ఎంహెచ్370 మిస్టరీని చేధించానంటున్న ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త

Australian Scientist Said Science Solved MH370 Mystery: పదేళ్ల క్రితం 239 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం కనిపించకుండా అదృశ్యమైపోయింది. మూడేళ్ళ పాటు అధికారులు వెతికారు. విసిగిపోయిన అధికారులు ఇక దొరకదని చేతులెత్తేశారు. కానీ ఆ విమానం ఎక్కడుందో తనకు తెలుసునంటూ ఒక శాస్త్రవేత్త చెబుతున్నాడు.

Australian Scientist Said Science Solved MH370 Mystery: పదేళ్ల క్రితం 239 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం కనిపించకుండా అదృశ్యమైపోయింది. మూడేళ్ళ పాటు అధికారులు వెతికారు. విసిగిపోయిన అధికారులు ఇక దొరకదని చేతులెత్తేశారు. కానీ ఆ విమానం ఎక్కడుందో తనకు తెలుసునంటూ ఒక శాస్త్రవేత్త చెబుతున్నాడు.

పదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన మలేషియా ఫ్లైట్ ఎంహెచ్ 370 అదృశ్యానికి సంబంధించిన మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆస్ట్రేలియాకి చెందిన శాస్త్రవేత్త ఒకరు మిస్సింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం పర్ఫెక్ట్ హైడింగ్ ప్లేస్ ని కనుగొన్నట్లు క్లెయిమ్ చేశాడు. 2014లో 239 మంది ప్రయాణికులతో మలేషియాలోని కౌలాలంపూర్ లో విమానం బయలుదేరింది. టేకాఫ్ తర్వాత రాడార్ నుంచి అదృశ్యమైంది. పదేళ్లు గడిచింది. ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. విమానయాన చరిత్రలోనే అత్యంత విస్తృతమైన శోధన ఇది. ఎట్టకేలకు ఆస్ట్రేలియాలోని టాస్మానియా పరిశోధకుడు విన్సెంట్ లైన్ ఆ మిస్టరీని చేధించానని చెడుబుతున్నాడు. ఆ మలేషియా విమానం మిస్ అయిన ప్రదేశం ఇదే అంటూ క్లెయిమ్ చేస్తున్నారు.

ఈ మేరకు తన లింక్డిన్ ఖాతాలో ఒక పోస్ట్ రాసుకొచ్చారు. యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా ఇన్స్టిట్యూట్ ఫర్ మెరైన్ అండ్ అంటార్కిటిక్ స్టడీస్ తో అనుబంధం కలిగి ఉన్న విన్సెంట్ లైన్ చెప్తుందేంటంటే.. ఉద్దేశపూర్వకంగానే ఆ విమానం అదృశ్యమైందని.. హిందూ మహా సముద్రంలోని బ్రోకెన్ రిడ్జ్ గా పిలువబడే సముద్ర పీఠభూమిలో లోతైన కందకంలో కూలిపోయిందని విన్సెంట్ తెలిపారు. ఈ కందకం 20 వేల అడుగుల లోతైన అగాథం అని విన్సెంట్ చెబుతున్నారు. విమానానికి దాచి పెట్టడానికి పర్ఫెక్ట్ హైడింగ్ ప్లేస్ అని చెబుతున్నారు. బ్రోకెన్ రిడ్జ్ సమీపంలోనే మరొక జెట్ ని సముద్రం ఉపరితలం నుంచి 13 వేల అడుగుల లోతులో గుర్తించినట్లు విన్సెంట్ లైన్ వెల్లడించారు.  

ఎంహెచ్ 370 విమానం అదృష్టమైన సమయంలో మాజీ చీఫ్ కెనడియన్ ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేటర్ లారీ వాన్స్ చెప్పిన విషయాలను విన్సెంట్ గుర్తు చేశారు. ఆ విమానంలో తగినంత ఇంధనం ఉందని.. ఒకవేళ ఇంధనం అయిపోయినా గానీ అందులో ఉన్న మాస్టర్ ఫుల్ కంట్రోల్డ్ డిచింగ్ తో ఇంజన్ నడుస్తుందని అప్పట్లో లారీ వాన్స్ చెప్పిన విషయాన్ని విన్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు. శిధిలాల డ్యామేజ్ ని జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా సందేహం లేకుండా సమర్ధించబడుతుందని విన్సెంట్ వెల్లడించారు. అయితే తాను కనుగొన్న ఈ హిడెన్ ప్లేస్ లో విమానం దొరకవచ్చని.. అధికారులు మిస్ అయిన విమానాన్ని వెతకడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్లేస్ ఇదేనని చెబుతున్నారు.

అయితే వెతకాలో లేదో అనేది వారి నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అయినప్పటికీ ఎంహెచ్ 370 మిస్టరీని సైన్స్ పరిష్కరించిందని విన్సెంట్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఎంహెచ్ 370 విమానం హిందూ మహా సముద్రంలోని లక్ష 20 వేల చదరపు కిలోమీటర్ల లోతైన రంధ్రం లాంటి బ్రోకెన్ పీఠభూమిలోకి వెళ్లిపోయింది. 2014లో ఈ ఘటన జరిగింది. 239 ప్రయాణికులతో వెళ్లిన విమానం కనిపించకుండా మాయమైపోయింది. అధికారులు మూడేళ్ళ పాటు వెతికినా విమానం ఆచూకీ దొరకలేదు. కానీ విమాన శిధిలాల ముక్కలు కనిపించాయి. దీంతో జనవరి 2017లో విమాన ఆచూకీ కోసం వెతుకులాటను అధికారులు నిలిపివేశారు. 

Show comments