P Krishna
Kandula Jahnavi Accident Case: కర్నూల్ అమ్మాయి కందుల జాహ్నవి గతేడాది అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయింది.. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Kandula Jahnavi Accident Case: కర్నూల్ అమ్మాయి కందుల జాహ్నవి గతేడాది అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయింది.. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
P Krishna
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం, అవగాహన లేకుండా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో తమవారిని కోల్పోయి ఎంతోమంది తీరని దుఖఃంలో మునిగిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని అధికారులు అంటున్నారు. గత ఏడాది అమెరికాలో తెలుగమ్మాయి రోడ్డు ప్రమాదానికి గురైంది.. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే..
గత ఏడాది జనవరి 23న అమెరికా సియోటెల్ లో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని కర్నూల్ జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) అనే యువతి చనిపోయింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు జాహ్నవి మృతికి కారణమైన పోలీస్ ఆఫీసర్ పై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం లేదని తెలిపారు. ప్రమాదానికి కారణమైన పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని అక్కడి న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు బుధవారం వాషింగ్టన్ లో స్టేట్ లోని కింగ్ కౌంటి ప్రాసిక్యూటర్ కార్యాలయంలో ప్రకటన చేసింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని అమెరికాను డిమాండ్ చేయడంతో అప్పటికప్పుడు సియాటెల్ పోలీస్ అధికారి కెవిన్ డేవ్ పై సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతుంది.
డిపార్ట్‌మెంట్ పరమైన క్రమశిక్షణ చర్యలు కెవిన్ డేవ్ పై తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. వచ్చే నెల 4న కెవిన్ డేవ్ పై శాఖాపరమైన విచారణ జరగనుందని, ఆ విచారణలో ఉన్నతాధికారులకు కెవిన్ డేవ్ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, అతని వివరణతో కమిటీ సంతృప్తి చెందకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అసలేం జరిగిందంటే… కర్నూల్ కి చెందిన కందుల జాహ్నవి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. గత ఏడాది జనవరి 23న సియటేల్ లో రోడ్డు దాటుతున్న సమయంలో పోలీస్ పెట్రోల్ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జాహ్నవి తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే చనిపోయింది. పెట్రోలింగ్ కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో 40 కిలోమీటర్ల స్పీడ్ తో ఉండాల్సింది.. రోడ్డు పై 100 కిలో మీటర్ల స్పీడ్ తో దూసుకురావడమే ప్రమాదానికి కారణం అని విచారణలో తేలిసింది. ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అతడిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం అమెరికాకు విజ్ఞప్తి చేసింది. తాజాగా అమెరికా నిర్ణయంపై జాహ్నవి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
కందుల జాహ్నవి కేసు పై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.. ‘ తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవిని కారుతో ఢీ కొట్టి చంపిన అమెరికన్ పోలీస్ పై సరైన ఆధారాలే లేవంటూ కోర్టు వ్యాఖ్యలు చేయడం చాలా అన్యాయం. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అక్కడి ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం చేయాలి.. ఇందుకోసం భారత విదేశాంగ మంత్రి జయశంకర్ వెంటనే జోక్యం చేసుకొని పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలి. ఆమెకు జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోతే అంతకన్నా దుర్మార్గం ఏదీ ఉండదు’ అంటూట్విట్టర్ వేధికగా కామెంట్స్ చేశారు.
Disgraceful & absolutely unacceptable !
I demand the @USAmbIndia to take up the matter with US Government authorities and deliver justice to the family of young Jaahnavi Kandula
I request EA Minister @DrSJaishankar Ji to take up the matter with his counterpart & demand a… https://t.co/90pw59LtCo
— KTR (@KTRBRS) February 22, 2024