చైనాలో లాయర్ నిర్వాకం.. QR కోడ్ తో దేవుడి సొమ్ము 3.5 లక్షలు కాజేశాడు!

Buddhist Temples: డబ్బు కోసం ఎలాంటి మోసాలకైనా పాల్పపడుతున్నారు.. మనుషులే కాదు ఇప్పుడు దేవాలయాలను కూడా టార్గెట్ చేసుస్తున్నారు కిలాడీ దొంగలు

Buddhist Temples: డబ్బు కోసం ఎలాంటి మోసాలకైనా పాల్పపడుతున్నారు.. మనుషులే కాదు ఇప్పుడు దేవాలయాలను కూడా టార్గెట్ చేసుస్తున్నారు కిలాడీ దొంగలు

ప్రపంచంలో డబ్బు కోసం కొంతమంది ఎలాంటి అక్రమాలకైనా పాల్పపడుతున్నారు. ఎదుటి వారిని మోసం చేస్తూ డబ్బులు గుంజుతున్నారు. ఎప్పటికప్పుడు కేటుగాళ్లు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ మోసాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది కిలాడీలు మనుషులనే కాదు ఏకంగా దేవుడిని కూడా టార్గెట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు దేవాలయాల్లో హుండీలు, నగలు మాయం చేస్తున్నారు. ఓ వ్యక్తి దేవుడికి చెందాల్సిన డబ్బును   టెక్నాలజీ ఉపయోగించి తన ఖాతాలో పడేలా చేసుకున్నాడు. పాపం ఎప్పటికీ దాగదు అన్నట్టు ఆ కేటుగాడి గుట్టు రట్టు చేశారు. పోలీసులు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కొంతమంది కేటుగాళ్లు దేవుళ్లకే శఠగోపం పెడుతున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఓ వ్యక్తి గుడిలో ఉండే హుండీకి తన ఖాతాకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ను పెట్టాడు. దీంతో ఆ గుడికి వచ్చే భక్తులు క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి కానుకలు సమర్పించేవారు. అలా క్యూఆర్ కోడ్ ద్వారా రూ.3 లక్షలకు పైగా సమర్పించుకున్నారు. ఈ ఘరానా దొంగ లా గ్రాడ్యుయేట్ చేశాడు. ఈ ఘటన చైనాలోని బౌద్ద ఆలయంలో చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సదరు కేటుగాడి వ్యవహారం బయటపడటంతో రంగంలోకి పోలీసులు దిగారు. కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు.

ఆ వ్యక్తి యొక్క వివరాలను పోలీసులు తెలుపలేదు. ఈ ఏడాది అతను వాయువ్య షాంగ్సీ ప్రావిన్స్‌, నైరుతి సిచువాన్‌, చాంగ్‌కింగ్‌ ప్రావిన్స్‌లలోని బౌద్ధ దేవాలయాల్లో ఈ మోసానికి పాల్పడ్డానని, దాదాపు 4,200 అమెరికన్‌ డాలర్లు (సుమారు రూ. 3.5 లక్షలు) దొంగిలించానని అతడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. కాగా.. నిందితుడు ఇప్పటివరకు దోచుకున్న డబ్బు మొత్తాన్ని తిరిగి ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ.. ఈ సంఘటన చైనాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో ఇప్పుడు మోసం చేసేందుకు దేవుడి గుడిని కూడా వదలడం లేదని ప్రజలు అంటున్నారు.

Show comments