Arjun Suravaram
పాకిస్తాన్ లోని చారిత్ర హిందూ ఆలయాన్ని కూల్చివేశారు. ఆ స్థలంలో ప్రస్తుతం ఇక్కడ వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయమై పాకిస్థాన్ కి చెందిన జర్నలిస్టు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
పాకిస్తాన్ లోని చారిత్ర హిందూ ఆలయాన్ని కూల్చివేశారు. ఆ స్థలంలో ప్రస్తుతం ఇక్కడ వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయమై పాకిస్థాన్ కి చెందిన జర్నలిస్టు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Arjun Suravaram
పాకిస్తాన్ దేశాన్ని చూసి ప్రపంచ దేశాలు నవ్వుతున్నాయి. కారణం.. ఆ దేశానికి తన అభివృద్ధి సంక్షేమం కన్నా.. పక్కవారి నాశనాన్ని ఎక్కువగా కోరుకుంటుంది. ఎప్పుడూ పొరుగు దేశమైన భారత్ పై అసుయ పడుతూనే ఉంటుంది. ఇక తన దేశంలోని మైనార్టీలు, వారికి సంబంధించిన సంప్రదాయలకు విలువ ఇవ్వరు. అందుకు నిదర్శనంగా అనేక ఘటనలు పాకిస్తాన్ లో చోటుచేసుకున్నాయి. వివిధ కారణాలు చూపుతూ.. తమ దేశంలో పలు ఆలయాల అభివృద్దికి అడుపడిందని పలువురు జర్నలిస్టు చెబుతుంటారు. తాజాగా ఓ హిందూ దేవాలయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం కూల్చి వేసింది.
ఓ జర్నలిస్టు పాకిస్తాన్ చేసిన ఈ నీచ పనిని బయటపెట్టాడు. పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఒక చారిత్రక హిందూ దేవాలయం ఒకటి ఉంది. భారతదేశం నుంచి పాకిస్తాన్ విభజన జరిగిన తరువాత అనేక పరిణామాలు జరిగిన సంగతి తెలిసిందే. అలా భారత్ నుంచి పాకిస్థాన్ విభజన జరిగిన సమయంలో ఈ ఆలయాన్ని మూసివేశారు. దాదాపు ఇన్నేళ్ల పాటు ఆ గుడి మూసివేసే ఉంది. తాజాగా మూతపడిన ఈ ఆలయాన్ని కూల్చివేసింది పాకిస్థాన్. ఆ స్థలంలో ప్రస్తుతం ఇక్కడ వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయమై పాకిస్థాన్ కి చెందిన జర్నలిస్టు ఇబ్రహీం షిన్వారీ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఖైబర్ ఫఖ్తున్ ఖ్వా ప్రాంతంలోని కోటల్ బజార్ అనే ప్రాంతంలో ఓ పురాతన హిందూ దేవాలయం ఉండేదని ఆయన తెలిపారు. విభజన తర్వాత స్థానిక హిందువులు భారతదేశానికి వెళ్లారని, తరువాత కొంతకాలనికి దాన్ని మూసివేశారని తెలిపాడు.
1992లో అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేసినప్పుడు కొందరు వ్యక్తులు ఇక్కడి ఈ హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారని ఆయన పేర్కొన్నారు. ఇబ్రహీం షిన్వారీ తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆలయానికి సంబంధించిన కథలు విన్నానని తెలిపారు. ఇదే సమయంలో పాకిస్థాన్ లో ఉందే హిందువులు ఈ కూల్చివేతను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ముస్లిమేతరుల మతపరమైన ప్రాముఖ్యత కలిగిన చారిత్రక కట్టడాలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పాకిస్తాన్ హిందూ ఆలయాల నిర్వహణ కమిటీ సభ్యుడు హరూన్ సర్బాడియాల్ అన్నారు. ఇదే సమయంలో స్థానిక అధికారులు ఈ అంశంపై పలు విషయాలు తెలిపారు. లాండి కొటాల్ మార్కెట్‌లోని పాత దుకాణాల మరమ్మతులకు బిల్డర్‌కు ఎన్‌ఓసి జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఖైబర్ జిల్లాలో వివిధ స్థలాలకు సంబంధించి తమ వద్ద కచ్చితమైన, క్రమబద్ధమైన రెవెన్యూ రికార్డులు లేవని అధికారులే అంగీకరించడం ఇక్కడ కొస మెరుపు. ఆలయ స్థలంలో జరుగుతున్న వాణిజ్య నిర్మాణం గురించి తనకు తెలియదని లాండి కోటల్ ప్రాంతానికి చెందిన పట్వారీ జమాల్ అఫ్రిది అన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకాసం చూస్తే.. ఆ స్థలంలో ఏ ఆలయ ప్రస్తావన లేదని వారు తెలిపారు. అదే సమయంలో మైనారిటీల పట్ల ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చడంలో ఫెయిల్ అయిందని, అన్ని ప్రార్థనా స్థలాలు, చారిత్రక కట్టడాలు కనుమరుగవుతాయని ఆయన అన్నారు. మొత్తంగా పాకిస్తాన్ చేసిన ఈ పని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.