Why Indians Pursuing MBBS In Bangladesh: ఎన్నో దేశాలు ఉండగా మనోళ్లు చదువుకోడానికి బంగ్లాదేశ్‌కే వెళ్తున్నారు?

ఎన్నో దేశాలు ఉండగా మనోళ్లు చదువుకోడానికి బంగ్లాదేశ్‌కే వెళ్తున్నారు?

Why Indians Studying In Bangladesh: విదేశీ విద్య కోసం ప్రపంచంలో విద్య విషయంలో అగ్రగామిగా ఉన్న యూకే, యూఎస్, కెనడా వంటి దేశాలకు వెళ్తుంటారు. అందులో భారతీయులు కూడా ఎక్కువగానే ఉంటారు. అయితే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండగా పేద దేశాల జాబితాలో ఉన్న బంగ్లాదేశ్ కి మనోళ్లు ఎందుకు వెళ్తున్నారు? అగ్ర దేశాలను కాదని బంగ్లాదేశ్ కే చదువుకునేందుకు వెళ్ళడానికి కారణమేంటి?  

Why Indians Studying In Bangladesh: విదేశీ విద్య కోసం ప్రపంచంలో విద్య విషయంలో అగ్రగామిగా ఉన్న యూకే, యూఎస్, కెనడా వంటి దేశాలకు వెళ్తుంటారు. అందులో భారతీయులు కూడా ఎక్కువగానే ఉంటారు. అయితే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండగా పేద దేశాల జాబితాలో ఉన్న బంగ్లాదేశ్ కి మనోళ్లు ఎందుకు వెళ్తున్నారు? అగ్ర దేశాలను కాదని బంగ్లాదేశ్ కే చదువుకునేందుకు వెళ్ళడానికి కారణమేంటి?  

బంగ్లాదేశ్ లో ప్రస్తుతం పరిస్థితులు బాలేదు. అక్కడ హింసాత్మక ఘటనల కారణంగా ఆ దేశ ప్రధాని దేశం విడిచి పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో చాలామంది బంగ్లాదేశ్ లో ఉన్నత చదువులు చదువుకుంటున్న విద్యార్థులు భారతదేశానికి వచ్చేస్తున్నారు. జూలై చివరి నాటికి సుమారు 7 వేల మంది స్టూడెంట్స్ మన దేశానికి తిరిగొచ్చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా ఉన్నత చదువుల కోసం బంగ్లాదేశ్ నే ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఈ ప్రశ్నకు కొంతమంది విద్యార్థులు ఇచ్చిన సమాధానాలు వింటే ఆశ్చర్యం వేస్తుంది.      

చదువుకయ్యే ఖర్చు తక్కువ:

భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2022లో 13 లక్షల మంది భారతీయులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లగా.. అందులో 9,308 మంది బంగ్లాదేశ్ కి వెళ్లారు. అయితే ఉన్నత చదువుల కోసం బంగ్లాదేశ్ వెళ్ళడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది.. విద్యకు అయ్యే ఖర్చు తక్కువగా ఉండడం. బంగ్లాదేశ్ లో చదువుకి అయ్యే ఖర్చు తక్కువగా ఉన్న కారణంగా ఉన్నత చదువుల కోసం అక్కడకి వెళ్తున్నామని అన్నారు. అక్కడ ఎంబీబీఎస్ చేసేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువని విద్యార్థులు వెల్లడించారు. మన దేశంలో వైద్య విద్యకి కోటి రూపాయలకు పైనే ఖర్చు అవుతుండగా.. బంగ్లాదేశ్ లో మాత్రం 40 లక్షల నుంచి 50 లక్షలే ఖర్చు అవుతుంది. ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు పరిమితంగా ఉండడం, ఖర్చు ఎక్కువగా ఉండడం వల్ల బంగ్లాదేశ్ కి వెళ్తున్నట్లు చెబుతున్నారు.  

రవాణా ఖర్చు తక్కువ, రవాణా సౌకర్యం బాగుండడం:

బంగ్లాదేశ్ లోని కిషోర్ గంజ్ లో ఉన్న మెడికల్ కాలేజీ నుంచి భారత్ లో ఉన్న త్రిపుర రాష్ట్రానికి 3 గంటల సమయంలో చేరుకోవచ్చు. అక్కడ నుంచి విమానంలో కోల్కతాకి గంటలో వెళ్ళచ్చు. ఈ కారణంగా కొంతమంది బంగ్లాదేశ్ వెళ్లి అక్కడ మెడికల్ కాలేజీలో చేరుతున్నారు. అలానే భారత్, బంగ్లాదేశ్ ల మధ్య రవాణా సౌకర్యం కూడా బాగుంది. గంటల్లోనే కోల్కతా చేరుకోవచ్చు. మనోళ్లు బంగ్లాదేశ్ లో చదువుకునేందుకు ఇది కూడా ఒక కారణమే.    

భారత సంస్కృతికి దగ్గరగా ఉండడం:

భారతదేశానికి బంగ్లాదేశ్ రవాణా పరంగా దగ్గరగా ఉండడమే కాకుండా సంస్కృతి పరంగా కూడా భారతదేశానికి దగ్గరగా ఉంటుంది. అందుకే అక్కడ కల్చర్ ని ఓన్ చేసుకుని చదువుకోగలుగుతున్నామని విద్యార్థులు తెలిపారు. 

మెడికల్ కాలేజీలు ఎక్కువ:

కాశ్మీర్ నుంచి వెళ్లే విద్యార్థులు కూడా ఎక్కువే. కశ్మీర్ కి చెందిన ఒక యువకుడు బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఉన్న మెడికల్ కాలేజీలో 2019లో చేరారు. అయితే ఆయన చేరిన సమయంలో కశ్మీర్ లో 2 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని.. బంగ్లాదేశ్ లో ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉన్న కారణంగా అక్కడ చదువుకునేందుకు వెళ్లానని అన్నారు.  

ప్రయోజనాలు:

కొన్ని విదేశాలు మినహా మిగిలిన చాలా దేశాల్లో ఎక్కడ వైద్య విద్య పూర్తి చేసినా గానీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ లో పాసవ్వడం అనేది బంగ్లాదేశ్ లో చదువుకున్న వైద్య విద్యార్థులకి చాలా సులువు. దీనికి కారణం భారత్, బంగ్లాదేశ్ లలో సిలబస్ ఒకేలా ఉంటుంది. అందుకే మనోళ్లు బంగ్లాదేశ్ లో చదువుకునేందుకు ప్రాముఖ్యత ఇస్తారని విద్యార్థులు వెల్లడించారు. 

Show comments