Nidhan
ఐపీఎల్-2024 ఫస్టాఫ్ ముగిసింది. దీంతో ఏ టీమ్ ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కాబట్టి అన్ని జట్ల ఛాన్సులను ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్-2024 ఫస్టాఫ్ ముగిసింది. దీంతో ఏ టీమ్ ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కాబట్టి అన్ని జట్ల ఛాన్సులను ఇప్పుడు చూద్దాం..
Nidhan
ఐపీఎల్-2024 ఫస్టాఫ్ ముగిసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి ఒకదాన్ని మించి మరో మ్యాచ్ జరిగింది. చాలా మటుకు మ్యాచులు ఆఖరి ఓవర్ వరకూ వెళ్లి ప్రేక్షకులకు మస్తు వినోదాన్ని అందించాయి. దాదాపుగా ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండటంతో ఈసారి వ్యూస్ కూడా నెక్స్ట్ లెవల్లో వచ్చాయి. సీజన్‌లోని సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అన్ని టీమ్స్ 7కు పైగా మ్యాచులు ఆడేశాయి. దీంతో అందరూ ప్లేఆఫ్స్ మీదకు తమ ఫోకస్‌ను మళ్లిస్తున్నారు. ఏ టీమ్ ప్లేఆఫ్స్‌కు వెళ్తుందో తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంతో ప్లేఆఫ్స్ చేరాలంటే ఏ జట్టు ఇంకా ఎన్ని మ్యాచులు నెగ్గాలనేది ఇప్పుడు చూద్దాం..
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇప్పటిదాకా టోర్నీలో 8 మ్యాచులు ఆడింది. ఇందులో 3 మ్యాచుల్లో మాత్రమే నెగ్గి.. ఐదింట ఓటమి పాలైంది. ఆ టీమ్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే నెక్స్ట్ ఆడే 6 మ్యాచుల్లో ఐదింట తప్పకుండా నెగ్గాలి.
పంజాబ్ కింగ్స్: పంజాబ్ కింగ్స్ మళ్లీ నిరాశ పర్చింది. మెగా లీగ్ ఫస్టాఫ్ ముగిసేసరికి ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. 8 మ్యాచుల్లో రెండు విజయాలు, ఆరు ఓటములతో డీలాపడ్డ పంజాబ్.. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే అద్భుతం జరగాలి. ఆ జట్టు తదుపరి ఆడే 6 మ్యాచుల్లోనూ నెగ్గాలి. ఒక్కదాంట్లో ఓడినా ఇక ఇంటికే.
రాజస్థాన్ రాయల్స్: ఈసారి ఐపీఎల్లో టాప్ రేంజ్లో పెర్ఫార్మ్ చేస్తోంది రాజస్థాన్. ఆడిన 8 మ్యాచుల్లో ఏడు విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే నెక్స్ట్ ఆడే 6 మ్యాచుల్లో రెండు విజయాలు సాధిస్తే సరిపోతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్: ఈ సీజన్లో 8 మ్యాచులు ఆడిన ఢిల్లీ మూడింట గెలిచి.. ఐదింట ఓడింది. పంత్ సేన ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే ఆ జట్టు తదుపరి ఆడే 6 మ్యాచుల్లో ఐదింట కచ్చితంగా నెగ్గి తీరాలి.
చెన్నై సూపర్ కింగ్స్: ఢిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ఇప్పటిదాకా 7 మ్యాచుల్లో 4 విజయాలు, 2 పరాజయాలతో పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో ఉంది. ఆ టీమ్ ఇంకా 7 మ్యాచుల్లో ఆడాల్సి ఉంది. వాటిల్లో 4 విజయాలు సాధిస్తే చాలు.. రుతురాజ్ సేనకు ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది.
లక్నో సూపర్ జియాంట్స్: టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో దుమ్మురేపిన లక్నో తర్వాత పరాజయాలను ఎదుర్కొంది. 7 మ్యాచుల్లో 4 విజయాలు, 3 ఓటములతో ఆ టీమ్ ఐదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే రాహుల్ సేన తదుపరి ఆడే 7 మ్యాచుల్లో నాలుగింట నెగ్గితే సరిపోతుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్: భీకర ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి అందర్నీ వణికిస్తోంది. ఆడిన 7 మ్యాచుల్లో ఐదింట నెగ్గి.. రెండు ఓటములతో పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో ఉంది కమిన్స్ సేన. ఆ జట్టు ఇంకా ఏడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఆరెంజ్ ఆర్మీ ఇంకో 3 విజయాలు సాధిస్తే చాలు.
కోల్‌కతా నైట్ రైడర్స్: గంభీర్ మెంటార్‌గా రావడంతో కోల్‌కతా కథ మారింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో ఐదు విజయాలతో ఆ టీమ్ పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో ఉంది. తదుపరి ఆడే 7 మ్యాచుల్లో మూడింట గెలిస్తే చాలు ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది.
గుజరాత్ టైటాన్స్: లాస్ట్ ఇయర్ రన్నరప్ గుజరాత్ ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచుల్లో 4 విజయాలు, 4 పరాజయాలతో ఆరో స్థానంలో ఉంది. ఆ టీమ్ ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే నెక్స్ట్ ఆడే 6 మ్యాచుల్లో నాలుగింట నెగ్గాల్సి ఉంటుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: సీజన్ మారినా రాత మారని ఆర్సీబీ ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచుల్లో కేవలం ఒకే విజయంతో పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్‌లో ఉంది. అయినా ఆ జట్టుకు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే మ్యాజిక్ జరిగితేనే డుప్లెసిస్ సేనకు ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఆ టీమ్ నెక్స్ట్ ఆడే 6 మ్యాచుల్లోనూ నెగ్గాలి. అదే టైమ్‌లో ఇతర టీమ్స్ రిజల్ట్స్ మీద కూడా ఆధారపడాలి. కొన్ని మ్యాచులు రద్దయితే బెంగళూరుకు ప్లస్ అవుతుంది. ఒకవేళ ఆర్సీబీ అన్ని మ్యాచుల్లో గెలిచినా, కొన్ని మ్యాచులు రద్దయినా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అని చెప్పలేం. దీనిపై లీగ్ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరుకునే టైమ్‌లోనే క్లారిటీ వస్తుంది. ఆ టీమ్‌కు ప్లేఆఫ్స్ దారులు పూర్తిగా మూసుకుపోయాయని చెప్పలేం.