Nidhan
ఈసారి ఐపీఎల్లో ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌తోనైనా బోణీ కొట్టాలని చూస్తోంది. ఈ రెండు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం..
ఈసారి ఐపీఎల్లో ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌తోనైనా బోణీ కొట్టాలని చూస్తోంది. ఈ రెండు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం..
Nidhan
ఈసారి ఐపీఎల్లో ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. తొలి విజయం కోసం హార్దిక్ సేన ఎదురు చూస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం వాంఖడేలో జరిగే పోరులో గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచుల్లోనూ నెగ్గి ఫుల్ జోష్‌లో ఉంది రాజస్థాన్. గెలుపు జోరును కొనసాగిస్తూ అపోజిషన్ టీమ్స్‌కు డేంజర్ సిగ్నల్స్ పంపాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి? అనేది ఇప్పుడు మనం చూద్దాం..
ఓపెనింగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది ముంబై. ఆ తర్వాత సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ రెండు మ్యాచుల్లోనూ ముంబై బ్యాటర్లు బాగానే పెర్ఫార్మ్ చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ సూపర్బ్ టచ్‌లో ఉండటం ఆ టీమ్‌కు ప్రధాన బలం. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ భీకర ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇషాన్ కిషన్ కూడా ఫామ్‌ను అందుకోవడం విశేషం. అయితే ఇంత బ్యాటింగ్ డెప్త్ ఉన్నా ముంబై మ్యాచ్‌లు ఫినిష్ చేయలేకపోతోంది.
బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే రాణిస్తున్నాడు. మిగిలిన వాళ్లందరూ గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం మైనస్‌గా మారింది. అయితే ముంబై టీమ్‌కు అతిపెద్ద నెగెటివ్ అంటే కెప్టెన్ హార్దిక్ పాండ్యా అని చెప్పకతప్పదు. తొలి రెండు మ్యాచుల్లో బౌలింగ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న పాండ్యా.. బ్యాటింగ్‌లో కీలక సమయాల్లో ఔటై నిరాశపర్చాడు. అతడి కెప్టెన్సీ టీమ్‌కు మరో మైనస్‌గా మారింది. ఫీల్డింగ్ పొజిషన్స్, బౌలింగ్ ఛేంజెస్ విషయంలో మాజీ కెప్టెన్ రోహిత్ నుంచి అతడు సలహాలు తీసుకోకుంటే ఎంఐ మరింత నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజస్థాన్ జట్టు ఈసారి బలంగా కనిపిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆ టీమ్‌కు పెద్దగా మైనస్‌లు లేవు. ఓవరాక్షన్ స్టార్‌గా ముద్రపడిన రియాన్ పరాగ్ బ్యాక్ టు బ్యాక్ సూపర్బ్ నాక్స్‌తో సత్తా చాటాడు. ఆ టీమ్‌కు అతడే ప్రధాన బలంగా మారాడు. కెప్టెన్ సంజూ శాంసన్ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. అతడి సారథ్యం ఆకట్టుకుంటోంది. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ నుంచి ఓ బిగ్ నాక్ బాకీ ఉంది. బౌలింగ్‌లో బర్గర్, చాహల్, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో అవేశ్ ఫైనల్ ఓవర్ వేసిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. వీళ్లు అదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తే రాజస్థాన్‌కు తిరుగుండదు.
రెండు టీమ్స్ బలాబలాలను బట్టి రేపటి మ్యాచ్‌లో రాజస్థాన్ నెగ్గడం ఖాయం. ఈ ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా 28 మ్యాచ్‌లు జరిగాయి. అందులో ముంబై 15 సార్లు, రాజస్థాన్ 12 సార్లు నెగ్గాయి. గెలుపోటముల రికార్డుల్లో ముంబై ముందంజలో ఉన్నా రాజస్థాన్ ఆడుతున్న తీరు, వరుస విజయాలు సాధించడంతో ఆ జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది. హార్దిక్ కెప్టెన్సీ, అతడి ఆటతీరు, ముంబై జట్టులో లుకలుకలు, టీమ్ రెండుగా చీలిందనే రూమర్స్ నేపథ్యంలో ఆ జట్టు రాజస్థాన్‌ను నిలువరించడం కష్టమే.
ముంబై:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రేవిస్, గెరాల్డ్ కొయెట్జీ, రొమారియో షెఫర్డ్, పీయుష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా.
రాజస్థాన్:
జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయిర్, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, అవేశ్ ఖాన్.
ఇదీ చదవండి: T20 వరల్డ్ కప్‌కు కేఎల్ రాహుల్ దూరం.. ఈ పాపం BCCIదే!