iDreamPost
android-app
ios-app

ప్రపంచంలోనే తొలిసారి తల మార్పిడి.. హాలీవుడ్‌ సినిమాను మించి

  • Published May 23, 2024 | 6:30 PM Updated Updated May 23, 2024 | 6:30 PM

ప్రపంచంలోనే తొలిసారి తల మార్పిడి శస్త్ర చికిత్సకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది. ఆ వివరాలు..

ప్రపంచంలోనే తొలిసారి తల మార్పిడి శస్త్ర చికిత్సకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది. ఆ వివరాలు..

  • Published May 23, 2024 | 6:30 PMUpdated May 23, 2024 | 6:30 PM
ప్రపంచంలోనే తొలిసారి తల మార్పిడి.. హాలీవుడ్‌ సినిమాను మించి

సాంకేతికత అంశంలో మనిషి రోజు రోజుకు అనూహ్య ప్రగతి సాధిస్తున్నాడు. కొత్త కొత్త విషయాలు, టెక్నాలజీలను అభివృద్ధి చేస్తూ.. మానవ జీవితాన్ని మరింత మెరుగ్గా మారుస్తున్నాడు. ఇక వైద్య రంగంలో అయితే నిత్యం ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి. ఎన్నో మొండి రోగాలకు చికిత్స, మందులను కనుక్కోవడంతో పాటుగా మనిషి శరీరం మీద కూడా అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రమాదాల్లో కాళ్లు, చేతులు తెగ పడిపోయిన వారికి.. తిరిగి వాటిని అతికించడం.. సహా అనేక అవయాలు మార్పిడి చేసే వరకు ఎన్నో ప్రయోగాలు విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

ఈమధ్య కాలంలో అయితే మనిషికి మనిషి అవయవాలే కాక.. జంతువుల అవయవాలను కూడా అమర్చుతున్నారు. అయితే ఈప్రయోగాలు విజయవంతం కాకపోయినా.. భవిష్యత్తులో అవయవాల కొరతను నివారించే దిశగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా ఓ మెడికల్‌ స్టార్టప్‌.. ప్రంపంచలోనే తొలిసారి.. తల మార్పిడి శస్త్ర చికిత్సను అభివృద్ధి చేసే లక్ష్యం దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈమేరకు తల మార్పిడి చేస్తోన్న ఓ వీడియోను షేర్‌ చేసి ప్రపంచాన్ని షేక్‌ చేసింది. ఇది విజయవంతం అయితే వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయయం ప్రారంభమంతుంది అంటున్నారు. ఆ వివరాలు..

Head Transplantation

అమెరికాలోని బ్రెయిన్‌బ్రిడ్జ్‌, బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ స్టార్టప్‌ ప్రపంచంలోనే తొలిసారిగా తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యం దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటివరకు రహస్యంగా దీనిపై ప్రయోగాలు చేస్తూ వస్తోన్న కంపెనీ.. తాజాగా తొలిసారి వాటిని బహిర్గతం చేసింది. తమ ప్రయత్నం గురించి ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో.. తమ ప్రయోగాలకు సంబంధించి ఓ వీడియోని విడుదల చేసింది. ఇప్పుడిది ఇంటర్నెట్‌ని షన్‌ చేస్తోంది. ఈ సందర్భంగా బ్రెయిన్‌బ్రిడ్జ్‌ కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘చికిత్స లేని స్థితిలో అనగా.. స్టేజ్‌-4 క్యాన్సర్‌, పక్షవాతం, అల్జీమర్స్‌, పార్కిన్‌సన్స్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి జీవితం మీద ఆశ కోల్పోయిన రోగులకు నూతన జీవితాన్ని ప్రసాదించడమే మా ప్రయోగం ముఖ్య లక్ష్యం.. ఆ దిశగా మా ప్రయత్నాలు సాగుతున్నాయి’’ అని చెప్పుకొచ్చారు. అలానే తల మార్పిడి శస్త్రచికిత్స చేస్తోన్న వీడియోని ఒకదాన్ని రిలీజ్‌ చేశారు.

దీనిలో రెండు రోబోటిక్‌ బాడీలపై ఏకకాలంలో శస్త్రచికిత్స చేస్తున్న రెండు రోబోలు కనిపిస్తాయి. ఇది చూడటానికి హాలీవుడ్‌ సినిమాలోని దృశ్యం మాదిరి కనిపిస్తుంది. ఇది నిజ రూపం దాలిస్తే.. ఈ చికిత్సలో.. రోగి తలను.. బ్రెయిన్‌ డెడ్‌ అయిన దాత శరీరానికి జత చేస్తారు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఇలాంటి అత్యాధునిక చికిత్సపైన న్యూరబుల్‌, ఎమోటివ్‌, కెర్నల్‌ అండ్‌ నెక్ట్స్‌ మైండ్‌, బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ ఫేస్‌ కవంటి కంపెనీలు కూడా ప్రయోగాలు చేస్తున్నాయి.

ఈ సందర్భంగాలో బ్రెయిన్‌బ్రిడ్జ్‌ ప్రాజెక్ట్‌ లీడ్‌ హషేమ్‌ అల్‌-ఘైలీ మాట్లాడుతూ.. ‘‘ఈ చికిత్సలో మెదడు కణాల క్షీణతన నివారించేలా అతుకులు లేకుండా.. తలమార్పిడి చేసేందుకు హైస్పీడ్‌ రోబోటిక్‌ సిస్టమ్‌ను వినియోగించేలా ప్రయోగాలు చేస్తున్నాం. దీనిలో ఉన్న అధునాతన ఏఐ అల్గారిధమ్‌లు తల మార్పిడి శస్త్రచికిత్సలో నరాలు, రక్తనాళాలతో పాటు వెన్నుపాముని కచ్చితంగా తిరిగి కనెక్ట్‌ చేయడంలో రోబోలకు మార్గనిర్దేశం చేస్తాయి. ఈ ప్రయోగం ప్రాణాంతక పరిస్థితులతో పోరాడుతున్న వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించగలదని ఆశిస్తున్నాం’’ అని తెలిపారు.