Kamala Harris: కమలా హారిస్‌ సరికొత్త రికార్డ్‌! ఒక్క జూమ్‌ కాల్​తో 16 కోట్ల విరాళాలు!

అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో అత్యున్నత స్థాయికి వెళ్లిన మహిళగా కమలా హారిస్​ను చెప్పొచ్చు. తొలి ఆసియా-అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఆమె తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు.

అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో అత్యున్నత స్థాయికి వెళ్లిన మహిళగా కమలా హారిస్​ను చెప్పొచ్చు. తొలి ఆసియా-అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఆమె తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు.

అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో అత్యున్నత స్థాయికి వెళ్లిన మహిళగా కమలా హారిస్​ను చెప్పొచ్చు. తొలి ఆఫ్రికా-భారత సంతతి వైస్ ప్రెసిడెంట్ అయిన ఆమె ఈసారి ప్రెసిడెన్షనల్ ఎలెక్షన్స్​లోనూ సత్తా చాటుతున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా కమల పోటీ చేయడం దాదాపుగా ఖరారైనట్లే. ఆమెకు ప్రజల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. కమల ప్రచార సభలకు జనాలు పోటెత్తుతున్నారు. ఓటర్లను నేరుగా కలవడమే గాక క్యాంపెయినింగ్ కోసం సోషల్ మీడియాను కూడా విస్తృతంగా వాడుకుంటున్నారామె. ఈ క్రమంలో తాజాగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. కమలా హారిస్ కోసం గురువారం రాత్రి నిర్వహించిన ఒక జూమ్​ కాల్​లో స్త్రీలు రికార్డు స్థాయిలో పాల్గొన్నారు.

ఒక్క జూమ్ కాల్ ద్వారా ఏకంగా రూ.16 కోట్ల విరాళాలు అందుకున్నారు కమలా హారిస్. సుమారు 90 నిమిషాల పాటు జరిగిన ఈ కాల్​ ద్వారా ఆమె భారీ మొత్తంలో ఫండ్ రైజ్ చేశారు. ఆమెకు మద్దతుగా ‘వైట్ విమెన్: ఆన్సర్ ది కాల్’ పేరుతో నిర్వహించిన ఈ జూమ్ కాల్​కు అమెరికా ప్రజల నుంచి విశేషంగా సపోర్ట్ దొరికింది. గంటన్నర సేపు జరిగిన ఈ కాల్​లో ఏకంగా 1.64 లక్షల మంది పార్టిసిపేట్ చేయడం విశేషం. ఈ కాల్​లో పాల్గొన్న వారిలో సామాన్య మహిళలతో పాటు స్టార్ సింగర్ అలిసియా మూరె, నటి కాన్ని బ్రిటన్, కమెడియన్ కరోల్ లీఫ్ లాంటి సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. సింగర్ పింక్ తన ఫ్లైట్ నుంచి ఈ కాల్​కు అటెండ్ అయ్యారు.

కమలా హారిస్ జూమ్ కాల్ టైమ్​లో తొలుత కమెడియన్ కరోల్ లీఫ్ విరాళాన్ని ప్రకటించారు. 5 లక్షల డాలర్లు ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఆ తర్వాత విరాళాలు భారీగా పోటెత్తాయి. జూమ్ కాల్ హిస్టరీలోనే ఇది అతిపెద్ద గ్రూప్ కాల్​గా మరో రికార్డు సృష్టించింది. జూమ్ కాల్ ద్వారా కమల ఫండ్ రైజ్ చేయడం ఇది మూడోసారి. ఇటీవల ఆమె ఇలాగే రెండుమార్లు ఫండ్ రైజింగ్ కాల్స్ చేశారు. అందులో మొదటిసారి 44 వేల మంది మహిళలు పాల్గొనగా.. 1.5 మిలియన్ డాలర్ల విరాళాలు వచ్చాయి. రెండోసారి 50 వేల మంది పురుషులు హాజరవ్వగా.. 1.3 మిలియన్‌ డాలర్లు అందాయి. కాగా, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రేసు నుంచి జో బైడెన్ తప్పుకొని తన ప్లేస్​లో కమలా హారిస్ పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఆమె అభ్యర్థి రేసులో వచ్చినప్పటి నుంచి డెమోక్రటిక్ పార్టీకి ఊహించని రీతిలో విరాళాలు వస్తున్నాయి.

Show comments