బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్.. ఆలయంలో ఉన్న ఫొటోలు వైరల్!

Keir Starmer Elected As New Prime Minister Of United Kingdom: యూనైటెడ్ కింగ్ డమ్ నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్ ఎన్నిక ఖరారు అయ్యింది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఆలయంలో ఉన్న పిక్స్ కూడా ఉన్నాయి.

Keir Starmer Elected As New Prime Minister Of United Kingdom: యూనైటెడ్ కింగ్ డమ్ నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్ ఎన్నిక ఖరారు అయ్యింది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఆలయంలో ఉన్న పిక్స్ కూడా ఉన్నాయి.

బ్రిటన్ లో కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. లేబర్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 400కు పైగా సీట్లలో జయకేతనం ఎగురవేసింది. బ్రిటన్ కి నూతన ప్రధానికగా కీర్ స్టార్మర్ ఎన్నికయ్యారు. ఆయన ప్రిన్స్ చార్లెస్ 3ని కలిసిన తర్వాత.. కీర్ స్టార్మర్ ఎన్నిక ఖరారు అయ్యింది. ఆయన నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కీర్ స్టార్మర్ ఒక హిందూ దేవాలయంలో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అక్కడ ఆయన అభిషేకం కూడా చేశారు. అందరూ గెలిచిన తర్వాత ఆలయానికి వెళ్లారు అనుకుంటున్నారు. కానీ, అవి ప్రచారంలో ఉన్నప్పటి చిత్రాలు.

శుక్రవారం జరిగిన బ్రిటన్ ఎన్నికల కౌంటింగ్ లో లేబర్ పార్టీ జయ కేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్, వేల్స్, నార్తర్న్, ఐర్లాండ్, స్కాట్లాండ్ వ్యాప్తంగా మొత్తం 650 ఎంపీ స్థానాలు ఉండగా.. లేబర్ పార్టీ ఏకంగా 410 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ కేవలం 118 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో మొత్తం మీద 26 మంది భారత మూలాలు ఉన్న సంతతి విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం స్థాపించేందుకు 326 స్థానాలు కావాల్సి ఉండగా.. లేబర్ పార్టీ 410 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీని ముందుండి గెలిపించుకున్న కీర్ స్టార్మర్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రిన్స్ ఛార్లెస్ 3ని కలిసిన తర్వాత ఆయన ఎన్నిక ఖరారు అయ్యింది.

ప్రధానిగా ఎన్నిక లాంఛనాలు పూర్తి అయిన తర్వాత బ్రిటన్ కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ 10 డౌనింగ్ స్ట్రీట్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముందు ప్రాధాన్యత దేశానికి.. ఆ తర్వాతే పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. బ్రిటన్ లో మౌలిక సదుపాయాలు పునర్నిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కీర్ స్టార్మర్ ఆలయంలో ఉన్న ఫొటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు హిందూ ఓటర్లే టార్గెట్ గా ప్రచారం చేశారు. అందులో భాగంగానే కీర్ స్టార్మర్ కూడా కింగ్స బరీలోని స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. ఇప్పుడు ఆయన విజయం తర్వాత హిందూ ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లేబర్ పార్టీ మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఉన్నాయి. హిందూ ఆలయాల రక్షణ, ఆ వర్గంపై దాడులను ధీటుగా ఎదుర్కొనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

Show comments