iDreamPost

IPL 2024: ముంబైకి షాక్.. టోర్నీకి మపాక దూరం! కారణం తెలిస్తే నవ్వాగదు..

తొలి విజయంతో సంతోషంలో ఉన్న ముంబై ఇండియన్స్ కు షాక్ తగిలింది. ఆ జట్టు స్పీడ్ బౌలర్ క్వేనా మపాక ఈ సీజన్ ఐపీఎల్ మెుత్తానికే దూరమైయ్యాడు. అతడు దూరం కావడానికి కారణం తెలిస్తే మీకు నవ్వాగదు. మరి ఆ రీజన్ ఏంటో చూద్దాం పదండి.

తొలి విజయంతో సంతోషంలో ఉన్న ముంబై ఇండియన్స్ కు షాక్ తగిలింది. ఆ జట్టు స్పీడ్ బౌలర్ క్వేనా మపాక ఈ సీజన్ ఐపీఎల్ మెుత్తానికే దూరమైయ్యాడు. అతడు దూరం కావడానికి కారణం తెలిస్తే మీకు నవ్వాగదు. మరి ఆ రీజన్ ఏంటో చూద్దాం పదండి.

IPL 2024: ముంబైకి షాక్.. టోర్నీకి మపాక దూరం! కారణం తెలిస్తే నవ్వాగదు..

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం నుంచే గాయాలు ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఇక ఇంజ్యూరీల కారణంగా కొంత మంది ప్లేయర్లు టోర్నీ మెుత్తానికే దూరం కాగ.. మరికొందరు కొన్ని మ్యాచ్ లకు అందుబాటులో లేకుండా పోయారు. హ్యారీ బ్రూక్ తన వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ కు దూరమైయ్యాడు. కానీ ముంబై ఇండియన్స్ యువ కెరటం, స్పీడ్ బౌలర్ క్వేనా మపాక విచిత్రమైన కారణంతో ఈ ఐపీఎల్ సీజన్ మెుత్తానికే దూరమైయ్యాడు. ఆ కారణం తెలిస్తే మీకు కచ్చితంగా నవ్వాగదు.

క్వేనా మపాక.. ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్ కప్ లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో తన పదునైన పేస్ తో బ్యాటర్ల ఆటకట్టించి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. దీంతో ఇతడిని ముంబై ఇండియాన్స్ మినీ వేలంలో దక్కించుకుంది. అయితే అండర్ 19లో చూపించిన ప్రతిభనే ఇక్కడా చూపిస్తాడని భావించిన ఎంఐ యజమాన్యానికి ఊహించని షాక్ తగిలింది. వికెట్లు తీయడం అటుంచి.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు ఈ కుర్ర బౌలర్. ఆడిన రెండు మ్యాచ్ ల్లో 89 రన్స్ ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు.

అదీకాక సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 66 పరుగులు ఇచ్చుకుని ఐపీఎల్ లో చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇదిలా ఉండగా.. ఊహించని కారణంతో మపాక ఈ టోర్నీకి దూరమైయ్యాడు. అతడు ఈ ఐపీఎల్ సీజన్ కు దూరం కావడానికి రీజన్ ఏంటంటే? 10th క్లాస్ ఎగ్జామ్స్. అవును మీరు విన్నది నిజమే మపాక పదవ తరగతి పరీక్షలు రాయడానికి స్వదేశం వెళ్తున్నాడు. దీంతో ఈ టోర్నీకి దూరం కానున్నాడు. ఇది వినగానే మీకు నవ్వురావొచ్చు. ప్రస్తుతం అతడి వయసు 18 సంవత్సరాలు. ఆటతో పాటుగా చదువు కూడా ముఖ్యమని భావించిన మపాక ఐపీఎల్ కు దూరం కానున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ కు షాక్ తగిలినట్లు అయ్యింది. మరి మపాక టోర్నీకి దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి