Australia Crime News: ఆస్ట్రేలియాలోని సముద్రంలో శవమై తేలిన హైదరాబాద్ యువకుడు!

ఆస్ట్రేలియాలోని సముద్రంలో శవమై తేలిన హైదరాబాద్ యువకుడు!

Australia Crime News: ఇటీవల విదేశాల్లో చదువులు, ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల మరణాలు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. తమ పిల్లలు ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగాలుచేసి సంపాదిస్తారని బావిస్తే.. వారి మృతదేహాలు ఇంటికి రావడం కలవరపెడుతున్నాయి.

Australia Crime News: ఇటీవల విదేశాల్లో చదువులు, ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల మరణాలు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. తమ పిల్లలు ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగాలుచేసి సంపాదిస్తారని బావిస్తే.. వారి మృతదేహాలు ఇంటికి రావడం కలవరపెడుతున్నాయి.

భారత దేశం నుంచి ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించడానికి విదేశాలకు వెళ్తున్నారు. కొంతమంది అక్కడే జాబ్ చేస్తూ బాగా సంపాదిస్తుంటే.. కొంతమంది భారత దేశానికి వచ్చి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు. తమ పిల్లలు సమాజంలో గొప్ప పొజీషన్ లో ఉండాలని తల్లిదండ్రులు తమ తాహతకు మించిన పనైనా పిల్లలను విదేశాలకు పంపించి చదివిస్తున్నారు. ఇటీవల విదేశాల్లో భారతీయ విద్యార్థులపై దారుణాలు పెరిగిపోతున్నాయి. జ్యాత్యహంకారంతో కొంతమంది కాల్పులు జరుపుతున్నారు. బాంబ్ పేలుళ్లు, రోడ్డు ప్రమాదాల, సముద్రంలో మునిగి చనిపోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల చనిపోతున్నారు. తాజాగా విదేశీ గడ్డపై మరో తెగులు తేజం రాలిపోయింది. వివరాల్లోకి వెళితే..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కి చెందిన అరటి అరవింద్ యాదవ్ (30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు. అరవింద్ షాద్ నగర్ బీజేపీ నేత అరటి కృష్ణకు ఏకైక సంతానం. చదువు పూర్తయిన తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోయాడు. ఐదు రోజుల క్రితం నుంచి అరవింద్ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్లు మొదలు పెట్టారు. గత సోమవారం హైదరాబాద్ కి తన కుటుంబ సభ్యులతో వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియాలో వాతావరణం పడక అరవింద్ తల్లి ఉషారాణి వారం రోజుల క్రితం షాద్ నగర్ కి వచ్చింది.

ఈ క్రమంలోనే సోమవారం అరవింద్ తన కుటుంబ సభ్యులతో వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నాడు. ప్రస్తుతం అరవింద్ భార్య గర్ణిణి.. కారు వాష్ చేయించుకోవడానికి బయలకు వెల్లిన అరవింద్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉంటే.. సముద్రంలో ఓ యువకుడి శవం లభ్యమైనట్లుగా స్థానికులు గుర్తించారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఆ మృతదేహం అరవింద్ దే అని ధృవీకరించారు. అయితే అరవింద్ ప్రమాద వశాత్తు సముద్రంలో పడిపోయాడా? లేక అతన్ని ఎవరైనా హత్య చేసి సముద్రంలో పడవేశారా? అన్నకోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

Show comments