అరుదైన దోమ వ్యాధి.. వైరస్ సోకిన ముగ్గురిలో ఒకరు మృతి చెందుతున్న వైనం

Rare Mosquito Disease: అరుదైన దోమల ద్వారా సంక్రమించే కొత్త వైరస్ ఒకటి ఇప్పుడు విజృంభిస్తోంది. మలేరియా కంటే మహా డేంజరస్ వ్యాధి అని అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు చనిపోతున్నారని అధికారులు చెబుతున్నారు. ఆ వయసు వాళ్ళకే ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు.

Rare Mosquito Disease: అరుదైన దోమల ద్వారా సంక్రమించే కొత్త వైరస్ ఒకటి ఇప్పుడు విజృంభిస్తోంది. మలేరియా కంటే మహా డేంజరస్ వ్యాధి అని అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు చనిపోతున్నారని అధికారులు చెబుతున్నారు. ఆ వయసు వాళ్ళకే ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు.

యూఎస్ లోని న్యూ హ్యాంప్షైర్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి అత్యంత అరుదైన దోమ ద్వారా సంక్రమించే ఈస్టర్న్ ఈక్వైన్ ఎన్కెఫలైటిస్ అనే వైరస్ వల్ల చనిపోయాడు. ఈ విషయాన్ని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఆ వ్యక్తి తీవ్రమైన కేంద్ర నాడీ వ్యవస్థ వ్యాధితో హాస్పిటల్ లో చేరాడు. వ్యాధి తీవ్రత ఎక్కువవడంతో తట్టుకోలేక చనిపోయాడని న్యూ హ్యాంప్షైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (డీహెచ్హెచ్ఎస్) తెలిపింది. ఆఖరిసారిగా  2014లో న్యూ హ్యాంప్షైర్ లో ఈఈఈవీ ఇన్ఫెక్షన్ సోకింది. ముగ్గురు వ్యక్తుల్లో ఈ హ్యూమన్ వైరస్ ని డీహెచ్హెచ్ఎస్ గుర్తించింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు డిపార్ట్మెంట్ తెలిపింది.   

ఈ కొత్త వైరస్, కొత్త వైరస్ తో మరణాలు అనేవి వాతావరణ మార్పు వల్ల మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. స్వచ్చందంగా కర్ఫ్యూ విధించుకోవాలని, పబ్లిక్ పార్కులను మూసివేయాలని అధికారులు కోరారు. ఏరియల్, గ్రౌండ్ స్ప్రేయింగ్ ని ప్రారంభించి దోమల జనాభాను నియంత్రించాలని కోరారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపిన వివరాల ప్రకారం.. ఈఈఈ వైరస్ వస్తే జ్వరం, తలనొప్పి, వాంతులు, డయేరియా, మూర్ఛ, ప్రవర్తనలో మార్పులు, మగత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ వల్ల మెదడు వాపు వంటి తీవ్రమైన నాడీ సంబంధిత వ్యాధి వస్తుందని.. వెన్నుపాము చుట్టూ పొరలు ఏర్పడతాయని సీడీసీ తెలిపింది. ఈ వైరస్ సోకిన వారిలో సుమారుగా 30 శాతం మంది చనిపోతున్నారని.. బతికి బయటపడ్డవారు శారీరకంగా, మానసికంగా ప్రభావితులవుతున్నారని సీడీసీ వెల్లడించింది.

15 ఏళ్ల లోపు పిల్లలు, 50 ఏళ్ళు పైబడ్డవారికి ఈ వైరస్ రిస్క్ ఎక్కువగా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ వైరస్ కి ఎలాంటి వ్యాక్సిన్ గానీ, చికిత్స గానీ అందుబాటులో లేదని సీడీసీ పేర్కొంది. దోమల వికర్షకాలను ఉపయోగించడం, సురక్షితమైన దుస్తులు ధరించడం, ఇంటి చుట్టూ ఉన్న నిల్వ నీటిని తొలగించడం వంటివి చేయాలని.. దీని వల్ల దోమల ఉత్పత్తి తగ్గుతుందని వైద్య అధికారులు చెబుతున్నారు. క్లైమేట్ సెంట్రల్ అందించిన 2023 నివేదిక ప్రకారం.. తేమ, వెచ్చని పరిస్థితులనేవి దోమలకు అనుకూలంగా ఉంటాయని.. అవి దోమల రోజులని తేలింది. అమెరికాలో గత 4 దశాబ్దాలుగా దోమల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని.. మనిషి కారణంగా మారిన వాతావరణమే ఇందుకు కారణమని వైద్య అధికారులు పేర్కొన్నారు. యూఎస్ లోని న్యూ హ్యాంప్షైర్ రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.  

Show comments