iDreamPost
android-app
ios-app

గుడి నిర్మాణానికి స్థలం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్న ముస్లింలు

  • Published May 28, 2024 | 11:32 AMUpdated May 28, 2024 | 11:32 AM

Donation of Muslim Land for Temple: దేశంలో స్వార్థపూరిత శక్తులు హిందువులకు.. ముస్లింలకు ఛాన్స్ దొరికితే గొడవలు పెట్టాలని చూస్తుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. హిందు, ముస్లింలు కలిసి మెలిసి ఉంటున్నారు.. ఒకరి మతాలను మరొకరు గౌరవిస్తున్నారు.

Donation of Muslim Land for Temple: దేశంలో స్వార్థపూరిత శక్తులు హిందువులకు.. ముస్లింలకు ఛాన్స్ దొరికితే గొడవలు పెట్టాలని చూస్తుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. హిందు, ముస్లింలు కలిసి మెలిసి ఉంటున్నారు.. ఒకరి మతాలను మరొకరు గౌరవిస్తున్నారు.

  • Published May 28, 2024 | 11:32 AMUpdated May 28, 2024 | 11:32 AM
గుడి నిర్మాణానికి స్థలం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్న ముస్లింలు

దేశంలో మతం పేరుతో విద్వేశాలు, వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుతున్నాయి.. రాజకీయ నాయకులు ఓట్ల కోసం మతాలను వాడుకొని ఓట్లు దండుకుంటున్న వేళ.. అక్కడ మతసామరస్యం వెల్లువిరిసింది. ఆలయం కోసం ముస్లింలు తమ భూమిని దానం చేశారు. హిందూ ఆలయ నిర్మాణం కోసం తమ భూమిని విరాళంగా ఇచ్చారు. చాలా వరకు దేశంలో హిందువులు, ముస్లింలకు సంబంధించిన గొడవల గురించే వింటూ ఉండేవాళ్లం. తమ స్వార్థం కోసం కొన్ని శక్తులు హిందూ, ముస్లింల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు. కానీ.. కొన్ని ప్రాంతాల్లో హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నారు. తాజాగా ముస్లిం సోదరులు ఆలయ నిర్మాణం కోసం స్థలాన్ని దానంగా ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

దేశంలో కొంతమంది రాజకీయ నేతలు, మత కల్లోలాలు సృష్టించే వారు హిందూ ముస్లింల మధ్య ఎప్పుడూ ఎదో ఒక గొడవ సృష్టిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. కానీ ఇప్పుడు అటువంటి వాటికి విరుద్దంగా.. కొత్త తరానికి హిందూ ముస్లింలు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకరి మతాలను ఒకరు గౌరవిస్తున్నారు.. కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటున్నారు. ఒకరి ఆలయాలకు మరొకరు సాయం చేసుకుంటున్నారు. తాజాగా మత సామరస్యాన్ని చాటే ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. గుడి నిర్మాణానికి స్థలం లేకపోవడంతో మసీదుకు చెందిన స్థలాన్ని ముస్లింలు దానంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

తమిళనాడు తిరుప్పూరు జిల్లా ఓట్టపాళెయం రోస్ గార్డెన్ ప్రాంతంలో హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ మసీదు ఉంది.. కానీ హిందువులకు గుడి లేదు. గుడి కట్టాలన్నా సరైన స్థలం లేకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంంది. ఈక్రమంలోనే ముస్లింలు స్థానిక మసీదుకు చెందిన 3 సెంట్ల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి దానంగా ఇచ్చారు. ప్రస్తుతం గుడి పనులు పూర్తయి సోమవారం కుంభాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి సారెతో వచ్చిన ముస్లిం సోదరులకు హిందులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ నిర్మాణానికి భూమి దానం చేసిన ముస్లింలకు కృతజ్ఞతలు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి