P Venkatesh
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు ఎప్పుడు కురుస్తాయో చెప్పలేని పరిస్థితి. కానీ ఆకస్మికంగా వచ్చే వర్షాలు మాత్రం బీభత్సం సృష్టిస్తున్నాయి. దుబాయ్ లో సంభవించిన జలప్రళయానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటా వైరల్ గా మారింది.
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు ఎప్పుడు కురుస్తాయో చెప్పలేని పరిస్థితి. కానీ ఆకస్మికంగా వచ్చే వర్షాలు మాత్రం బీభత్సం సృష్టిస్తున్నాయి. దుబాయ్ లో సంభవించిన జలప్రళయానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటా వైరల్ గా మారింది.
P Venkatesh
ఎడారి దేశంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఆకస్మికంగా కురిసిన వానలకు దుబాయ్ అతలాకుతలం అయ్యింది. జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే సముద్రమే వచ్చి దుబాయ్ మీద విరుచుకుపడిందా అనే అనుమానం కలగకమానదు. 24 గంటల వ్యవధిలో కురిసిన కుండపోత వర్షం యావత్ యూఏఈని ముంచేసింది. రోడ్లన్నీ జలమయమై వాహనాలు భారీ సంఖ్యలో కొట్టుకుపోయాయి. అయితే దుబాయ్ లో సంభవించిన ఈ జలప్రళయానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటా వైరల్ గా మారింది. 30 సెకన్లపాటు సాగే ఆ వీడియో చూస్తే ఒళ్లుగగుర్పాటుకు గురవ్వకమానదు.
సాధారణంగా దుబాయ్ లో ఎక్కువగా ఎండతీవ్రత ఉంటుంది. అలాగే పొడివాతావరణమే ఉంటుంది. అలాంటి దేశంలో వానలు బీభత్సం సృష్టించాయి. చరిత్రలో మునుపెన్నడు లేనివిధంగా వర్షం కురిసింది. గత 75 ఏళ్లల్లో ఎన్నడూ చూడని స్థాయిలో వాన కురిసిందని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కుండపోతగా కురిసిన వానకు సంబంధించిన వీడియో చూసిన జనాలు వణికిపోతున్నారు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చూసి భయాందోళనకులోనవుతున్నారు. యూఏఈపై మేఘాలు ఆవరించిన క్షణం నుంచి జడివానగా మారి కుండపోత వర్షం కురిసిన తీరు ఆ వీడియోలో వీక్షించొచ్చు.
దుబాయ్ లో అనూహ్యంగా వచ్చిన జల ప్రళయం వల్ల జనజీవనం అస్తవ్యస్తమై నానా ఇబ్బందులు ఎదుర్కొన్నది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వైమానిక సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దుబాయ్‌కి వెళ్లవలసిన 70కి పైగా విమానాలను రద్దు చేశారు. ఇక ఈ జలప్రళయంతో ఈ ప్రాంతంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల పట్ల మరింత ఆందోళన పెరిగింది. యూఏఈలో ఏటా 200 మిల్లీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం కురుస్తుంది, వేసవి కాలంలో 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
Dubai: Timelapse of the massive storm that caused a historic flood. pic.twitter.com/tackWMYJzO
— Pagan 🚩 (@paganhindu) April 17, 2024