Arjun Suravaram
Japan News: వారానికి నాలుగు రోజులే పని దినాలు అంటే.. ఆ ఊహే ఎంతో బాగుటుంది. అదే నిజమైతే ఎంతబాగుండునో అని చాలా మంది అనుకుంటారు. ఆ ఊహలను నిజం చేస్తూ.. ఓ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Japan News: వారానికి నాలుగు రోజులే పని దినాలు అంటే.. ఆ ఊహే ఎంతో బాగుటుంది. అదే నిజమైతే ఎంతబాగుండునో అని చాలా మంది అనుకుంటారు. ఆ ఊహలను నిజం చేస్తూ.. ఓ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Arjun Suravaram
సాధారణంగా చాలా ప్రాంతాల్లో వారాని ఆరు రోజులు పని దినాలు గా ఉంటాయి. ఇక ఐటీ రంగంలో అయితే కేవలం ఐదు రోజులే ఉంటుంది. కొన్ని ప్రాంతాలు అధిక పని గంటలు కూడా ఉంటాయి. మరికొన్నిచోట్ల పని గంటలు తక్కువగా ఉంటాయి. తాజాగా జపాన్ ప్రభుత్వం పని దినాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని పేర్కొంది. మరి.. ఆ దేశం ఏమిటి, అలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమిటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…
జపాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వారానికి నాలుగు రోజులు పని చేసే ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అక్కడి ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానాన్ని 2021లోనే అమలు చేయాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే చాలా కంపెనీలు, వివిధ సంస్థలు జపాన్ తీసుకొచ్చిన విధానాన్ని వ్యతిరేకించాయి. ఇలా చేయడం వల్ల అభివృద్ధి విషయంలో భవిష్యత్ లో జపాన్ వెనుక పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ సమయంలో కేవలం 8శాతం సంస్థలే ఈ వారానికి నాలుగు రోజుల పని దినాలు అనే విధానాన్ని అనుసరించాయి.
ఈ క్రమంలోనే తాజాగా మరోసార ఈ నిర్ణయాన్ని తెరపైకి తీసుకొచ్చింది జపాన్ ప్రభుత్వం. మిగిలిన సంస్థలు కూడా తప్పనిసరిగా తమ ఉద్యోగులతో వారానికి నాలుగుసార్లు మాత్రమే పని చేయించుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగ కల్పించేందుకు ఛాన్స్ ఉంటుందని తెలిపింది. సూక్ష్మ, మధ్య తరహా కంపెనీల్లో మరింత మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని అక్కడి ప్రభుత్వం వివరించింది. ఈ విధానంతో నిరుద్యోగిత సమస్య కొంతైనా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అదే విధంగా తక్కువ పని దినాలు ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ పిల్లల పెంపకంపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని తెలిపింది.
వారానికి నాలుగు పని దినాలను టోక్యోలోని ఓ కంపెనీ అమలు చేస్తోంది. తమ ఉద్యోగులకు శని, ఆదివారాలతో పాటు బుధవారం సెలవు ఇస్తోంది. ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగులు ఒత్తిడికి గురి కాకుండా చురుగ్గా పని చేస్తున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం పేర్కొంది. అంతే కాకుండా తక్కువ పని దినాలు ఉండటంతో ఉద్యోగులు మరింత వేగంగా పనులను పూర్తి చేస్తున్నారని తెలిపింది. మరి..జపాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.