అమ్మాయితో హగ్‌ కావాలంటే రూ.11.. ముద్దు కావాలంటే 115 రూపాయలు!

Street Girlfriend Trend In China-Girls Offers Hug, Kiss To Young Boys: స్ట్రీట్ ఫుడ్ గురించి విన్నాం. కానీ ఇప్పుడు కొత్తగా స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ ట్రెండ్ మొదలైంది. సింగిల్స్ కోసం తక్కువ ధరకే హగ్ లు, ముద్దులు ఆఫర్ చేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. చాలా చీప్ ధరకే అమ్మాయిలు ముద్దులు, హగ్గులు, పెగ్గులు ఆఫర్ చేస్తుండడంతో యువకులు ఎగబడుతున్నారు.

Street Girlfriend Trend In China-Girls Offers Hug, Kiss To Young Boys: స్ట్రీట్ ఫుడ్ గురించి విన్నాం. కానీ ఇప్పుడు కొత్తగా స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ ట్రెండ్ మొదలైంది. సింగిల్స్ కోసం తక్కువ ధరకే హగ్ లు, ముద్దులు ఆఫర్ చేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. చాలా చీప్ ధరకే అమ్మాయిలు ముద్దులు, హగ్గులు, పెగ్గులు ఆఫర్ చేస్తుండడంతో యువకులు ఎగబడుతున్నారు.

పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు పెరిగిపోతున్న కారణంగా చైనాలోని ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు అక్కడ యువత స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్స్ అనే ట్రెండ్ అక్కడ విపరీతంగా పెరిగిపోతుంది. కౌగిలింత, ముద్దు, సాంగత్యం వంటివి సరసమైన ధరలకే ఆఫర్ చేస్తుండడంతో మగవారు ఎగబడుతున్నారు. అయితే లైంగిక సంబంధం మాత్రం కుదరదని అమ్మాయిలు చెప్పడం విశేషం. సాంప్రదాయ దుస్తుల్లో, మోడ్రన్ దుస్తుల్లో అమ్మాయిలు ప్లకార్డులు పట్టుకుని మరీ వీధుల్లో తమకొక రేటు ఫిక్స్ చేసుకున్నారు. వాస్తవానికి స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ అనే ట్రెండ్ గత ఏడాది ఏప్రిల్ నెలలో వెలుగులోకి వచ్చింది. అయితే డిమాండ్, క్రేజ్ మాత్రం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. చైనాలోని షెన్జన్ నగరంలో యువతులు హగ్స్ ని, ముద్దులను అమ్ముకుంటున్నారు. ఒక యువతి ఒక యువాన్ (11.54 రూపాయలు) ఇస్తే ఒక హగ్ ఇస్తానని.. 10 యువాన్లు (115.45 రూపాయలు) ఇస్తే ముద్దు పెడతానని ఆఫర్ చేస్తుంది. 15 యువాన్లు (173.17 రూపాయలు) ఇస్తే కలిసి సినిమాకొస్తానని ఆఫర్ చేస్తుంది.

ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. మరొక యువతి అయితే ఇంటి పనులు చేసి పెడతామని.. మందు తాగడంలో కంపెనీ ఇస్తానని అంటుంది. ఇంటి పనులు చేయడానికి 20 యువాన్లు (230.88 రూపాయలు), కలిసి మందు కొట్టడానికి 40 యువాన్లు (461.77 రూపాయలు) ఇవ్వాలని కొంతమంది బోర్డు పెట్టుకుని కూర్చున్నారు. వీరిలో కొంతమంది అబ్బాయిలతో కలిసి విహారయాత్రకు వచ్చేందుకు 100 యువాన్లు (1154.42 రూపాయలు) ఛార్జ్ చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్స్ ట్రెండ్ పై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టైం పాస్ చేయడానికి, ఆసక్తికర వ్యక్తులను కలవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి, సాంఘికంగా ఉండడానికి స్వచ్ఛంద కార్యకలాపాల్లో భాగమే అని కొంతమంది చెబుతున్నారు.

మరికొంతమంది మాత్రం.. అమ్మాయిలు ఇలా ముద్దులు, హగ్గులు అమ్ముకోవడం అనేది గౌరవం కాదని.. వారి గౌరవాన్ని దెబ్బ తీస్తుందని.. అది ఆడవారికే మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై ఒక లాయర్ కూడా స్పందించారు. స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ వ్యవస్థపై నియంత్రణ లేకపోవడం వల్ల ఇది వ్యభి*చారానికి దారి తీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక, భావోద్వేగ  అవసరాలను తీర్చుకునేందుకు యువతను ఆరోగ్యకరమైన మార్గాల వైపు నడిచేలా మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఇదిలా ఉంటే ఇలాంటి స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ ట్రెండే యున్నాన్ ప్రావిన్స్ లోని డాలి యాన్సీంట్ నగరంలో కూడా నడుస్తోంది. అక్కడ ఒక యువతి ఒక రోజు లవర్ గా సేవలు అందిస్తానని బోర్డు పట్టుకుని కనిపించింది. అందుకోసం 600 యువాన్లు (6925.81 రూపాయలు) ఆఫర్ చేసింది. కలిసి భోజనం చేయడం, హగ్స్ ఇవ్వడం, ముద్దులు పెట్టడం ఈ ఆఫర్ లో ఉంటాయి. అయితే లైంగిక సంబంధం పెట్టుకోవడం మాత్రం లేదని ఆ యువతి చెప్పుకొచ్చింది.        

Show comments