ఆఫ్గన్ పర్వతాల్లో కూలిపోయిన విమానం.. DGCA కీలక ప్రకటన

ఆఫ్గనిస్తాన్ పర్వతాల్లో ఘోర ప్రమాదం చోటుచేసకుంది. బదక్షన్ ప్రావిన్సులో పర్వతాల్లో ఓ విమానం కుప్పకూలిపోయింది. అయితే అక్కడి మీడియా చెబుతున్న దాని ప్రకారం.. ఇది ఇండియన్ విమానం అన్న ప్రచారం జరుగుతుంది.

ఆఫ్గనిస్తాన్ పర్వతాల్లో ఘోర ప్రమాదం చోటుచేసకుంది. బదక్షన్ ప్రావిన్సులో పర్వతాల్లో ఓ విమానం కుప్పకూలిపోయింది. అయితే అక్కడి మీడియా చెబుతున్న దాని ప్రకారం.. ఇది ఇండియన్ విమానం అన్న ప్రచారం జరుగుతుంది.

ఆఫ్గనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. తోప్ ఖానా పర్వత ప్రాంతంలో భారత విమానం కుప్పకూలినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బదక్షన్ ప్రావిన్సులోని జెబాక్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విమానం భారత్‌కు చెందిన విమానం అని న్యూస్ హల్ చల్ చేస్తోంది. కాగా, మరణాల సంఖ్య గానీ, తీవ్రత స్థాయి కానీ, క్షత గాత్రులు విషయాన్ని వెల్లడించలేదు ఆప్ఘాన్ మీడియా. ఈ చార్టర్డ్ విమానం మాస్కోకు వెళుతుండగా క్రాష్ అయినట్లు చెబుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పందించింది.

అది భారతీయ విమానం కాదని ధువ్రీకరించింది. బదక్షన్ ప్రావిన్సులోని కురాన్-ముంజన్, జెబాక్ జిల్లాలతో పాటు తోప్ ఖానా పర్వతాల్లలో కుప్పకూలినట్లు చెబుతున్న విమానం మొరాజో రిజిస్టర్ డిఎఫ్ 10 ఎయిర్ క్రాఫ్ట్ అని డీజీసీఏ తెలిపింది. ‘ఆఫ్గాన్‌లో సంభవించిన దురదృష్టకరమైన విమాన ప్రమాదం భారత్ షెడ్యూల్డ్ విమానం లేదా నాన్-షెడ్యూల్డ్/చార్టర్ ఎయిర్ క్రాఫ్ట్ కాదూ. ఇది మొరాకో రిజిస్టర్ ఉన్న చిన్న విమానం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’ అంటూ డీజీసీఎ సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో వెల్లడించింది. అయితే విమాన రకం, విమానంలో ఉన్న ప్రయాణీకుల సంఖ్య తేలలేదని ప్రావిన్స్ లోని భద్రతా అధికారులు పేర్కొంటున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై విచారణకు బృందాన్ని ఆ ప్రాంతానికి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే భారత్ నుండి ఉజ్బెకిస్తాన్ మీదుగా మాస్కోకు వెళుతున్న కాంపాక్ట్ చార్టర్ జెట్ శనివారం సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వెళుతుండగా.. రాడార్ స్క్రీన్‌ల నుండి అదృశ్యమైనట్లు రష్యా అధికారులు ఆదివారం వెల్లడించారు. దీంతో ఆందోళన నెలకొంది. విమానంలో నలుగురు సిబ్బంది, ఇద్దరు ప్రయాణీకులు సహా ఆరుగురు వ్యక్తులు ఉన్నారని రాయిటర్స్ పేర్కొంటోంది.

Show comments