్ క్యాచ్ అందుకున్నాడు.

  • Published Sep 21, 2024 | 6:42 PMUpdated Sep 21, 2024 | 6:42 PM
వీడియో: రుతురాజ్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. ఏం పట్టాడు భయ్యా!

టీమిండియా స్టార్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ తోపు బ్యాటరే కాదు.. మంచి ఫీల్డర్ కూడా. గ్రౌండ్​లో ఏ పొజిషన్​లో నిల్చోబెట్టినా అద్భుతమైన క్యాచ్​లు అందుకుంటాడు. స్లిప్స్, కవర్స్ అనే కాదు.. బౌండరీల దగ్గర పెట్టినా క్యాచ్​లు అస్సలు వదలడు. ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఫీల్డింగ్​లో తన టాలెంట్ చూపించే ఈ క్రికెటర్.. తాజాగా ఓ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. గాల్లో పక్షిలా ఎగురుతూ సింగిల్ హ్యాండ్​తో స్టన్నింగ్ క్యాచ్ పట్టేశాడు. దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా ఇండియా-సీ, ఇండియా-ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్​లో రుతురాజ్ భలే క్యాచ్ అందుకున్నాడు. అతడు ఎవరి క్యాచ్​ను పట్టాడు? ఎలా పట్టాడు? అనేది ఇంకా వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియా-ఏతో జరుగుతున్న మ్యాచ్​లో స్టార్ బ్యాటర్ రియాన్ పరాగ్ (101 బంతుల్లో 73) ఇచ్చిన క్యాచ్​ను అద్భుతంగా డైవ్ చేసి అందుకున్నాడు రుతురాజ్. గౌరవ్ యాదవ్ బౌలింగ్​లో ఆఫ్ సైడ్ పడిన బంతిని ముందుకొచ్చి ఆడాడు పరాగ్. భారీ షాట్​గా మలిచేందుకు ప్రయత్నించాడు. ఫస్ట్ బాల్​కు ఫోర్ కొట్టిన ఊపులో నెక్స్ట్ డెలివరీని కూడా అదే రీతిలో బౌండరీ లేదా సిక్స్​గా తరలిద్దామని భావించాడు. కానీ కవర్స్ దిశగా కొట్టిన ఈ బాల్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. దీంతో గాల్లోకి లేచింది. దగ్గర్లో కాచుకొని ఉన్న రుతురాజ్ బాల్ వేగం, వెళ్తున్న దిశను గ్రహించి వెంటనే పరుగు అందుకున్నాడు. త్వరగానే దాన్ని సమీపించాడు. అయితే అతడ్ని దాటి వెళ్లిపోతుండటంతో ఎడమ వైపు జంప్ చేసి, లెఫ్టాండ్​తో దాన్ని అందుకున్నాడు.

క్యాచ్ పట్టిన టైమ్​లో రుతురాజ్ బాడీ మొత్తం గాల్లోనే ఉంది. రన్నింగ్ చేస్తూ వెనుక వైపు డైవ్ చేసి అతడు సింగిల్ హ్యాండ్​తో అందుకున్న ఆ క్యాచ్​ను చూసి తీరాల్సిందే. రుతురాజ్ టైమింగ్, బాడీ మూమెంట్, హ్యాండ్-ఐ కోఆర్డినేషన్ సూపర్బ్ అని చెప్పాల్సిందే. ఆ క్యాచ్ చూసి బ్యాటర్ పరాగ్ సహా ఇండియా-సీ ప్లేయర్లంతా షాక్ అయ్యారు. అలా ఎలా పట్టాడంటూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ క్యాచే కాదు.. ఈ ఇన్నింగ్స్​లో మరో రెండు క్యాచ్​లు అందుకున్నాడు రుతురాజ్. ప్రతాప్ సింగ్​తో పాటు తెలుగుతేజం తిలక్ వర్మను ఫెంటాస్టిక్ క్యాచ్​లతో పెవిలియన్​కు దారి చూపించాడు. అయితే ఫీల్డింగ్​లో అదరగొడుతున్న రుతురాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​లో ఫెయిల్ అయ్యాడు. 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అతడు రెండో ఇన్నింగ్స్​లో ఎలా ఆడతాడనే దాని మీదే ఇండియా-సీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. మరి.. రుతురాజ్ క్యాచ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.