Venkateswarlu
Venkateswarlu
ఏ భర్తకు రాని కష్టం ఆ భర్తకు వచ్చింది. మరికొద్దిరోజుల్లో చనిపోబోతున్న ఆ భార్య భర్తను ఓ దారుణమైన కోరిక కోరింది. ఆ కోరిక విన్న భర్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏం చేయాలో తెలీని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మరికొద్దిరోజుల్లో చనిపోబోతున్న భార్య కోరిక తీర్చి తాను నరకం అనుభవించాలా? లేక కోరిక తీర్చకుండానే ఆమెను చనిపోనివ్వాలా? ఈ రెండు ప్రశ్నలు అతడ్ని వేధిస్తున్నాయి. ఇంతకీ ఆ భార్య ఏం కోరిక కోరింది? అతడు ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతున్నాడు? అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడ్డిట్ యూజర్ అయిన ఓ వ్యక్తి భార్య గత కొద్దినెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. మరికొన్ని రోజుల్లో ఆమె చనిపోతుందని డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో అతడు కన్నీరు మున్నీరు అయ్యాడు. తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె మరికొద్దిరోజుల్లో చచ్చిపోతుందని తెలిసి తట్టుకోలేకపోయాడు. అది కూడా కేవలం 9 నెలలు మాత్రమే ఆమె బతికి ఉంటుందని తెలిసి తల్లడిల్లిపోయాడు. ఈ 9 నెలలు ఆమెను సంతోషంగా ఉంచాలని భావించాడు. ఆమె అడిగినవన్నీ చేస్తూ వస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఆమె ఓ అతడ్ని ఓ దారుణమైన కోరిక కోరింది. మరికొన్ని రోజుల్లో చనిపోతున్న తాను తన మొదటి భర్తతో ఏకాంతంగా గడపాలనుకుంటున్నట్లు తెలిపింది. ఆమె అలా అడిగే సరికి అతడి ప్రాణం విలవిల్లాడింది. ఏం మాట్లాడాలో.. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో తెలీక.. రెడ్డిట్లో తన బాధను పంచుకున్నాడు. ‘‘ ఆమె లేకుండా నేను నా జీవితాన్ని ఊహించుకోలేను. ఆమె చనిపోయిన తర్వాత ఏం చేస్తానో కూడా నాకు తెలీదు. చివరి రోజుల్లో ఆమెను సంతోషంగా ఉంచాలని భావిస్తున్నా.. అందుకే ఆమె అడిగినవన్నీ చేస్తున్నా.. ఓ రోజు ఆమె నన్ను ఓ కోరిక కోరింది.
‘నేను నా మాజీ భర్తతో ఏకాంతంగా గడపాలనుకుంటున్నా’ అని అడిగింది. ఆమె ఎందుకలా అడిగిందో నాకు తెలీదు. బహుశా అతడే తనకు సరైన శృంగార జోడీ అని ఆమె భావిస్తున్నట్లు ఉంది. నేను ఏం చేయాలో అర్థం కావటం లేదు. నా ఈగో కోసం కుదరదని చెప్పనా? లేక తన కోరికను తీర్చనా?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక, ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతడి పోస్టు చూస్తున్న నెటిజన్లు కూడా ‘అయ్యో! ఎంత కష్టం వచ్చింది’ అంటూ బాధపడుతున్నారు. మరి, సదరు భర్తను.. భార్య అడిగిన చివరి కోరికపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.