iDreamPost
android-app
ios-app

75 ఏళ్ల తర్వాత కలిసిన సోదరులు.. కానీ, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు!

75 ఏళ్ల తర్వాత కలిసిన సోదరులు.. కానీ, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు!

పంజాబ్ కు చెందిన సికా ఖాన్, మహ్మద్ సిద్దీఖి అన్నదమ్ములు. వీళ్లు 75 ఏళ్ల కిందట దేశ విభజన సమయంలో ఓ సోదరుడు తన తండ్రితో పాటు పాకిస్థాన్ వెళ్లిపోయాడు. మరో సోదరుడు మాత్రం.. పంజాబ్ లోని తన బంధువుల వద్ద ఉన్నాడు. కట్ చేస్తే.. 75 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ములు మళ్లీ కలుసుకున్నారు. ఆ సమయంలో వారి ఆనందానికి అవదుల్లేకుండా పోయింది. కానీ, వారి సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు. అసలేం జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ బఠిండాలో సికా ఖాన్, మహ్మద్ సిద్దీఖి అన్నదమ్ములు నివాసం ఉండేవారు. అయితే, మహ్మద్ సిద్దీఖి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1947 దేశ విభజన జరిగింది. ఆ సమయంలో మహ్మద్ సిద్దీఖి తన తండ్రితో పాటు పాకిస్థాన్ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అక్కడే తండ్రితో పాటే ఉన్నాడు. సికా ఖాన్ మాత్రం పంజాబ్ లోని తన బంధువల వద్దే ఉండిపోయాడు. కాగా, దాదాపు 75 ఏళ్ల తర్వాత అంటే.. గతేడాది జనవరిలో పాకిస్థాన్ కర్తార్ పూర్ లోని కారిడార్ వద్ద సికా ఖాన్, మహ్మద్ సిద్దీఖి కలుసుకున్నారు.

దీంతో వారి ఆనందానికి అవదుల్లేకుండాపోయింది. సంతోషంతో ఒకరికొకరు మాట్లాడుకుని అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మహ్మద్ సిద్దీఖి పాకిస్థాన్ వెళ్లిపాయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. గత మూడు రోజుల కిందట తన సోదరుడు మహ్మద్ సిద్దీఖి చనిపోయాడని సికా ఖాన్ కు తెలిసింది. ఈ వార్త తెలుసుకున్న అతడు గుండెలు పగిలేలా ఏడ్చాడు. దీంతో తన సోదరుడి కడసారి చేసేందుకు సికా ఖాన్ పాకిస్థాన్ వెళ్లినట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి