iDreamPost
android-app
ios-app

Dinesh Karthik: కార్తీక్ అంటే బ్యాటింగే అనుకుంటున్నారు.. అతడి కెప్టెన్సీ రికార్డులు తెలుసా?

  • Published Apr 16, 2024 | 5:24 PM Updated Updated Apr 16, 2024 | 5:24 PM

ఆర్సీబీ సీనియర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ చెలరేగి ఆడుతున్నాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసం మామూలుగా లేదు. అయితే డీకే బ్యాటింగ్​లోనే కాదు.. కెప్టెన్సీలోనూ తోపేనని చాలా మందికి తెలియదు.

ఆర్సీబీ సీనియర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ చెలరేగి ఆడుతున్నాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసం మామూలుగా లేదు. అయితే డీకే బ్యాటింగ్​లోనే కాదు.. కెప్టెన్సీలోనూ తోపేనని చాలా మందికి తెలియదు.

  • Published Apr 16, 2024 | 5:24 PMUpdated Apr 16, 2024 | 5:24 PM
Dinesh Karthik: కార్తీక్ అంటే బ్యాటింగే అనుకుంటున్నారు.. అతడి కెప్టెన్సీ రికార్డులు తెలుసా?

దినేష్ కార్తీక్.. ఈసారి ఐపీఎల్​లో అత్యంత చర్చనీయాంశంగా మారిన వారిలో ఒకడు. రెండు దశాబ్దాలుగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్న ఈ వికెట్ కీపర్, బ్యాటర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్​లో ఉన్నాడు. మునుపెన్నడూ చూడని రీతిలో ప్రతి మ్యాచ్​లోనూ బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు డీకే. బ్యాట్​తో రెచ్చిపోయి ఆడుతూ తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. ఆర్సీబీ ఓడిపోతున్నా అతడి బ్యాటింగ్ మాత్రం హైలైట్​గా నిలుస్తోంది. డీకే బ్యాటింగ్ కోసం వేలాది మంది ఫ్యాన్స్ స్టేడియాలకు పోటెత్తుతున్నారు. నిన్న సన్​రైజర్స్​తో మ్యాచ్​లో కూడా 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. ఈ సీజన్​లో ఆడిన 7 మ్యాచుల్లో కలిపి 226 పరుగులు చేశాడు. అతడి స్టైక్ రేట్ 206గా ఉంది. అయితే అందరూ డీకే బ్యాటింగ్ గురించే మాట్లాడుతున్నారు. కానీ అతడిలో మరో టాలెంట్ కూడా ఉంది.

దినేష్ కార్తీక్ అంటే అందరూ కీపింగ్, బ్యాటింగ్ అనే అనుకుంటున్నారు. వికెట్ల వెనుక క్యాచులు పట్టడం, రనౌట్లు, స్టంపింగ్స్​తో మ్యాజిక్ చేయడం.. సంచలన ఇన్నింగ్స్​లతో టీమ్​ను ఒడ్డున పడేయడం మాత్రమే అతడికి తెలుసునని భావిస్తున్నారు. కానీ డీకేలో ఇంకో టాలెంట్ కూడా ఉంది. అదే కెప్టెన్సీ. స్టైలిష్ బ్యాటర్ అయిన కార్తీక్​ను అప్పట్లో అందరూ తమిళనాడు సచిన్ అని పిలిచేవాళ్లు. మాస్టర్ బ్లాస్టర్ స్థాయికి అతడు చేరతాడని అనుకున్నారు. అయితే ఆ రేంజ్​లో కాకపోయినా స్టార్ బ్యాటర్​గా గుర్తింపు సంపాదించాడు. చాలా మ్యాచుల్లో భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు డీకే. టీమిండియాకు బ్యాటర్​గా, కీపర్​గా ఆడినా డొమెస్టిక్ క్రికెట్​లో మాత్రం అతడు తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. తమిళనాడు జట్టుకు సారథిగా ఉంటూ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు.

2006-07 సీజన్​లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్​లో తమిళనాడు విజేతగా నిలిచింది. అప్పుడు జట్టును కెప్టెన్​గా ముందుండి లీడ్ చేశాడు డీకే. ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్​ వరకు టీమ్​ పెర్ఫార్మెన్స్ ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. తాను కూడా బ్యాట్​తో రాణిస్తూ సహచరుల్లో బాగా ఆడాలనే స్ఫూర్తి నింపాడు. ముస్తాక్ అలీ టోర్నీతో పాటు ఇండియా-ఏ టీమ్​కు కూడా సారథ్యం వహించాడు కార్తీక్. 2018-19 సీజన్​లో జరిగిన దేవ్​ధర్ ట్రోఫీలో భారత-ఏ జట్టును ముందుండి లీడ్ చేశాడు డీకే. ఇలా కీపర్​గా, బ్యాటర్​గా, కెప్టెన్​గా తనకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా 100 పర్సెంట్ ఎఫర్ట్ పెడుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. కామెంట్రీలోనూ అతడిది అందె వేసిన చేయే. డీకే ఉన్న ఫామ్​కు అతడ్ని టీ20 వరల్డ్ కప్​కు సెలక్ట్ చేయడం పక్కా అని వినిపిస్తోంది. మరి.. కార్తీక్​ను ప్రపంచ కప్ జట్టులో చూడాలని భావిస్తే కామెంట్ చేయండి.