P Krishna
Ellen Hardie: జీవితంలో ప్రతి ఒక్కరూ తమ లైఫ్ హ్యాపీగా సాగిపోవాలని కోరుకుంటారు. కొంతమంది సమాజాన్ని ఎదిరించి తమ కెరీర్ బిల్డ్ చేసుకుంటూ తమకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తుంటారు.. అలాంటి వారు ఈ మద్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నారు.
Ellen Hardie: జీవితంలో ప్రతి ఒక్కరూ తమ లైఫ్ హ్యాపీగా సాగిపోవాలని కోరుకుంటారు. కొంతమంది సమాజాన్ని ఎదిరించి తమ కెరీర్ బిల్డ్ చేసుకుంటూ తమకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తుంటారు.. అలాంటి వారు ఈ మద్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నారు.
P Krishna
దేవుడు సృష్టించిన మనిషి జీవితం అందరికీ ఒకేలా ఉండదని పెద్దలు అంటుంటారు. ఒక్కోక్కరిదీ ఒక్కో లైఫ్ స్టైల్. విచిత్రం ఏంటంటే ఒకరికి మంచి జీవితం అనిపిస్తే.. అదే మరొకరికి వింతగా అనిపిస్తుంది. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎన్నో విచిత్రమైన వార్తలు, వీడియోలు, ఫోటో నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి.ఇటీవల కొంతమంది ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని తమ సొంతంగా కెరీర్ బిల్డ్ చేసుకుంటూ సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి కొద్ది మందిలో ఇంగ్లాండ్ కి చెందిన డ్యాన్సర్ ఒకరు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వార్తలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇంగ్లండ్ కు చెందిన ఎలెన్ హార్డీ (23) అనే యువతికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ అమ్మడు గత రెండేళ్లుగా క్రూయిజ్ షిప్ లో ఒంటరిగా జీవిస్తుంది. మొత్తానికి ఓడ ప్రయాణం ఆమెకు ఓ బాయ్ ఫ్రెండ్ ని ఇచ్చిందని అంటుంది. ఎల్లెన్ హార్డీ క్రూయిజ్ షిప్ లో డ్యాన్సర్ గా పనిచేస్తుంది. 2022లో ఆమె తొలిసారిగా తన 19వ ఏట ఓ క్రూయిజ్ షిప్ లో డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించింది.. ఆ తర్వాత ఒక క్రూయిజ్ షిప్ నుంచి మరొకటి మారుతూ పడవలోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చింది. తన కెరీర్ బిల్డ్ చేసుకుంటూ ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా రెండేళ్ల పాటు పడవ జీవితాన్ని గడిపింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా, ఫిజి, వానువాటు వంటి దేవాలకు సందర్శించింది. ఎల్లెన్ హార్డీ డ్యాన్స్ కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఎలెన్ హార్డీ క్రూయిజ్ షిప్ లో ప్రయాణిస్తున్న సమయంలో లూయిస్ (28) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. లూయిస్ డెక్ ఆఫీసర్, క్రూయిజ్ సిబ్బందిలో సభ్యుడు. వీరిద్దరూ మొదట సింగపూర్ లో కలుసుకున్నారు.. ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రస్తుతం ఎలెన్ నైన్-డే క్రూయిజ్లో ప్రయాణం కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే లూయిస్ కూడా తన పోస్టింగ్ అక్కడే వేయించుకున్నాడు. వేరు వేరు ప్రొఫెషన్ లో ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు.. కలిసి ప్రయాణం చేస్తుంటారు. తన జర్నీ గురించి ఎలెన్ మాట్లాడుతూ.. నేను ఇంటికి చాలా కాలంగా దూరంగా ఉంటున్నాను.. చాల రోజులు నాకు హూమ్ సిక్ అనిపించినా.. ధైర్యంగా నా కెరీర్ ని కొనసాగిస్తూ వచ్చాను. నా చుట్లూ చాలా మంది ఉంటారు.. వాళ్లను ఎంటర్టైన్ చేస్తుంటాను. నన్ను లక్షల మంది అభిమానిస్తున్నారు చాలా సంతోషం. నాకు బాజ్, బ్యాలెట్, ట్యాప్, మోడ్రన్ డ్యాన్సుల్లో మంచి ప్రావిణ్యం ఉంది’ అని తెలిపింది.