iDreamPost
android-app
ios-app

వాహనదారులకు షాక్.. రూ.300 దాటిన లీటర్ పెట్రోల్ ధర!

వాహనదారులకు షాక్.. రూ.300 దాటిన లీటర్ పెట్రోల్ ధర!

రూ.300 దాటిన లీటర్ పెట్రోల్ ధర. ఒకేసారి ఇంత పెరిగిపోవడం ఏంటని షాక్ గురవుతున్నారా? మీరు చదివింది నిజమే. ఉన్నట్టుండి పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. దీనికి తోడు నిత్యవసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలకు అర్థం కాని పరిస్థితులు దాపరించాయి. ఇలా అన్ని రేట్లు ఒకేసారి పెరిగిపోవడంతో ప్రజలు అయోమయంలోకి వెళ్లిపోతున్నారు. ఇంతకు రూ.300 దాటిన లీటర్ పెట్రోల్ ధర ఎక్కడ? అసలు విషయం ఏంటనే పూర్తి వివరాలు మీ కోసం.

భారీగా పెరిగిన పెట్రోల్ రెట్లు తెలుగు రాష్ట్రాల్లో కాదు, అసలు మన ఇండియాలోనే కాదు. అవును మీరు విన్నది నిజమే. భారీగా పెరిగిన ఈ పెట్రోల్, డీజల్ ధరలు మన శుత్ర దేశమైన పాకిస్తాన్ లో. అసలు విషయం ఏంటంటే? పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ దేశంలో పరిస్థితులు ఇప్పుడు మరీ దారుణంగా మారాయి. కరెంట్ బిల్లులు, నిత్యవసర ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు.

అయితే ఈ క్రమంలోనే పాకిస్తాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరిగాయి. పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రభుత్వం లీటరుకు రూ.14.91, డీజిల్ లీటరుకు రూ.18.44 మేర పెంచింది. ఈ దెబ్బతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.311.84కుపెరిగింది. భారీగా పెరిగిన ఈ రేట్లను చూసి వాహనదారులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. ఇక పెరిగిన ఈ ధరలపై ప్రజలు నిరసనలు తెలియజేస్తున్నారు. పాకిస్తాన్ లో భారీగా పెరిగిన ఇంధన ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.