P Krishna
America Women Issue: ప్రపంచంలో దేనికీ భయపడని వారు ఎయిడ్స్ కి భయపడతారు. ఎయిడ్స్ అనేది ప్రాణాంతకరమైన వ్యాధి. విచ్చలవిడి శృOగారంలో పాల్గొనడం వల్ల ఎక్కువగా ఎయిడ్స్ భారిన పడుతుంటారు.
America Women Issue: ప్రపంచంలో దేనికీ భయపడని వారు ఎయిడ్స్ కి భయపడతారు. ఎయిడ్స్ అనేది ప్రాణాంతకరమైన వ్యాధి. విచ్చలవిడి శృOగారంలో పాల్గొనడం వల్ల ఎక్కువగా ఎయిడ్స్ భారిన పడుతుంటారు.
P Krishna
ఎయిడ్స్ ప్రాణాంతకరమైన వ్యాధి.. దీనికి చికిత్స లేదు ప్రకటనలు చూస్తూనే ఉంటాం. ఎయిడ్స్ అనే పేరు వింటేనే భయపడిపోతారు. ఎయిడ్స్ అనేది ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనండం వల్ల, రక్త మార్పిడి, తల్లి నుంచి బిడ్డకు, కులుషితమైన సిరంజీ అంటే ఎయిడ్స్ బాధితుడికి వాడిన సిరంజ్ మరొకరికి వాడటం వల్ల ఎక్కువగా సంక్రమిస్తుంది. ఎయిడ్స్ వ్యాధిపై ఎన్నో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయినా కొంతమంది తప్పులు చేస్తూ ఎయిడ్స్ వ్యాధి భారిన పడుతున్నారు. ఓ మహిళ తనకు ఎయిడ్స్ ఉన్న విషయం తెలిసి కూడా దారుణానికి తెగబడింది. ఆమెతో శృంగారంలో పాల్గొన్నవారు లబో దిబో అంటున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల కొంతమంది మగవాళ్లు సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి వేశ్యల (సెక్స్ వర్కర్స్) వద్దకు వెళ్తున్నారు. అప్పటి వరకు అది హ్యాపీగా ఉన్నా.. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చిక్కుల్లో పడతారు. సుఖ వ్యాధులు, ఎయిడ్స్ భారిన పడతారు. విచ్చలవిడి శృంగారం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. అందుకే జీవిత భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధం కొనసాగించాలని అంటారు. అమెరికాలో ఓ సెక్స్ వర్కర్ ఇప్పుడు వందల మంది ప్రాణాలు భయం గుప్పిట్లోకి నెట్టింది. తనకు ఎయిడ్స్ ఉందన్న విషయం దాచి పలువురితో శృంగారంలో పాల్గొంది. ఈ విషయం తెలిసి అధికారులు కంగుతిన్నారు. వెంటనే ఆమెతో శృంగారంలో పాల్గొన్నవారిని అలర్ట్ చేశారు. వెంటనే హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా అప్రమత్తం చేశారు. ఈ దారుణ ఘటన అమోరికాలోని ఒహైయో రాష్ట్రంలో వెలుగు చూసింది.
అమెరికా ఒహైయో లోని మరియోట్టకు చెందిన లిండా లెచెసీ అనే 30 ఏళ్ల మహిళ 2022 జనవరిలో హెచ్ఐవీ పరీక్ష చేయించుకోగా ఆహెకు పాజిటీవ్ అని తేలింది. ఆ విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టింది. అంతేకాదు కొంత కాలంగా సె*క్స్ వర్కర్ గా కొనసాగుతూ వస్తుంది. మరియోట్టాలోని మార్కెట్ లో పురుషులను ఆకర్షిస్తూ వారితో శృOగారంలో పాల్గొనేది. అలా లిండా మూడేళ్ల పాటు 211 మందితో శృOగారం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. లిండా గురించి స్థానిక అధికారులు ఆలస్యంగా తెలుసుకున్నారు.. వెంటనే పబ్లిక్ హెల్త్ నోటీసులు జారీ చేశారు. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ విషయం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.