iDreamPost
android-app
ios-app

శాటిలైట్ చిత్రాలు: వరదలకు ముందు.. తర్వాత దుబాయ్ ఎలా ఉందో చూడండి..

Nasa- Dubai Satellite Pics After Heavy Rains: ఇటీవల దుబాయ్ లో కురిసిన వర్షాలు అందరినీ కాస్త ఆందోళన పెట్టాయి. అయితే దుబాయ్ ని ఆ వర్షాలు, వరదలు ఎంతా మార్చేశాయో శాటిలైట్ చిత్రాలు చూస్తే గానీ అర్థం కాలేదు.

Nasa- Dubai Satellite Pics After Heavy Rains: ఇటీవల దుబాయ్ లో కురిసిన వర్షాలు అందరినీ కాస్త ఆందోళన పెట్టాయి. అయితే దుబాయ్ ని ఆ వర్షాలు, వరదలు ఎంతా మార్చేశాయో శాటిలైట్ చిత్రాలు చూస్తే గానీ అర్థం కాలేదు.

శాటిలైట్ చిత్రాలు: వరదలకు ముందు.. తర్వాత దుబాయ్ ఎలా ఉందో చూడండి..

దుబాయ్ అంటే అందరికీ ఏం గుర్తొస్తుంది? ఎత్తైన ఆకాశహర్మ్యాలు, లగ్జరీ కార్లు, విలాసవంతమైన జీవితం, ఎటు చూసినా ఎడారి. ఇదే కదా ఎవరికైనా దుబాయ్ అనగానే గుర్తొచ్చేది. కానీ, ఆ లెక్క ఇప్పుడు తప్పింది. ఇటీవల వరదలకు అక్కడ ఎటు చూసిన వర్షపు నీరు, ఈత కొడుతున్న కార్లు, పడవలు వేసుకుని ప్రయాణం చేస్తున్న స్థానికులు కనిపించారు. అందుకు కారణం అకాల వర్షాలు, వరదలే. ఏడాదిన్నర కాలంలో కురవాల్సిన వర్షం కేవలం 24 గంటల్లో కురిసింది. అసలు 75 ఏళ్లల్లో దుబాయ్ ఇలాంటి వర్షాలను చూడనేలేదు. అంతేకాకుండా ఆకాశం ఆకుపచ్చ రంగులోకి మారడం కూడా చూశారు.

ఈ వరదల కారణంగా దుబాయ్ ఎంతగా మారిపోయి ఉంటుంది అనుకుంటున్నారు? వరదల తర్వాత దుబాయ్ పరిస్థితి ఎలా ఉందో అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూనే ఉంది. అందుకు సమాధానం నాసా చెప్పింది. తాజాగా నాసాకు చెందిన ల్యాండ్ శాట్9 ఉపగ్రహం దుబాయ్ భౌగోళిక స్వరూపాన్ని ఫొటోలు తీసింది. ఆ ఫొటోలు చూసిన వాళ్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎడారి, ఇసుక దిబ్బలు నిండిన నేల మొత్తం ముదురు నీలం రంగులో దర్శనం ఇచ్చింది. అవన్నీ వర్షానికి ఏర్పడిన నీటి కుటంలుగా చెప్తున్నారు. ఇంక తేమ కలిగిన నేలలు మొత్తం పచ్చగా పచ్చిక బైళ్లులాగా దర్శనం ఇచ్చాయి. దుబాయ్ లో వర్షం తగ్గుముఖం పట్టిన సరిగ్గా రెండ్రోజుల తర్వాత.. అంటే ఏప్రిల్ 19న నాసాకు చెందిన ల్యాండ్ శాట్ 9 ఉపగ్రహం దుబాయ్ మీదుగా పయనించింది. ఆ సమయంలో తీసిన ఫొటోలను నాసా తాజాగా విడుదల చేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. దుబాయ్ నిజంగా చాలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి నాసా విడుదల చేసిన చిత్రాల్లో.. పచ్చగా, నీటి కుంటలతో కనిపించిన ప్రాంతం ఎమిరేట్ ఆఫ్ పుజైరా. దానిని రాతి ఎడారి అంటారు. అక్కడ రాతి నేలలు, నీరులేని పర్వత ప్రాంతాలు, మైదానాలు ఉంటాయి. నిజానికి యూఏఈలో ఇలాంటి వర్షాలు ఎప్పుడూ గతంలో పడలేదు. కానీ, గత రెండేళ్లుగా అక్కడ భాలీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాతావరణంలో సమతూల్యం దెబ్బ తినడం వల్లే ఇలాంటి మార్పులు, భారీ వర్షాలు కురుస్తున్నాయంటూ అభిప్రాయ పడుతున్నారు. నాసా విడుదల చేసిన తాజా చిత్రాల్లో ఎడారి దేశం నీటి కుంటలతో కనిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.