iDreamPost

కోహ్లీ గిఫ్ట్ ఇచ్చిన బ్యాట్ విరగొట్టి.. రింకూ ఏం చెప్తున్నాడో చూడండి..!

Rinku Singh- Virat Kohli: రింకూ సింగ్ గురించి ఐపీఎల్ ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కుర్రాడి టాలెంట్ కి క్రికెట్ దిగ్గజాలు కూడా ఫిదా అయిపోయారు. అయితే రింకూ చేసిన పనికి మాత్రం విరాట్ కోహ్లీ సీరియస్ అయ్యాడు.

Rinku Singh- Virat Kohli: రింకూ సింగ్ గురించి ఐపీఎల్ ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కుర్రాడి టాలెంట్ కి క్రికెట్ దిగ్గజాలు కూడా ఫిదా అయిపోయారు. అయితే రింకూ చేసిన పనికి మాత్రం విరాట్ కోహ్లీ సీరియస్ అయ్యాడు.

కోహ్లీ గిఫ్ట్ ఇచ్చిన బ్యాట్ విరగొట్టి.. రింకూ ఏం చెప్తున్నాడో చూడండి..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్ల యంగ్ స్టర్స్ కి మంచి అవకాశాలు దక్కుతాయి అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ వల్ల టీమిండియాకి ఎంతో మంది టాలెంటెడ్ యువ ఆటగాళ్లు దక్కారు. వారిలో రింకూ సింగ్ కూడా ఒకడు. ప్రత్యర్థి ఎవరైనా సరే రింకూ సింగ్ మాత్రం ఎలాంటి భయం, బెరుకు లేకుండా విజృంభిస్తూ ఉంటాడు. ఎలాంటి బాల్ వేసినా దానిని బౌండరీకి పంపడమే అతనికి తెలిసింది. ఎదురుగా ఉన్నది ఎంత గొప్ప బౌలర్ అయినా కూడా ఎండ్ రిజల్ట్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అతని ఆటకు ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సీనియర్లు కూడా ముచ్చటపడిపోతారు. అలాగే ఆర్సీబీ మీద జరిగిన మ్యాచ్ తర్వాత కోహ్లీ ప్రేమగా రింకూకి బ్యాట్ గిఫ్ట్ ఇచ్చాడు. దానిని రింకూ విరగొట్టాడు.

రింకూ సింగ్ కాలిబర్ గురించి, టాలెంట్ గురించి, అతని స్టామినా గురించి ఇప్పుడు ఎవరికీ అనుమానం లేదు. 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి కేకేఆర్ ని గెలిపించిన తర్వాత అతను వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. ఐపీఎల్ లోనే కాకుండా.. టీమిండియాలో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇలాంటి యంగ్ బ్యాటర్ టాలెంట్ కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అలాగే విరాట్ కోహ్లీ కూడా రింకూ టాలెంట్ కి ఫిదా అయ్యాడు. ఆర్సీబీ- కేకేఆర్ మ్యాచ్ తర్వాత రింకూ సింగ్ ని పిలిచి తన బ్యాట్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే ఆ బ్యాట్ రింకూ సింగ్ విరగొట్టాడు. అదే విషయాన్ని విరాట్ కోహ్లీకి ఇన్ఫామ్ చేస్తూ కెమెరాకి చిక్కాడు. ఆ దృశ్యాలను కేకేఆర్ ట్విట్టర్ హ్యాండిల్ తమ అధికారిక పేజ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.

ఇవాళ (ఏప్రిల్ 21) కోల్ కతా హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్- ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో కేకేఆర్ రింకూ సింగ్- ఆర్సీబీ విరాట్ కోహ్లీ మధ్య ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. గత మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ గిఫ్ట్ ఇచ్చిన బ్యాట్ ని విరగొట్టిన రింకూ సింగ్ ఆ విషయాన్ని కోహ్లీకి చెప్పాడు. మీరు ఇచ్చిన బ్యాట్ విరిగిపోయింది అంటూ కోహ్లీకి చెప్పగానే.. కోహ్లీ షాకవుతూ అవునా విరిగిపోయిందా అని అడిగాడు. అవును స్పిన్నర్ బౌలింగ్ లో బ్యాట్ బోటమ్ దగ్గర విరిగిపోయిందని చెప్పుకొచ్చాడు. స్పిన్నర్ బౌలింగ్ లో విరగొట్టావా? అంటూ కోహ్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం.. అని అడగ్గా.

రింకూ సింగ్ చాలా అమాయకంగా జస్ట్ మీకు చెప్తున్నాను అన్నాడు. అందుకు కోహ్లీ నవ్వుతూ.. నాకు ఎక్స్ ప్లెనషేన్స్ అక్కర్లేదు అంటూ సమాధానం చెప్పాడు. రింకూ సింగ్ అప్పటికే కోహ్లీ దగ్గరున్న బ్యాట్లు తీసుకుని చెక్ చేస్తూ ఉన్నాడు. ఇంక చిన్న పిల్లాడిలా ఇవిగో తీసుకోండి అంటూ ఆ బ్యాట్లు కోహ్లీకి రిటర్న్ చేసి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ గిఫ్ట్ ఇచ్చిన బ్యాట్ అలా ఎలా విరగొట్టావ్ రింకూ అంటూ నెటిజన్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకొంతమంది రింకూ దెబ్బకు ఎలాంటి బ్యాటు అయినా విరిగిపోవాల్సిందే అంటూ ఫన్నీగా రాయాక్ట్ అవుతున్నారు. మరి.. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kolkata Knight Riders (@kkriders)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి