వీడియో: హార్దిక్​ను కెప్టెన్ చేయడానికి రోహితే కారణం.. భారత మాజీ క్రికెటర్ కామెంట్స్!

రోహిత్ శర్మ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగించిన సంగతి తెలిసిందే. సారథ్య మార్పు నచ్చని హిట్​మ్యాన్ ఫ్యాన్స్ పాండ్యాను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఓ టీమిండియా మాజీ క్రికెటర్ రియాక్ట్ అయ్యాడు.

రోహిత్ శర్మ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగించిన సంగతి తెలిసిందే. సారథ్య మార్పు నచ్చని హిట్​మ్యాన్ ఫ్యాన్స్ పాండ్యాను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఓ టీమిండియా మాజీ క్రికెటర్ రియాక్ట్ అయ్యాడు.

ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు నుంచే ముంబై ఇండియన్స్ జట్టు వార్తల్లో ఉంది. ఆ టీమ్ కెప్టెన్సీ మార్పు అంశం సంచలనంగా మారింది. జట్టుకు 5 కప్పులు అందించిన లెజెండరీ ప్లేయర్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి అతడి ప్లేస్​లో హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం అప్పట్లో హాట్ టాపిక్​గా మారింది. గుజరాత్​ టైటాన్స్​కు కెప్టెన్​గా ఉన్న పాండ్యాను తీసుకొచ్చి మరీ కెప్టెన్​ చేయడం, రోహిత్​ను అవమానకర రీతిలో బాధ్యతల నుంచి తొలగించడంపై చాలా మంది అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇదే కోపాన్ని ముంబై మ్యాచుల సమయంలో చూపిస్తున్నారు. కొత్త కెప్టెన్​ హార్దిక్​ను ఎగతాళి చేస్తున్నారు. బూ.. అంటూ అతడ్ని హేళన చేస్తున్నారు. దీని వల్ల ఒత్తిడికి గురవుతున్న పాండ్యా సరిగ్గా పెర్ఫార్మ్ చేయడం లేదు. ఈ విషయంపై తాజాగా ఓ టీమిండియా మాజీ క్రికెటర్ రియాక్ట్ అయ్యాడు.

ముంబై కెప్టెన్సీ మార్పు వివాదంపై భారత మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్ప స్పందించాడు. ఓ పాడ్​కాస్ట్​ షోలో అతడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్​ను కెప్టెన్ చేయడానికి రోహితే కారణమని అన్నాడు. బ్యాటింగ్, కెప్టెన్సీలో హిట్​మ్యాన్ ఫెయిల్ అయ్యాడని.. అతడి తప్పిదం వల్లే పాండ్యాకు సారథ్య బాధ్యతల్ని ఎంఐ అప్పగించిందని స్పష్టం చేశాడు. ‘అప్పట్లో రోహిత్ శర్మకు టోర్నమెంట్ మధ్యలోనే కెప్టెన్సీ ఇచ్చారు. అది కూడా రికీ పాంటింగ్ లాంటి లెజెండ్​ను తప్పించి అతడికి బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయాన్ని పాంటింగ్​తో పాటు హర్భజన్ సింగ్, సచిన్ టెండూల్కర్ కూడా స్వాగతించారు. గత 4 ఏళ్లుగా రోహిత్ సరిగ్గా ఆడటం లేదు. 2020 తర్వాత మళ్లీ ఆ టీమ్ కప్పు గెలవలేదు’ అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.

ముంబై ఇండియన్స్ దృష్టి కోణంలో నుంచి చూస్తే గత నాలుగు సీజన్లుగా రోహిత్ బ్యాటర్​గా, కెప్టెన్​గా ఫెయిలయ్యాడని ఊతప్ప తెలిపాడు. ఈ నాలుగేళ్లలో అతడు 300 కంటే తక్కువ పరుగులు చేశాడని పేర్కొన్నాడు. బ్యాట్స్​మన్​గానూ కెప్టెన్​గానూ అతడి సక్సెస్ రేట్ పడిపోయిందన్నాడు. ఇదే హార్దిక్​కు ప్లస్ అయిందన్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాక పాండ్యా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడని వ్యాఖ్యానించాడు ఊతప్ప. హార్దిక్ ఫిట్​నెస్, పెర్ఫార్మెన్స్ గురించి వస్తున్న ట్రోల్స్, విమర్శలు, నెగెటివిటీ అతడ్ని హర్ట్ చేస్తోందన్నాడు. పాండ్యానే కాదు.. ఎవరైనా సరే ఇలాంటి సిచ్యువేషన్​ను ఎదుర్కోవడం కష్టమని, ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి అని ఊతప్ప వివరించాడు. మరి.. రోహిత్ ఫెయిల్యూర్ వల్లే హార్దిక్ వైపు ముంబై చూడాల్సి వచ్చిందంటూ ఊతప్ప చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments