iDreamPost
android-app
ios-app

తమ్ముడు విలన్ అవుతుంటే.. అన్న హీరో అవుతున్నాడు!

  • Published Apr 08, 2024 | 4:53 PM Updated Updated Apr 08, 2024 | 4:53 PM

పాండ్యా బ్రదర్స్​లో ఒకరు హీరో అవుతుంటే.. మరొకరు విలన్ అవుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పాండ్యా బ్రదర్స్​లో ఒకరు హీరో అవుతుంటే.. మరొకరు విలన్ అవుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Apr 08, 2024 | 4:53 PMUpdated Apr 08, 2024 | 4:53 PM
తమ్ముడు విలన్ అవుతుంటే.. అన్న హీరో అవుతున్నాడు!

ఇద్దరు అన్నాదమ్ముళ్లు కలసి పెరిగారు, కలసి ఎదిగారు. క్రికెట్​ కెరీర్​ను ఒకేసారి స్టార్ట్ చేసి స్టార్​డమ్ సంపాదించారు. ఇద్దరూ టీమిండియాకు ఆడినా అందులో ఒకరు మాత్రమే హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించారు. అయితే ఇప్పుడు అతడే విలన్ అవుతున్నాడు. తమ్ముడి స్థాయిలో క్రేజ్ లేకపోయినా తన ఆటతీరుతో ప్రతిసారి అభిమానులను మెప్పిస్తూ హీరోగా మారాడు అన్న. ఆ బ్రదర్స్ మరెవరో కాదు.. పాండ్యా సోదరులు. ఎంతో స్టార్​డమ్ ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్​గా ఛార్జ్ తీసుకున్నా ఈ సీజన్​లో అందరికీ విలన్​గా మారాడు. కానీ స్పిన్ ఆల్​రౌండర్​ కృనాల్ పాండ్యా మాత్రం లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ హీరోగా మారాడు. పాండ్యా బ్రదర్స్ మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందో చూద్దాం..

ఐపీఎల్-2024 సీజన్​కు ముందు నిర్వహించిన మినీ ఆక్షన్​లో గుజరాత్ నుంచి ముంబైకి వచ్చేయడం, కెప్టెన్సీ తీసుకోవడంతో రోహిత్ ఫ్యాన్స్​కు శత్రువులా మారాడు హార్దిక్ పాండ్యా. అతడి ఓవరాక్షన్, సీనియర్స్, కోచింగ్ స్టాఫ్​కు రెస్పెక్ట్ ఇవ్వకపోవడంతో మరింత నెగెటివిటీ పెరిగిపోయింది. అయితే అటు అతడి అన్న కృనాల్ మాత్రం ఈ సీజన్​లో అదరగొడుతున్నాడు. బంతితో, బ్యాట్​తో మెరుస్తూ టీమ్ సక్సెస్​లో కీలకంగా మారాడు. పంజాబ్ కింగ్స్​తో మ్యాచ్​లో 22 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు కృనాల్. మిగిలిన మ్యాచుల్లో అతడికి ఎక్కువ బంతులు ఆడే అవకాశం రాలేదు. ఈ సీజన్​లో బంతితోనూ మ్యాజిక్ చేస్తున్నాడు కృనాల్. ఇప్పటిదాకా ఆడిన ఆడిన 4 మ్యాచుల్లో 3 వికెట్లే తీశాడు. కానీ అతడి ఎకానమీ మాత్రం అద్భుతంగా ఉంది.

ఈ సీజన్​లో కృనాల్ పాండ్యా ఎకానమీ 5.50గా ఉంది. అతడి వికెట్లు తీయకపోయినా పరుగులు కట్టడి చేస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లను ఎక్కడికక్కడ కట్టి పడేస్తున్నాడు. దీంతో మిగిలిన బౌలర్ల బౌలింగ్​లో రన్స్ చేసేందుకు ప్రయత్నించి వికెట్లు అప్పగిస్తున్నారు బ్యాటర్లు. గత 8 సీజన్లుగా చూసుకుంటే ఎన్నడూ కూడా అతడి బౌలింగ్ ఎకానమీ 8 దాటలేదు. ఈసారి అయితే 6 లోపే ఉంది. దీన్ని బట్టే అతడు ఎంత సూపర్బ్​గా బౌలింగ్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇది చూసిన నెటిజన్స్ అతడ్ని మోస్ట్ అండర్​రేటెడ్ ప్లేయర్​గా చెబుతున్నారు. అతడు రియల్ హీరో అని మెచ్చుకుంటున్నారు. ఇక, హార్దిక్​ మాత్రం చెత్తాటతో అందరికీ విలన్​గా మారాడు. ఆల్రెడీ కెప్టెన్సీ వివాదంతో విమర్శలను ఎదుర్కొంటున్న అతడు.. బ్యాటింగ్, బౌలింగ్​లోనూ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఇప్పటిదాకా 4 మ్యాచుల్లో కలిపి అతడు 76 రన్స్ మాత్రమే చేశాడు. బౌలింగ్​లో ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. తన ఓవర్లలో భారీగా రన్స్ లీక్ అవడం, వికెట్లు పడకపోవడంతో బౌలింగ్​కు దూరంగా ఉంటున్నాడు పాండ్యా. మరి.. హార్దిక్-కృనాల్ పెర్ఫార్మెన్స్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.