iDreamPost
android-app
ios-app

SRH బౌలర్ నటరాజన్​కు అరుదైన గౌరవం! ఇంతకుమించిన సక్సెస్ లేదు!

  • Published Sep 02, 2024 | 5:29 PM Updated Updated Sep 02, 2024 | 5:29 PM

T Natarajan Visits His School: సన్​రైజర్స్ హైదరాబాద్ పేసర్ నటరాజన్​కు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఐపీఎల్​తో పాటు టీమిండియా తరఫున కూడా ఆడటంతో అతడికి మంచి పాపులారిటీ వచ్చింది. అలాంటోడికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది.

T Natarajan Visits His School: సన్​రైజర్స్ హైదరాబాద్ పేసర్ నటరాజన్​కు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఐపీఎల్​తో పాటు టీమిండియా తరఫున కూడా ఆడటంతో అతడికి మంచి పాపులారిటీ వచ్చింది. అలాంటోడికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది.

  • Published Sep 02, 2024 | 5:29 PMUpdated Sep 02, 2024 | 5:29 PM
SRH బౌలర్ నటరాజన్​కు అరుదైన గౌరవం! ఇంతకుమించిన సక్సెస్ లేదు!

ఎవరి జీవితమైనా స్కూలు నుంచే మొదలవుతుంది. టీచర్లు నేర్పే జీవిత పాఠాలే స్టూడెంట్స్​ను బలంగా మారుస్తాయి. అందుకే ఎంత సక్సెస్ అయిన వారు కూడా తమకు చదువు నేర్పిన ఉపాధ్యాయుల్ని, స్కూలును మర్చిపోరు. అయితే ఒకప్పుడు ఏ స్కూలులోనైతే విద్యార్థిగా ఉండి చదువు నేర్చుకున్నారో.. అదే స్కూలుకు చీఫ్ గెస్ట్​గా హాజరు కావడం మాత్రం అందరి విషయంలో జరగదు. జీవితంలో అత్యున్నత దశకు చేరుకున్న వారికి తప్పితే ఈ గౌరవం అందరికీ దక్కదు. సన్​రైజర్స్ హైదరాబాద్ స్పీడ్​స్టర్ నటరాజన్​కు ఇది లభించింది. తాను పాఠాలు నేర్చుకున్న స్కూలుకు ముఖ్య అతిథిగా అతడు హాజరయ్యాడు.

నటరాజన్ తాను చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకున్న పాఠశాలను తాజాగా సందర్శించాడు. సేలం, చిన్నప్పంపట్టిలోని గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూలుకు స్పెషల్ గెస్ట్​గా విచ్చేశాడీ టీమిండియా క్రికెటర్. ఆ స్కూలులో తాను చదువుకున్న రోజులు, చిన్నప్పటి తన జ్ఞాపకాలను అతడు నెమరేసుకున్నాడు. 33 ఏళ్ల ఈ సీనియర్ పేసర్.. అక్కడి పిల్లలతో కలసి ఫొటోలు దిగాడు. తాను ఎక్కడైతే మొదలుపెట్టానో అక్కడికి వచ్చినందుకు గౌరవంగా ఉందన్నాడు నటరాజన్. ఈ స్కూలు తన ఇల్లు లాంటిదని, ఇక్కడికి రావడం ఎంతో గర్వంగా ఉందన్నాడు. ప్రత్యేక అతిథిగా తనను పిలిచినందుకు స్కూలు యాజమాన్యానికి అతడు కృతజ్ఞతలు తెలిపాడు. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలను తిరిగి మోసుకెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడీ ఎస్​ఆర్​హెచ్​ స్టార్.

ఎవ్వరి లైఫ్ అయినా స్కూలు నుంచే మొదలవుతుంది. అలాగే నటరాజన్ కూడా ఓ ప్రభుత్వ పాఠశాల నుంచే తన కెరీర్​ను స్టార్ట్ చేశాడు. ఏదో సరదాగా బౌలింగ్ చేసేటోడు ఆ తర్వాత క్రికెట్​ను సీరియస్​గా తీసుకొని అంచెలంచెలుగా ఎదిగాడు. సన్​రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్​ ఛాన్స్ రావడంతో అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. ఎస్​ఆర్​హెచ్​ తరఫున అదరగొట్టడంతో నేమ్, ఫేమ్ వచ్చాయి. ఎప్పుడూ చూడనంత డబ్బు కూడా వచ్చింది. అలాగే భారత జట్టులోకి ఆడే అవకాశం దక్కింది. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ కొన్నాళ్ల పాటు అతడు అదరగొట్టాడు. ఆ తర్వాత గాయాలు వెంబడించడం, మునుపటి రేంజ్​లో బౌలింగ్ చేయలేకపోవడం, టీమ్​లో కాంపిటీషన్ తీవ్రమవడంతో రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. అయినా ఐపీఎల్​లో మాత్రం ఇంకా ఆడుతూ ఎస్​ఆర్​హెచ్​ బౌలింగ్​కు పెద్ద దిక్కుగా ఉంటున్నాడు. అలాంటోడు తనకు చదువు నేర్పిన స్కూలుకే గెస్ట్​గా వెళ్లే ఛాన్స్ రావడంతో అక్కడకు వెళ్లి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. కష్టపడితే తనలాగే అందరూ డ్రీమ్స్​ను నెరవేర్చుకోవచ్చని అక్కడి పిల్లల్లో స్ఫూర్తి నింపాడు.

 

View this post on Instagram

 

A post shared by Natraj Jayaprakash (@natarajan_jayaprakash)