iDreamPost
android-app
ios-app

IPL 2025: SRH ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మళ్లీ సొంత గూటికి వార్నర్?

  • Published Sep 24, 2024 | 2:49 PM Updated Updated Sep 25, 2024 | 4:34 PM

David Warner, Sunrisers Hyderabad, IPL 2025: సన్ రైజర్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తిరిగి సొంత గూటికి డేవిడ్ వార్నర్ చేరుకోనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

David Warner, Sunrisers Hyderabad, IPL 2025: సన్ రైజర్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తిరిగి సొంత గూటికి డేవిడ్ వార్నర్ చేరుకోనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2025: SRH ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మళ్లీ సొంత గూటికి వార్నర్?

ఐపీఎల్ 2025 మెగా టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ ప్లాన్స్ ను రెడీ చేసుకుంటున్నాయి. ఏఏ ప్లేయర్ ను తమ దగ్గర ఉంచుకోవాలి? ఎవరిని జట్టును నుంచి తీసేయాలి అన్న లిస్ట్ లను ఇప్పటికే యాజమాన్యాలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ విషయంలో ఇప్పటికే బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలతో సమావేశం నిర్వహించింది. త్వరలోనే నెక్ట్స్ సీజన్ ఐపీఎల్ కు సంబంధించిన రూల్స్ ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన న్యూస్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు షిప్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ గా క్రికెట్ చరిత్రపై తనదైన ముద్రవేశాడు. ఇక ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వార్నర్.. ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్.. గత రెండు సీజన్లలో ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. దాంతో.. ఢిల్లీ యాజమాన్యం మరోసారి అతడిని రిటైన్ చేసుకునేందుకు మెుగ్గుచూపడం లేదు. వచ్చే సీజన్ కొరకు అతడిని వదిలించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో వార్నర్ పయనం ఎటువైపు? అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ తన సొంతగూటికి అతడు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.

డేవిడ్ వార్నర్ మళ్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లోకి వెళ్లబోతున్నట్లు సమాచారం. వచ్చే ఐపీఎల్ సీజన్ కు అతడిని కొనసాగించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపించడం లేదట. దాంతో అతడు జట్టు నుంచి రావడం ఖాయంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడు తిరిగి తన సొంత టీమ్ అయిన SRHకి ప్రాతినిథ్యం వహించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కావ్య మారన్ వార్నర్ పై దృష్టి పెడుతుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత సీజన్ లో  అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టిన సన్ రైజర్స్ టైటిల్ పోరులో కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. ఆటగాళ్లు అందరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. వారికి తోడు వార్నర్ ను తీసుకుంటే.. జట్టు ఇంకా బలంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే కెరీర్ కు గుడ్ బై చెప్పిన వార్నర్ పై ఫ్రాంచైజీలు అంత ఆసక్తి చూపిస్తాయి అనుకోవడం లేదు. కానీ.. సన్ రైజర్స్ తరఫున ఆడిన వార్నర్ ఘనమైన రికార్డులు సొంతం చేకున్నాడు. ఆ టీమ్ కు ఆడే సందర్బంలో అద్బుతమైన ఆటతీరు కనబరిచాడు. అది దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ టీమ్ వార్నర్ ను కొనుగోలు చేసే అవకాశాలు లేకపోలేదు. ఇక డేవిడ్ భాయ్ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే.. 184 మ్యాచ్ లు ఆడి.. 6565 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలతో పాటుగా 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి మీలో ఎంత మంది వార్నర్ సన్ రైజర్స్ గూటికి రావాలని కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.