Nidhan
ఐపీఎల్-2024ను గుజరాత్ టైటాన్స్ గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు షాక్ ఇచ్చింది గిల్ సేన. ఈ మ్యాచ్‌లో జీటీ విజయానికి గల 5 కారణాలు ఏంటో తెలుసుకుందాం..
ఐపీఎల్-2024ను గుజరాత్ టైటాన్స్ గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు షాక్ ఇచ్చింది గిల్ సేన. ఈ మ్యాచ్‌లో జీటీ విజయానికి గల 5 కారణాలు ఏంటో తెలుసుకుందాం..
Nidhan
ఐపీఎల్-2024ను గుజరాత్ టైటాన్స్ గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. ఆరంభ సీజన్లో ఛాంపియన్‌గా నిలిచిన జీటీ.. గతేడాది రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్‌ను కూడా అంతే పాజిటివ్‌గా స్టార్ట్ చేసింది. ఓడిపోయే మ్యాచ్‌లో ఆఖరి వరకు పోరాడి ముంబై ఇండియన్స్‌కు షాక్ ఇచ్చింది. ఈజీగా నెగ్గుతుందని అనుకున్న హార్దిక్ సేన 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టైటాన్స్ ప్లేయర్లలో గెలవాలన్న కసి, తపన కనిపించింది. అదే వారికి విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 రన్స్ చేసింది. ఛేజింగ్‌కు దిగిన ఎంఐ అన్ని ఓవర్లు ఆడి 9 వికెట్లకు 162 పరుగులే చేయగలిగింది. ఈ నేపథ్యంలో టైటాన్స్ విజయానికి గల 5 కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
టాస్ నెగ్గిన ముంబై కెప్టెన్ గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సెకండ్ ఇన్నింగ్స్ టైమ్‌లో పిచ్ మీద తేమ పడుతుంది కాబట్టి బ్యాటింగ్ ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఆ డిసిషన్ తీసుకున్నాడు. టైటాన్స్ బ్యాటర్లు ఎవరూ సరిగ్గా రాణించలేదు. వరుస విరామాల్లో వికెట్లు పడుతూ పోయాయి. అయితే యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ (45) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాటర్లతో కలసి చిన్న చిన్న భాగస్వామ్యాలు నమోదు చేశాడు. ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొని ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేశాడు. అతడు లేకపోతే జీటీ మంచి స్కోరు చేసేది కాదు. అందుకే సాయి సుదర్శన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.
గుజరాత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి రెండో ప్రధాన కారణం బౌలింగ్ అనే చెప్పాలి. రోహిత్ శర్మ (43), డేవిడ్ బ్రేవిస్ (46) లాంటి బ్యాటర్లు భయపెట్టడంతో ఈ మ్యాచ్‌లో జీటీ నెగ్గడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ ఆ టీమ్ బౌలర్లు అజ్మతుల్లా ఒమర్జాయి (2/27), ఉమేశ్ యాదవ్ (2/31), స్పెన్సర్ జాన్సన్ (2/25), మోహిత్ శర్మ (2/35) అదరగొట్టారు. ఆఖరి ఓవర్లలో జాన్సన్, మోహిత్, ఉమేశ్‌లు కలసి ముంబై బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. స్పిన్నర్ రషీద్ ఖాన్ వికెట్లు తీయకున్నా పరుగులు కట్టడి చేస్తూ, డాట్ బాల్స్ వేస్తూ ఎంఐపై ప్రెజర్ పెట్టాడు. దాని వల్ల ఇతర బౌలర్లకు వికెట్లు పడ్డాయి.
ముంబై వర్సెస్ జీటీ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ సూపర్బ్ అనే చెప్పాలి. అది ఓ సినిమాను తలపించింది. ఆ ఓవర్లో 19 రన్స్ రావాల్సి ఉండగా.. తొలి రెండు బంతులకు 6, 4 కొట్టాడు పాండ్యా. దీంతో మిగిలిన నాలుగు బంతుల్లో 9 రన్స్ చేస్తే చాలు. కానీ ఇక్కడే మ్యాజిక్ జరిగింది. వరుస బంతుల్లో హార్దిక్ (11)తో పాటు పీయుష్ చావ్లా (0)ను వెనక్కి పంపాడు ఉమేష్. తన ఎక్స్‌పీరియెన్స్ మొత్తాన్ని యూజ్ చేసి అతడు వేసిన ఆఖరి స్పెల్ సూపర్బ్ అనే చెప్పాలి.
గుజరాత్‌కు కొత్త కెప్టెన్‌గా వచ్చిన గిల్ ఎక్కడా సంయమనం కోల్పోలేదు. మ్యాచ్ మొత్తం కూల్‌గా కనిపించాడు. బౌలింగ్ ఛేంజెస్, ఫీల్డ్ పొజిషన్స్‌తో అతడు ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రషీద్ ఖాన్‌ను అతడు వాడుకున్న విధానం బాగుంది. అలాగే చివరి ఓవర్ ఉమేష్ యాదవ్‌కు ఇవ్వడం కూడా వర్కౌట్ అయింది. ఓవరాల్‌గా మ్యాచ్ సిచ్యువేషన్స్‌కు తగ్గట్లు డిసిషన్స్ తీసుకుంటూ మంచి కెప్టెన్ అయ్యే సత్తా తనకు ఉందని ప్రూవ్ చేసుకున్నాడు గిల్.
టైటాన్స్‌ను గ్రౌండ్ లోపల ఉన్న కెప్టెన్ గిల్ ఎంత బాగా లీడ్ చేశాడో బయట ఉండి కోచ్ నెహ్రా కూడా అలాగే నడిపించాడు. ఏ కోచ్ అయినా డగౌట్లో కూర్చొని ప్లాన్స్ వేస్తుంటారు. కానీ నెహ్రా మాత్రం ఫుట్‌బాల్ కోచ్‌ల మాదిరిగా బౌండరీ లైన్ పక్కన నిలబడి ఎప్పటికప్పుడు కెప్టెన్ గిల్‌కు కావాల్సిన ఇన్పుట్స్ పంపించాడు. అలాగే పేసర్లకు ధైర్యాన్ని ఇస్తూ మ్యాచ్ మనదే, వదిలేదేలే అంటూ ధైర్యాన్ని నూరిపోశాడు. ఈ విషయాన్ని స్వయంగా బౌలర్ జాన్సన్ పంచుకున్నాడు. కాబట్టి గుజరాత్ విజయానికి నెహ్రాకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే.
ఇదీ చదవండి: షారుఖ్ ఖాన్‌తో కలిసి IPL మ్యాచ్‌కు వచ్చిన ఈమె ఎవరు? షారుఖ్‌తో రిలేషన్ ఏంటి?
GUJARAT TITANS HAVE DEFEATED MUMBAI INDIANS IN AHMEDABAD. 🔥 pic.twitter.com/CbmiJrRUVy
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2024