iDreamPost
android-app
ios-app

Revanth Reddy: తెలంగాణ CM రేవంత్ రెడ్డికి గుడి.. ఎక్కడంటే

  • Published Mar 07, 2024 | 9:28 AM Updated Updated Mar 07, 2024 | 9:28 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై అభిమానం చాటుకునేందుకు ఓ వ్యక్తి.. ఆయన పేరు మీద గుడి కట్టించబోతున్నాడు. ఆ వివరాలు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై అభిమానం చాటుకునేందుకు ఓ వ్యక్తి.. ఆయన పేరు మీద గుడి కట్టించబోతున్నాడు. ఆ వివరాలు..

  • Published Mar 07, 2024 | 9:28 AMUpdated Mar 07, 2024 | 9:28 AM
Revanth Reddy: తెలంగాణ CM రేవంత్ రెడ్డికి గుడి.. ఎక్కడంటే

మనదేశంలో సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారికి పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. ఇక సిసిమా ఫీల్డ్‌లో ఉండే వారికి ఫ్యాన్స్‌ పెద్ద సంఖ్యలో ఉంటారు. వారి అభిమానం వేరే లెవల్లో ఉంటుంది. అభిమాన తారల సినిమాల విడుదల, వారి జీవితంలో ముఖ్యమైన రోజుల్లో ఫ్యాన్స్‌ చేసే హడావుడి మాములుగా ఉండదు. వారి కటౌటలకి పాలాభిషేకాలు, అన్నదానం, రక్తదానం ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ.. అభిమానం చాటుకుంటూ ఉంటారు. ఇక కొందరైతే అభిమాన తారలకు గుడి కూడా కడుతుంటారు. గతంలో కుష్బు, హన్సిక వంటి తారలకు వారి అభిమానులు గుళ్లు కట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రెండ్‌ కాస్త ఇప్పుడు రాజకీయనాయకులకు కూడా పాకింది. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆమె అభిమానులు ఇలానే గుడి కట్టించి పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ జాబితాలోకి సీఎం రేవంత్‌ రెడ్డి చేరారు. ఆ వివరాలు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభిమానం చాటుకునేందుకు ఓ వ్యక్తి.. ఏకంగా సీఎం పేరిట గుడి కట్టేందుకు రెడీ అయ్యాడు. తన స్వంత స్థలంలో, స్వంత నిధులతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఈ క్రమంలో మార్చి 19 వ తేదీన గుడికి భూమి పూజ చేయనున్నారు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే.. నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వనిపాకలకు చెందిన మేడి సంతోష్. ఇతగాడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే అమితమైన అభిమానం. ఆ అభిమానంతో ముఖ్యమంత్రి అడుగు జాడల్లో నడుస్తూ రాజకీయాలలో రాణిస్తున్నాడు. అంతే కాదు తెలంగాణ రెడ్డి అభిమానుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా సైతం వ్యవహరిస్తున్నాడు. ఇక గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించిన సమయంలో సైతం పాల్గొన్నాడు.

ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సమయం నుండి ప్రజల మధ్యే ఉంటూ, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల ప్రశంసలు పొందుతున్న సీఎం రేవంత్‌ రెడ్డికి గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు సంతోష్‌. ఇందుకోసం తమ గ్రామంలోని తన స్వస్థలంలో రూ. 3 లక్షల సొంత నిధులతో సీఎం రేవంత్ గుడి కట్టబోతున్నట్లు తెలిపాడు. ఈ నెల 19 వ తేదీన ముగ్గురు మంత్రుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, 2 నెలలలో ఈ గుడి నిర్మాణం పూర్తవుతుందని చెప్పుకొచ్చాడు సంతోష్‌. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తూ .. ప్రజల చేత దైవంగా పిలువబడుతున్న సీఎం గుడి కట్టించే అదృష్టం తనకు దక్కిందన్నాడు. సంతోష్‌ చేస్తోన్న పనిపై కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.