P Venkatesh
టెక్నాలజీ ఎన్నో సంచలనాలకు నాంది పలుకుతోంది. ఇలాంటి తరుణంలో మరో సంచలనమైన ప్రయోగానికి సిద్ధమయ్యారు సైంటిస్టులు. ఏకంగా మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చారు.
టెక్నాలజీ ఎన్నో సంచలనాలకు నాంది పలుకుతోంది. ఇలాంటి తరుణంలో మరో సంచలనమైన ప్రయోగానికి సిద్ధమయ్యారు సైంటిస్టులు. ఏకంగా మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చారు.
P Venkatesh
నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మనుషులు కంప్యూటర్ తో పోటీ పడి పనిచేసే రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ తో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఎన్నో సంచలనాలకు నాంది పలుకుతోంది. ఇలాంటి తరుణంలో మరో సంచలనమైన ప్రయోగానికి సిద్ధమయ్యారు సైంటిస్టులు. ఏకంగా మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చారు. మనిషి మెదడులో చిప్ ను అమర్చడం సినిమాల్లో చూశాం.. కానీ ఇప్పుడు అదే మనిషి నిజ జీవితంలో జరిగింది. న్యూరాలింక్ సంస్థ తాజాగా మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చింది.
స్విఛ్ వేస్తే ఫ్యాన్ తిరగడం, రిమోట్ తో టీవీలను, ఏసీలను కంట్రోల్ చేయడం సాధారణమే కానీ రానున్న రోజుల్లో కేవలం మనిషి మెదడు ఆలోచనలతోనే వీటన్నింటినీ కంట్రోల్ చేసే టెక్నాలజీ వచ్చేస్తోంది. కూర్చున్నచోటు నుంచే మెదడు ద్వారా ఆపరేట్ చేయొచ్చు. స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్ అధినేత ఎలాన్ మస్క్ మెదడు ద్వారానే ఆపరేట్ చేయగలిగే చిప్‌ను అభివృద్ధి చేసినట్టు కొన్నినెలల క్రితం వెల్లడించారు. ఆ చిప్‌ను మెదడులో అమర్చితే చాలు ఆలోచనలు ఆదేశాలుగా మారి పనులు జరిగిపోతాయి.
తాజాగా ఎలాన్ మస్క్ తాను చెప్పినట్లుగానే సంచలనం సృష్టించారు. మెదడులో చిప్ లు అమర్చడంపై పరిశోధనలు చేసిన న్యూరాలింక్ సంస్థ తాజాగా ఓ వ్యక్తి మెదడులో విజయవంతంగా ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చింది. అయితే ఆ చిప్ అమర్చిన వ్యక్తి ప్రస్తుతం కోలుకుంటున్నాడని ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని న్యూరాలింక్ సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తాజాగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆరంభ ఫలితాల్లో స్పష్టమైన న్యూరాన్ స్పైక్ డిటెక్షన్‌ను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఎలక్ట్రానిక్ చిప్ అత్యంత సురక్షితమైందని విశ్వసనీయమైందని వెల్లడైనట్లు న్యూరాలింగ్ సంస్థ నిపుణులు పేర్కొన్నారు.
కంప్యూటర్ సాయంతో మనిషి మెదడు నేరుగా సమన్వయం చేసుకునే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ ప్రయోగాలకు.. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ-ఎఫ్‌డీఏ 2023 మే నెలలో ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే న్యూరాలింక్ సంస్థ పందులు, కోతుల మెదడులలో ఎలక్ట్రానిక్ చిప్ లను అమర్చి పరీక్షించింది. వాటిల్లో సత్ఫలితాలు రావడంతో మనుషుల్లో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. మరి మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.