iDreamPost
android-app
ios-app

Electricity Bill: విద్యుత్ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌.. ఇలా ఈజీగా బిల్ కట్టేయండి!

  • Published Jul 06, 2024 | 5:05 PM Updated Updated Jul 06, 2024 | 5:05 PM

ఇటీవలే థర్డ్‌ పార్టీ జోక్యాన్ని తగ్గించాలే ఉద్దేశంతో ఫేన్‌పో, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు నిలిపివేయలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆయా యాప్స్‌ ద్వారా పేమెంట్ చేస్తున్న వారికి అంతరాయం ఏర్పడంతో ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. అయితే ఇక నుంచి ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు టీజీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో చూద్దాం.

ఇటీవలే థర్డ్‌ పార్టీ జోక్యాన్ని తగ్గించాలే ఉద్దేశంతో ఫేన్‌పో, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు నిలిపివేయలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆయా యాప్స్‌ ద్వారా పేమెంట్ చేస్తున్న వారికి అంతరాయం ఏర్పడంతో ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. అయితే ఇక నుంచి ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు టీజీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Jul 06, 2024 | 5:05 PMUpdated Jul 06, 2024 | 5:05 PM
Electricity Bill: విద్యుత్ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌.. ఇలా ఈజీగా బిల్ కట్టేయండి!

ప్రస్తుత కాలంలో డిజిటల్ పేమెంట్స్ హవా అనేది ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో చాలామంది ఆన్ లైన్ చెల్లింపుల వైపే ఎక్కువగా మగ్గు చూపుతున్నారు. కానీ, విద్యుత్ బిల్లులు చెల్లించే వినియోగదారులకు మాత్రం తాజాగా ఓ బాడ్ న్యూస్ అందిన విషయం తెలిసిందే. ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచనల మేరకు తెలంగాణ విద్యుత్ శాఖ విద్యుత్ బిల్లు చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ విద్యత్ బిల్లులు చెల్లింపుల విషయంలో థర్డ్‌ పార్టీ జోక్యాన్ని తగ్గించాలే ఉద్దేశంతో ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు కుదరవని ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంపై విద్యుత్ శాక అధికారుల ఆయా సేవలను నిలిపివేసింది. ఈ క్రమంలోనే కేవలం టీజీఎస్ పీడీసీఎల్ వెబ్ సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా మాత్రమే విద్యుత్ బిల్లులను చెల్లించాలని సూచించింది.అయితే ఇప్పటి వరకు ఫోన్‌పే, గూగుల్ పే యాప్స్‌ ద్వారా పేమెంట్ చేస్తున్న వారు ఆందోళన పడే వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు టీజీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే థర్డ్‌ పార్టీ జోక్యాన్ని తగ్గించాలే ఉద్దేశంతో ఫేన్‌పో, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు నిలిపివేయలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆయా యాప్స్‌ ద్వారా పేమెంట్ చేస్తున్న వారికి అంతరాయం ఏర్పడంతో ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. అయితే ఇక నుంచి ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు టీజీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, వినియోగదారులు  ఇక నుంచి సింపుల్ గా ఫోన్ లోనే బిల్‌ పేమెంట్‌ చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే టీఎస్‌పీడీసీఎల్ యాప్‌ ద్వారా కరెంట్‌ బిల్లులు చెల్లించే అవకావం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఇది కాస్త ఇబ్బందితో కూడుకున్న ఫ్రొసెస్ కావునా.. దీనిని మరింత సులభంతరం చేసే ఉద్దేశంతో కరెంటు బిల్లులపైనే క్యూఆర్‌ కోడ్‌ ముద్రించే దిశగా టీజీఎస్‌పీడీసీఎల్‌ అడుగులు వేస్తోంది.

 దీంతో ఇకపై  మీ కరెంట్‌ బిల్లుపై ఉన్న క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి బిల్లును సులభంగా పే చేయొచ్చు.  అయితే ఇక్కడ  ఏ నెలకు ఆ నెల బిల్‌పై ఉండే క్యూఆర్‌ కోడ్‌ అప్డేడ్‌ అవుతుంది. ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే మట్టేవాడ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసర్‌ (ఈఆర్‌ఓ) వరంగల్‌, భూపాలపల్లిలో అమలు చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఈ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ క్యూఆర్‌ కోడ్‌ సహాయంతో ఫోన్‌లోని యూపీఐ యాప్స్‌తో స్కాన్‌ చేసి సులభంగా పే చేసుకోవచ్చు. దీంతో థార్డ్‌ పార్టీ యాప్‌లు వసూలు చేసే ఛార్జీల నుంచి కూడా తప్పించుకోవచ్చు. మరి, విద్యుత్ బిల్లును సులభంగా కట్టేందుకు అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ క్యూ ఆర్ కోడ్ ఫ్రొసెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.