iDreamPost

టమాటా రైతు కంట కన్నీరు.. కిలో రూ. 10 లోపే!

టమాటా రైతు కంట కన్నీరు.. కిలో రూ. 10 లోపే!

నెల రోజుల ముందు వరకు టమాటా ధరలు దిగువ, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపించాయి. టమాటా అంటేనే భయపడేలా చేశాయి. డబ్బున్న వాళ్లు కూడా టమాటా కొనడానికి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కిలో 250 రూపాయల వరకు పలికి షాక్‌ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగింది. టమాటా రైతులు బాగానే సొమ్ము చేసుకున్నారు. టమాటా పంట కారణంగా కొంతమంది రైతులు కోట్లు కూడా సంపాదించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు  ఆ పరిస్థితి మారింది.

టమాటా ధరలు ప్రస్తుతం రైతుల కంట్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కిలో టమాట తెలుగు రాష్ట్రాల్లో 30 నుంచి 40 రూపాయలు పలుకుతోంది. టమాటా మార్కెట్‌ అయిన మదనపల్లి మార్కెట్‌లో కిలో టమాటా ధర దారుణంగా పడిపోయింది. కిలో 9 రూపాయలకు వచ్చేసింది. టమాటా నిల్వలు ఎక్కువగా ఉండటం.. ఇతర ప్రాంతాలనుంచి కొనుగోలు చేసే వారు లేకపోవటం.. ఎక్స్‌పోర్టు చేసేందుకు ట్రేడర్లు ముందుకు రాకపోవటం వల్ల టమాటా ధర ఇంత దారుణంగా తగ్గిపోయింది.

అయితే, ఇక్కడ కూడా రైతులకు అన్యాయం జరుగుతోంది. కమిషన్లు పోగా.. రైతుల చేతికి కేవలం 7 రూపాయలు మాత్రమే అందుతోంది. 20 రోజుల క్రితం వరకు మదనపల్లె మార్కెట్‌లో టమాటా రైతులు భారీ మొత్తంలో డబ్బుల్ని కళ్లజూశారు. ఇప్పుడు పండించిన పంటకు గిరాకీ లేక.. ఖాళీ జేబుల్తో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి. పంట కోసం చేసిన అప్పులు తీర్చలేని స్థితికి చేరుకుంటున్నారు. ప్రతీసారి టమాటా రైతుల విషయంలోనే ఈ విధంగా జరుగుతోంది. ఓ సారి కుబేరుల్లా.. మరోసారి బికురుల్లా వారి జీవితంలో టమాటా ధరలు ఆడుకుంటున్నాయి. మరి, టమాటా ధరలు భారీగా తగ్గటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి