iDreamPost

సీజన్​ గ్యాప్​లో SRHలో ఊహించని మార్పు! కమిన్స్, కావ్య మారన్ కాదు.. అతడికే క్రెడిట్!

  • Published Apr 16, 2024 | 4:21 PMUpdated Apr 16, 2024 | 4:21 PM

ఒక్క సీజన్ గ్యాప్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటతీరులో ఊహించని మార్పు కనిపిస్తోంది. వరుస సక్సెస్​లు అది కూడా ప్రత్యర్థి జట్లను భయపెట్టి మరీ గెలవడం ఇంట్రెస్టింగ్​గా మారింది. జట్టు సక్సెస్ వెనుక ఓ సూపర్ పవర్ ఉంది.

ఒక్క సీజన్ గ్యాప్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటతీరులో ఊహించని మార్పు కనిపిస్తోంది. వరుస సక్సెస్​లు అది కూడా ప్రత్యర్థి జట్లను భయపెట్టి మరీ గెలవడం ఇంట్రెస్టింగ్​గా మారింది. జట్టు సక్సెస్ వెనుక ఓ సూపర్ పవర్ ఉంది.

  • Published Apr 16, 2024 | 4:21 PMUpdated Apr 16, 2024 | 4:21 PM
సీజన్​ గ్యాప్​లో SRHలో ఊహించని మార్పు! కమిన్స్, కావ్య మారన్ కాదు.. అతడికే క్రెడిట్!

ఎన్నో ఎక్స్​పెక్టేషన్స్​తో వచ్చి ఘోరమైన పరాభవాలను మూటగట్టుకోవడం, టోర్నమెంట్ ముగిసేసరికి పాయింట్స్ టేబుల్​లో ఆఖర్లో ఉన్న జట్లతో పోటీపడుతూ లాస్ట్​ పొజిషన్​లో నిలవడం.. గత కొన్ని సీజన్లుగా సన్​రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇది. దారుణమైన పెర్ఫార్మెన్స్​తో అభిమానులను పూర్తిగా నిరాశపరుస్తూ వచ్చింది ఆరెంజ్ ఆర్మీ. అయితే ఎట్టకేలకు జట్టు రాత మారింది. ఒక్క సీజన్ గ్యాప్​లో ఎస్​ఆర్​హెచ్​లో ఊహించని మార్పు వచ్చింది. ఐపీఎల్-2024లో ఆడిన 6 మ్యాచుల్లో నాలుగింట గెలిచి పాయింట్స్ టేబుల్​లో 4వ స్థానంలో నిలిచింది. పది రోజుల గ్యాప్​లో రెండు సార్లు 270 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది. చెన్నై, ముంబై, ఆర్సీబీ లాంటి టాప్ టీమ్స్​ను చిత్తు చేసింది. అయితే సన్​రైజర్స్ సక్సెస్​కు కొత్త కెప్టెన్ కమిన్స్ లేదా ఓనర్ కావ్య మారన్ కారణం కాదు.. టీమ్​ను ఓ సూపర్ పవర్ నడిపిస్తోంది. కమిన్స్, కావ్య కృషిని కాదనలేం.. అయితే ఎక్కువ క్రెడిట్ మాత్రం అతడికే దక్కుతుంది.

ఎస్​ఆర్​హెచ్​ వరుస విజయాల వెనుక ఓ కనిపించని శక్తి ఉంది. అదే డానియల్ వెటోరి. ఈ సీజన్​లో ఆరెంజ్ ఆర్మీ కోచ్​గా బాధ్యతలు తీసుకున్నాడీ కివీస్ లెజెండ్. టోర్నమెంట్ ఆరంభానికి ముందు నుంచే పకడ్బందీ వ్యూహాలతో ఫుల్​గా ప్రిపేర్ అయి వచ్చాడు. గతేడాది ఆఖర్లో జరిగిన మెగా ఆక్షన్​లో పట్టుబట్టి మ్యాచ్ విన్నర్ అయిన ట్రావిస్ హెడ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్​ను టీమ్​లోకి తీసుకొచ్చాడు. అతడి కోసం రూ.20.50 కోట్లు ఖర్చు పెట్టించి మరీ ఎంట్రీ ఇప్పించాడు. టీమ్ బాగుంటే సరిపోదని.. నడిపించే కెప్టెన్ కూడా బలంగా ఉండాలని నమ్మి కావ్య పాపను కన్విన్స్ చేశాడు. అభిషేక్ శర్మను ఓపెనర్​గా ప్రమోట్ చేశాడు. మిడిలార్డర్​లో వచ్చే కీపర్ హెన్రిక్ క్లాసెన్​ను అవసరాన్ని బట్టి టాపార్డర్​లో ఆడిస్తున్నాడు వెటోరి. అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి లాంటి యంగ్ టాలెంట్​ను ట్రంప్​ కార్డ్​గా ఉపయోగిస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నాడు.

బ్యాటింగ్​లో ఓపెనర్లతో పాటు ఇతర పొజిషన్స్​ను కూడా భలే సెట్ చేశాడు వెటోరి. ఏ పొజిషన్​లో ఎవరు బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది? ఎవరి సత్తా ఏంటి? అనేది కెప్టెన్ కమిన్స్​తో డిస్కస్ చేస్తూ టీమ్ కాంబినేషన్​ను సెట్ చేశాడు. ఫస్ట్ బాల్ నుంచే అటాకింగ్ అప్రోచ్​తో ఆడమని ధైర్యం నూరిపోశాడు. బౌలింగ్​లోనూ కమిన్స్​తో లీడ్ చేయిస్తూ ఆరేడు ఆప్షన్లను అందుబాటులో ఉంచాడు. ఫెయిలైనా సరే మయాంక్ మార్కండే వంటి వికెట్ టేకర్​కు వరుస ఛాన్సులు ఇస్తున్నాడు. అందుకే ఆర్సీబీతో మ్యాచ్​లో కోహ్లీతో పాటు రజత్ పాటిదార్ వికెట్లు తీశాడతను.

బెంగళూరుకు నాలుగేళ్ల పాటు కోచ్​గా ఉన్న వెటోరికి ఐపీఎల్​లో ఎలాంటి ప్లేయర్లు అవసరం? ఎలాంటి వ్యూహాలు పన్నాలి? ఏ ఆటగాడ్ని ఎప్పుడు ఆడించాలి? లాంటి వాటిపై పూర్తి అవగాహన ఉంది. ఇతర జట్ల ఆటతీరు, ప్లేయర్ల పెర్ఫార్మెన్స్​ను నిశితంగా గమనిస్తూ ఎస్​ఆర్​హెచ్ విజయానికి కావాల్సిన ప్లాన్స్​ను వేస్తూ తన పని తాను సైలెంట్​గా చేసుకుపోతున్నాడు. హడావుడి చేయడానికి అంతగా ఇష్టపడని వెటోరి.. డగౌట్​లో కూర్చొని టీమ్​ను వెనుక నుంచి సూపర్బ్​గా నడుపుతున్నాడు. మరి.. వెటోరి కోచింగ్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి