Nidhan
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను ఆ జట్టు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవమానించాడు. మాజీ సారథి అని కూడా చూడకుండా హిట్‌మ్యాన్‌ను అగౌరవపరిచాడు.
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను ఆ జట్టు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవమానించాడు. మాజీ సారథి అని కూడా చూడకుండా హిట్‌మ్యాన్‌ను అగౌరవపరిచాడు.
Nidhan
ఐపీఎల్-2024ను ఓటమితో మొదలుపెట్టింది ముంబై ఇండియన్స్. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్ని రకాలుగా ఫెయిలవడం, కీలక సమయాల్లో జట్టు బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఎంఐకి ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ 168 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఎంఐ ఓవర్లన్నీ ఆడి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలుపోటముల కంటే కూడా ఓ విషయం వైరల్ అవుతోంది. రోహిత్ శర్మతో హార్దిక్ పాండ్యా గ్రౌండ్లో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. మాజీ కెప్టెన్ అని కూడా చూడకుండా హిట్‌మ్యాన్‌ను పాండ్యా దారుణంగా అవమానించడం చర్చనీయాంశంగా మారింది.
అనామకుడిగా ఉన్నోడ్ని స్టార్ ప్లేయర్‌ను చేశాడు. వరుసగా ఫెయిలవుతున్నా అవకాశాలు ఇస్తూ పోయాడు. టీమ్‌లో నుంచి తీసేస్తామని ఫ్రాంచైజీ యాజమాన్యం చెబితే.. వాళ్లను ఒప్పించి మరీ జట్టులో కంటిన్యూ చేశాడు. ముంబై ఇండియన్స్‌తో పాటు టీమిండియాలో కూడా రెగ్యులర్ ప్లేయర్‌గా మారడంలో అతడికి హెల్ప్ చేశాడు. ఇలా అన్ని విషయాల్లోనూ హార్దిక్ పాండ్యాను ఆదుకున్నాడు రోహిత్. అతడికి అన్నీ తానై నిలిచాడు. కానీ పాండ్యా మాత్రం హిట్‌మ్యాన్‌ను దారుణంగా అవమానించాడు. ముంబై కెప్టెన్సీ మార్పు విషయంలో ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024లో తొలి మ్యాచ్‌లోనే రోహిత్‌ను టార్గెట్ చేసుకున్నాడు హార్దిక్. ముంబైకి మాజీ కెప్టెన్, టీమిండియాకు తాజా సారథి అయిన రోహిత్‌ను బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేయించాడు పాండ్యా.
కెరీర్ స్టార్టింగ్‌లో తప్పితే ఎప్పుడూ బౌండరీ లైన్ దగ్గర రోహిత్ ఫీల్డింగ్ చేయలేదు. ముంబై ఇండియన్స్‌తో పాటు భారత జట్టుకు ఆడే మ్యాచుల్లో 30 యార్డ్ సర్కిల్ లోపలే ఉంటాడు హిట్‌మ్యాన్. బౌలర్లకు దగ్గరగా ఉంటూ అవసరమైన టైమ్‌లో సూచనలు ఇస్తుంటాడు. అలాగే ఫీల్డింగ్ పొజిషన్స్‌ను సెట్ చేస్తుంటాడు. ప్రత్యర్థి బ్యాటర్ల ఆటతీరును గమనిస్తూ వారికి తగ్గట్లు స్ట్రాటజీలు వేస్తుంటాడు. అలాంటోడ్ని హార్దిక్ అవమానించాడు. మాజీ కెప్టెన్ సలహాలు, సూచనల్ని వాడుకొని జట్టుకు విజయాన్ని అందించాల్సింది పోయి తన కంటే టీమ్‌లో తోపు ఎవరూ లేరనే రీతిలో ప్రవర్తించాడు. 30 యార్డ్ సర్కిల్లో ఉన్న హిట్‌మ్యాన్‌ను ఫోర్ లైన్ దగ్గరకు పంపాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇంత కంటే ఘోరం చూడలేమని.. రోహిత్ భయ్యా ఆ టీమ్‌లో నుంచి బయటకు వచ్చేయ్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ ఓవరాక్షన్ చేస్తున్నాడని.. టీమిండియాకు ఆడేటప్పుడు రోహిత్ చేతుల్లో అతడికి ఒక రేంజ్లో పనిష్మెంట్ ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఏదేమైనా రోహిత్ ఫీల్డింగ్ ఫ్లేస్‌మెంట్ మాత్రం అతడి ఫ్యాన్స్‌ను తీవ్రంగా బాధించింది. మరి.. రోహిత్ విషయంలో హార్దిక్ ప్రవర్తించిన తీరు మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Obey the order.
Still 💔 Rohit Sharmapic.twitter.com/fQ6U2Xi0VO
— Knowledge Hub (@KHByte) March 24, 2024