iDreamPost

T20 వరల్డ్ కప్​కు కేఎల్ రాహుల్ దూరం.. ఈ పాపం BCCIదే!

  • Published Mar 31, 2024 | 5:02 PMUpdated Mar 31, 2024 | 5:02 PM

స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీమిండియాలో ఎంత కీలకమో తెలిసిందే. గత ఏడాది కాలంగా అతడు ఫుల్ ఫామ్​లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్​లోనూ అతడు అదరగొట్టాడు. అలాంటోడి విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు మీద విమర్శలు వస్తున్నాయి.

స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీమిండియాలో ఎంత కీలకమో తెలిసిందే. గత ఏడాది కాలంగా అతడు ఫుల్ ఫామ్​లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్​లోనూ అతడు అదరగొట్టాడు. అలాంటోడి విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు మీద విమర్శలు వస్తున్నాయి.

  • Published Mar 31, 2024 | 5:02 PMUpdated Mar 31, 2024 | 5:02 PM
T20 వరల్డ్ కప్​కు కేఎల్ రాహుల్ దూరం.. ఈ పాపం BCCIదే!

స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీమిండియాలో ఎంత కీలకమో తెలిసిందే. గత ఏడాది కాలంగా అతడు ఫుల్ ఫామ్​లో ఉన్నాడు. ఇంజ్యురీ నుంచి కోలుకొని కమ్​బ్యాక్ ఇచ్చినప్పటి నుంచి అదరగొడుతున్నాడు రాహుల్. ఆసియా కప్ నుంచి మొదలైన అతడి పరుగుల వేట ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్​తో పీక్​కు చేరుకుంది. మెగా టోర్నీలో ఏకంగా 452 పరుగులు చేసిన రాహుల్.. టీమిండియా ఫైనల్ వరకు చేరుకోవడంలో కీలకమైన పాత్ర పోషించాడు. కీపర్​గానూ అద్భుతంగా రాణించాడతను. ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్​లోనూ సత్తా చాటిన రాహుల్.. ఇంగ్లండ్​తో సిరీస్​లో గాయం తిరగబెట్టడంతో టీమ్​కు దూరమయ్యాడు. దాని నుంచి కోలుకొని ఇప్పుడు ఐపీఎల్​లో ఆడుతున్నాడు. అయితే భారత జట్టులో కీలకంగా మారిన రాహుల్ విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి.

ఈ ఐపీఎల్​లో మొదటి మ్యాచ్​లో ఓడిన లక్నో సూపర్ జియాంట్స్ రెండో మ్యాచ్​తో బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్ మీద 21 పరుగుల తేడాతో నెగ్గింది. అయితే ఈ మ్యాచ్​లో రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్యానికి దూరంగా ఉన్నాడు. గాయం తిరగబెడుతుందనే భయంతో నిన్నటి మ్యాచ్​లో ఓన్లీ బ్యాటింగ్ చేశాడు కేఎల్. కెప్టెన్సీకి అతడు దూరంగా ఉన్నాడు. కరీబియన్ బ్యాటర్ నికోలస్ పూరన్ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు. ఇంపాక్ట్ ప్లేయర్​గా బరిలోకి దిగిన రాహుల్ కేవలం బ్యాటింగ్​కే పరిమితం అయ్యాడు. ఇదంతా చూస్తుంటే అతడి ఫిట్​నెస్​పై అందరికీ డౌట్స్ వస్తున్నాయి.

Rahul away from T20 World Cup

మొన్నటివరకు పునరావాసంలో ఉన్న రాహుల్​కు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్​సీఏ) ఎలా క్లియరెన్స్ ఇచ్చిందో అర్థం కావడం లేదు. లక్నో మేనేజ్​మెంట్ చేసిన ఒత్తిడి వల్లే బీసీసీఐ అతడ్ని ఆడేందుకు అనుమతించిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటి మ్యాచ్​కు మాత్రమే కెప్టెన్​గా వ్యవహరించిన రాహుల్ రెండో మ్యాచ్​కు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడు టోర్నీ మొత్తం కొనసాగుతాడా? టీ20 ప్రపంచ కప్​లో ఆడతాడా? అనేది అనుమానంగా మారింది. ఫిట్​గా లేకపోతే ఎన్​సీఏ క్లియరెన్స్ ఎలా ఇస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఒకవేళ గాయం మరింత తీవ్రమై రాహుల్ మెగా టోర్నీలో ఆడకపోతే ఆ పాపం బీసీసీఐదేనని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫిట్​నెస్​తో అతడు ఐపీఎల్​ మొత్తం ఆడటమే కష్టమని.. అలాంటిది టీ20 వరల్డ్ కప్​లో కూడా ఆడాలని అనుకోవడం అత్యాశేనని విమర్శకులు అంటున్నారు. కోట్లకు కోట్లు పెట్టి కొన్నారు కాబట్టి ఎల్​ఎస్​జీ యాజమాన్యం కేఎల్​ను ఆడించాలని అనుకోవడంలో తప్పు లేదని.. కానీ ఫూర్తి ఫిట్​నెస్​ సాధించకున్నా అతడికి బీసీసీఐ క్లియరెన్స్ ఇవ్వడం ముమ్మాటికీ తప్పని ఫైర్ అవుతున్నారు. రాహుల్ గనుక వరల్డ్ కప్​లో ఆడకపోతే దానికి బోర్డే కారణమని సీరియస్ అవుతున్నారు. ఇప్పటికైనా ఐపీఎల్ నుంచి కేఎల్​ను తప్పించి రెస్ట్ ఇవ్వాలని.. లేకపోతే అతడి రికవరీ కష్టమేనని అంటున్నారు. మరి.. రాహుల్ ఉదంతం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: పేరు ఘనం.. ఆట దారుణం! చెత్త బౌలింగ్​తో ఓటమికి కారణమవుతున్న బౌలర్లు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి